విద్యార్థులకు నాణ్యత ప్రమాణాలతో కూడిన విద్యను నేర్పించాలి బీర్పూర్ మండలం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్
బీర్పూర్ జూలై 29 (ప్రజా మంటలు)
పాఠశాలలోని విద్యార్థులకు నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్యను నేర్పించాలని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అధికారులను ఆదేశించారు.
మంగళవారం రోజున బీర్పూర్ మండలంలోని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసారు. ఈ సందర్భంగా కలెక్టర్ పాఠశాలను మొత్తం సందర్శించి విద్యార్థుల స్థితిగతులను, వారికి కల్పిస్తున్న వసతులను అడిగి తెలుసుకున్నారు.
అదే విధంగా విద్యా ప్రమాణాలు, మౌళిక సదుపాయాల తీరును కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ పేర్కొన్నారు. క్లాస్ రూమ్ లో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు అని కలెక్టర్ ఆరా తీశారు. అదే విధంగా ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తున్నారా లేదా అని కలెక్టర్ హాజరు పట్టికను పరిశీలించారు.
పాఠశాలలోని ప్రతీ విద్యార్థి పై ప్రత్యేక దృష్టి సారించాలని, సర్కారు బడుల్లో క్వాలిఫైడ్ ఉపాద్యాయులు పనిచేస్తున్నారని, భావి తరాలకు అవసరమైన విద్యా బోధన చేయడం జరుగుతున్నదని తెలిపారు. వెనుక బడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ద వహించి వంద శాతం ప్రగతి సాధించే విధంగా విద్యా బోధనకు కృషి చేయాలని అన్నారు.
విద్యార్థులతో ముఖాముఖి సంభాషణ జరిపి వారికి పాఠాలు చదివించి వారి బోధన స్థితిగతులను పరిశీలించారు. పాఠశాలలో విద్యార్థుల హాజరు, తరగతుల నిర్వహణ, పారిశుద్ధ్య సౌకర్యాలు వంటి అంశాలను పరిశీలించారు.. విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం భోజనం అందుతున్నదా అనే విషయాన్ని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని, భోజన తయారీ విషయంలో నాణ్యతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
పాఠశాల తరగతి గదులలో పరిసరాల పరిశుభ్రతను పాటించాలని ఉపాధ్యాయులకు ఆదేశించారు. వర్షాకాలం అయినందున దొమలు వృద్ధి చెందే అవకాశం ఉన్నందున పాఠశాల ఆవరణంలో పిచ్చి మొక్కలు తొలగించి, శానిటేషన్ చేయించాలని సూచించారు. ముఖ్యంగా పాఠశాల ఉపాధ్యాయులు సమయపాలన తప్పకుండా పాటించాలని చెప్పడం జరిగింది.
కలెక్టర్ వెంట జిల్లా విద్యాధికారి రాము, DPO మదన్ మోహన్, Housing D.E.భాస్కర్, ఎమ్మార్వో సుజాత, ఎంపిడిఓ, తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
విద్యార్థులకు నాణ్యత ప్రమాణాలతో కూడిన విద్యను నేర్పించాలి బీర్పూర్ మండలం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

హెచ్ టి సర్వీసుల మంజూరుకు సింగిల్ విండో వ్యవస్థ

ఎస్ కె ఎన్ ఆర్ డిగ్రీ కళాశాల 60 వసంతాల ఉత్సవానికి ముఖ్యమంత్రి ఆహ్వానించిన ఎమ్మెల్యే సంజయ్ ,ఎమ్మెల్సీ రమణ
.jpg)
రాయపట్నం గ్రామంలో గంజాయి పట్టివేత
.jpeg)
ఎర్ర పోచమ్మ దేవాలయంలో నాగుల పంచమి ప్రత్యేక పూజలు

మైనర్ బాలికపై అత్యాచారం కేసులలో నిందితునికి 10 సంవత్సరాల జైలు శిక్ష

ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో వన మహోత్సవం

విద్యార్థులకు నాణ్యమైన డిజిటల్ విద్యాబోధన అందించాలి

లబ్ధిదారుల గ్రామలకు వెళ్లి కల్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్

బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జడ్జికు సన్మానం.

భక్తి శ్రద్దలతో.సికింద్రాబాద్ ప్రాంతంలో నాగుల పంచమి

నూతనంగా ఎన్నికైన,జిల్లా జర్నలిస్టుల సంఘం( టి యు డబ్ల్యు జె ఐజేయు), జిల్లాపాఠశాల విద్యాశాఖ ఫోరం, కోశాధికారి, కార్యదర్శికి బ్రాహ్మణ సంఘం సత్కారం
