పెన్షన్ సమస్యల పరిష్కారంకు సంఘటితంగా ఉద్యమిస్తాం -టీ పెన్షనర్ల రాష్ట్ర కార్యదర్శి హరిఆశోక్ కుమార్.
జగిత్యాల జులై 29 (ప్రజా మంటలు):
పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి సంఘటితముగా ఉద్యమించాల్సిన అవసరం ఉందని తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని టీ పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా సంఘ కార్యాలయంలో " పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి కార్యాచరణ" అనే విషయంలో తమ రాష్ట్ర అధ్యక్షుడు గాజుల నర్సయ్య ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి మెమోరాండం నుసమర్పించామన్నారు.
ఈ సందర్భంగా టీ పెన్షనర్స్ సెంట్రల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి పెన్షనర్స్ డైరెక్టరేట్ ను ఏర్పాటు చేయాలన్నారు.తెలంగాణ ఉద్యమంలోపాల్గొన్న పెన్షనర్లకు ఉద్యోగుల కు ఇచ్చినట్లుగా ప్రోత్సాహక ఇంక్రిమెంట్ ప్రకటించాలన్నారు.ఏప్రిల్ 2024 తర్వాత రిటైర్మెంట్ అయినవారికీ పెన్షనరీ ప్రయోజనాలు సత్వరం చెల్లించాలన్నారు.
పెండింగ్ డి.ఏ.లు ఇవ్వాలని,మెరుగైన పీ అర్ ప్రకటించాలని,రూ.398 వేతనం తో నియమించబడ్డ స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని, నగదు రహిత వైద్య చికిత్స కోసం ఈ.హెచ్.ఎస్.ను వెంటనే అమలు చేయాలి. నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ని కోరామన్నారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బొల్లం విజయ్,కోశాధికారి గౌరిశెట్టి విశ్వనాథం , అసోసియేట్ అధ్యక్షుడు పి.సి.హన్మంత రెడ్డి కోరారు. జిల్లా ఉపాధ్యక్షులు వెల్ముల ప్రకాష్ రావు, ఎం.డి.యాకూబ్,ఆర్గనైజింగ్ కార్యదర్శులు పూసాల ఆశోక్ రావు,కొయ్యడ సత్యనారాయణ, సంయుక్త కార్యదర్శి దిండిగాల విఠల్,జగిత్యాల యూనిట్ అధ్యక్షుడు బి.రాజేశ్వర్,కోరుట్ల అధ్యక్షుడు పబ్బా శివానందం, కార్యదర్శి రాజ్ మోహన్,ధర్మపురి అధ్యక్షుడు కండ్లే గంగాధర్,మెట్ పల్లి అధ్యక్షుడు వి.ప్రభాకర్ రావు,మల్యాల అధ్యక్షుడు ఎం.డి.యాకూబ్, రాయికల్ అధ్యక్షుడు వేణుగోపాల్ రావు,జిల్లా, మండల యూనిట్ల ప్రతినిధులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
విద్యార్థులకు నాణ్యత ప్రమాణాలతో కూడిన విద్యను నేర్పించాలి బీర్పూర్ మండలం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

హెచ్ టి సర్వీసుల మంజూరుకు సింగిల్ విండో వ్యవస్థ

ఎస్ కె ఎన్ ఆర్ డిగ్రీ కళాశాల 60 వసంతాల ఉత్సవానికి ముఖ్యమంత్రి ఆహ్వానించిన ఎమ్మెల్యే సంజయ్ ,ఎమ్మెల్సీ రమణ
.jpg)
రాయపట్నం గ్రామంలో గంజాయి పట్టివేత
.jpeg)
ఎర్ర పోచమ్మ దేవాలయంలో నాగుల పంచమి ప్రత్యేక పూజలు

మైనర్ బాలికపై అత్యాచారం కేసులలో నిందితునికి 10 సంవత్సరాల జైలు శిక్ష

ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో వన మహోత్సవం

విద్యార్థులకు నాణ్యమైన డిజిటల్ విద్యాబోధన అందించాలి

లబ్ధిదారుల గ్రామలకు వెళ్లి కల్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్

బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జడ్జికు సన్మానం.

భక్తి శ్రద్దలతో.సికింద్రాబాద్ ప్రాంతంలో నాగుల పంచమి

నూతనంగా ఎన్నికైన,జిల్లా జర్నలిస్టుల సంఘం( టి యు డబ్ల్యు జె ఐజేయు), జిల్లాపాఠశాల విద్యాశాఖ ఫోరం, కోశాధికారి, కార్యదర్శికి బ్రాహ్మణ సంఘం సత్కారం
