నాగ పంచమి పుట్టలో పాలు పోసి పాములను పూజించడం విశేషం ..

On
నాగ పంచమి పుట్టలో పాలు పోసి పాములను పూజించడం విశేషం ..

 
రాయికల్ జూలై28 (ప్రజా మంటలు)
హిందూ సాంప్రదాయంలో 
శ్రావణమాసం శుక్లపక్షంలో వచ్చే పంచమి రోజును నాగ పంచమి అంటారు.
మంగళవారం నాగుల పంచమి సందర్భంగా రాయికల్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తెలుగు పండితులు చెరుకు మహేశ్వర శర్మ నాగుల పంచమి విశిష్టతను వివరించారు.
బ్రహ్మదేవుడు , ఆదిశేషువును అనుగ్రహించిన రోజును నాగ పంచమిగా వ్యవహరిస్తారని అన్నారు.
కార్తీక మాసం లో వచ్చే''నాగులచవితి'' మాదిరిగానే  శ్రావణ మాసంలో నాగ పంచమి నాడు హిందూ మహిళలు బాలికలు నాగ దేవతను పూజించి , పుట్టలో పాలు పోస్తారు. నాగ పంచమి రోజున నాగ దేవతను పూజించిన వారికి , సంవత్సరం పొడుగునా ఏ సమస్యలూ లేకుండా , అన్నీ సవ్యంగా నెరవేరుతాయని , పరిస్థితులు అనుకూలిస్తాయని, నాగదోషం తొలగిపోతుందని హిందువులు విశ్వసిస్తారని ఆయన అన్నారు.

చలి చీమ నుండి  చతుర్ముఖ బ్రహ్మ వరకు , రాయి - రప్ప , చెట్టు - చేమ , వాగు - వరద , నీరు - నిప్పు , అన్నిటా అందరిలోనూ దైవత్వాన్ని దర్శించే విశిష్టమైన సంస్కృతి హిందువులది . హిందువుల దృష్టిలో పాము కుడా పరమాత్మ స్వరూపమే . వేయి పడగల ఆదిశేషుడు విష్ణుమూర్తి కి పాన్పు. వాసుకి పరమేశ్వరుడి కంఠాభరణం. వినాయకుడు నాగ యజ్ఞోప వీతుడని చెరుకు మహేశ్వర శర్మ చెప్పారు.

పురాణాల ప్రకారం  
కశ్యప ప్రజాపతికి , కద్రువ దంపతులకు అనంతుడు , తక్షకుడు , వాసుకి , ననినాగుడు , శంఖుడు , కర్కోటకుడు , ఉగ్రకుడు పిందారకుడు , హహుషుడు , ఐరావతుడు మొదలగు వారు జన్మించి కనబడిన వారినల్లా కాటు వేస్తూ భయభ్రాంతులను చేయసాగారు.
దాంతో సకల దేవతలు బ్రహ్మను వేడుకోగా ఆయన కోపించి తల్లి శాపానికి గురై వారంతా నశిస్తారని శపించాడు. అప్పుడు వాసుకి మొదలైన నాగులంతా విధాత ముందు వినమ్రులై  మమ్మల్ని మీరే సృష్టించి మాకీ విధంగా శాపమివ్వడం న్యాయమా అని వేడుకున్నారు .

విషయుక్తం గా పుట్టినంత మాత్రాన అందర్నీ కాటువేసి ప్రాణికోటిని నశింప జేయడం తప్పు కదా ' నిష్కారణం గా ఏ ప్రాణినీ హింసించరాదు. గరుడ మంత్రం చదివే వారిని , ఔషధమని సమేతులను తప్పించుకు తిరగండి. దేవతా విహంగ గణాలకు , జ్ఞాతులైన మీరు మీమీ స్థాన గౌరవాలను నిలిపుకోండి . వాయుభక్షకులై సాదుజీవులు గా మారండి. మీ నాగులంతా అతల వితల పాతాళ లలో నివాసం చేయండి"* అని బ్రహ్మ శాసించగా వారంతా ఆయన ఆజ్ఞను శిరసావహించారు.

దాంతో దేవతలంతా నాగులను ప్రశంసించారు. భూలోక వాసులంతా ప్రార్ధనలు చేశారు నాగులకు. దివ్య ప్రభావ సంపన్నమయిన నాగజాతికి కృతజ్ఞతాపూర్వకం గా నాగుల జన్మదినమైన నాగపంచమి రోజున వారిని పూజచేయడం మొదలు పెట్టారని చెరుకు మహేశ్వర శర్మ వివరించారు 
వైదిక కాలం నుండి శ్రావణ మాసం ఐదవ రోజు పంచమి ఉత్సవాలు జరుపుకునే సంప్రదాయం భారత దేశమంతా ఉంది. పుట్టలో ఆవుపాలు , వడపప్పు , చలిమిడి , అరటిపండ్లు , కోడి గ్రుడ్లు జారవిడిచి నైవేద్యం గా సమర్పిస్తారని ఆయన అన్నారు.

పూర్వకాలంలో 
పార్వతీ దేవికి పరమేశ్వరుడు చెప్పినట్లు గా పురాణాలలో నాగుల పంచమి ప్రాముఖ్యత ను తెలిపారు.  శ్రావణ మాస శుక్ల పంచమినాడు నాగారాధన చేయడం అత్యంత శ్రేష్టమైనది. ఈ నాగ పంచమి నాడు ద్వారానికి ఇరువైపులా సర్ప చిత్రాలను గోమయంతో రాసి పూజ చేయడం ఎంతో శుభప్రదం. చతుర్థి రోజున ఉపవాస వ్రతాన్ని ఆచరించి పంచమి రోజున బంగారం వెండి , కర్రతోగానీ , లేదా మట్టితోగానీ వారి వారి శక్త్యానుసారం భక్తి భావము తో ఐదు పడగల పాము ప్రతిమను చేయించాలి. లేదంటే పసుపు , చందనంతోగానీ ఏడు తలల పాము చిత్ర పటములు గీచి ఆ రూపాలకు జాజి , సంపెంగ , సన్నజాజి ,మల్లె,గన్నేరు తదితర పుష్పాలతో పూజించాలి. పాయసము , పాలు నివేదన చేయాలని అన్నారు 

గరుడ పంచమిగా కూడా పిలువబడే నాగపంచమి రోజున సూర్యోదయానికి ముందేలేచి శుచిగా స్నానమాచరించి , ఇంటిని శుభ్రం చేసుకోవాలి.
ఇంటి గడప , పూజగదిని పసుపు , కుంకుమలు , పుష్పాలతో అలంకరించుకోవాలి. నాగదేవత ప్రతిమకు నేతితోనూ , పాలతోనూ అభిషేకం చేయించి పెరుగును నైవేద్యంగా పెట్టాలి. పూజ అయ్యాక  ఉత్తముడైన బ్రాహ్మణులకు తాంబూలం , పానకం, వడపప్పులతో సహా  నాగప్రతిమను దానంగా ఇవ్వాలి. నాగపంచమి రోజంతా ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేయాలి. ఈ విధంగా చేసిన వారికి నాగరాజులు అనుగ్రహిస్తారని
పాపాల నుంచి విముక్తి లభించడం , సర్ప భయం తొలగిపోవడం వంటివి జరుగుతాయని
 పురాణాలు శాస్త్రాలు పేర్కొంటున్నాయి. 

పాములను పూజించడం వెనుక సామాజిక మైన హితవు ఉన్నది . యోగాలో కూడా ఇవి ఎంతో ముఖ్యమైన భూమిక పోషిస్తున్నాయి., పాము ‘కుండలినికి’ సంకేతం. స్వభావం , కదలిక , నిశ్చలత్వం వంటి విషయాల్లో కుండలినికి పాములతో ఉండే పోలిక వల్ల , పామును కుండలినికి సంకేతంగా చూస్తారు. ఇంకో అంశం ఏమిటంటే పాము జీవ పరిణామ క్రమంలో చాలా ముఖ్యమయిన మలుపు.  ‘శక్తి’ పరంగా పాము విశిష్ట స్థానంలో ఉంటుంది. పాములు కొన్ని రకాల శక్తులకు ఎంతో స్పందిస్తాయి.  

స్వభావం , కదలిక , నిశ్చలత్వం వంటి విషయాల్లో కుండలినికి పాములతో ఉండే పోలిక వల్ల , పామును కుండలినికి సంకేతంగా చూస్తారు.  హిందూ సంస్కృతిలో  పాముని చంపడం పాపంగా భావిస్తారు.  పాముని చంపినా , పాము మృతదేహాన్ని చూసిన దానికి అంతిమ సంస్కారం చేయడం ఆనవాయితీ. 

కాలసర్ప దోషం ఉన్నవారు , ప్రత్యేకంగా నాగ పంచమి రోజున నాగ దేవతకు విశేష పూజలు నిర్వహిస్తారు.  నాగ పంచమి నాడు పుట్టలో పాలు పోసి  పూజలు చేయడం వలన  దోష నివారణ జరిగి , సుఖసంతోషాలు అనుభూతికి వస్తాయని చెరుకు మహేశ్వర శర్మ వివరించారు.

Tags

More News...

Local News 

శ్రీ చైతన్య స్కూల్‌లో అధికార ప్రదానోత్సవం

శ్రీ చైతన్య స్కూల్‌లో అధికార ప్రదానోత్సవం సికింద్రాబాద్  జూలై 28 (ప్రజా మంటలు): శ్రీ చైతన్య స్కూల్, కార్ఖానాలో అధికార ప్రదానోత్సవం (Investiture Ceremony) ఎంతో ఉత్సాహభరితంగా, విద్యార్థుల ఉత్సాహభరిత  ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ట్రాఫిక్-1, నార్త్ జోన్ ఏసీపీ  జి. శంకర్ రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో ఎల్. మధు బాబు, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్, తిరుమలగిరి పోలీస్...
Read More...
Local News 

సహకార ఎఫ్ పి వో ల సమీక్ష సమావేశం

సహకార ఎఫ్ పి వో ల సమీక్ష సమావేశం . జగిత్యాల జులై 28(ప్రజా మంటలు) జిల్లాలో ఎఫ్.పి.వో ( ఫుడ్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్) లు గా ఎంపికైన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల సమీక్ష సమావేశం సోమవారం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో జిల్లా సహకార అధికారి సి హెచ్. మనోజ్ కుమార్ ఎఫ్ పి వో ల...
Read More...
Local News 

ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధులు మీడియా మిత్రులు

ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధులు మీడియా మిత్రులు    జగిత్యాల జూలై 28 (ప్రజా మంటలు)ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధులు మీడియా మిత్రులు అని బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు, మాజీ జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ అన్నారు.   ఇటీవల జరిగిన జగిత్యాల జిల్లా జర్నలిస్టుల సంఘం TUWJ (IJU) నూతన కార్యవర్గాన్ని సోమవారం జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో  కల్వకుంట్ల...
Read More...
Local News 

నాగ పంచమి పుట్టలో పాలు పోసి పాములను పూజించడం విశేషం ..

నాగ పంచమి పుట్టలో పాలు పోసి పాములను పూజించడం విశేషం ..   రాయికల్ జూలై28 (ప్రజా మంటలు)హిందూ సాంప్రదాయంలో శ్రావణమాసం శుక్లపక్షంలో వచ్చే పంచమి రోజును నాగ పంచమి అంటారు.మంగళవారం నాగుల పంచమి సందర్భంగా రాయికల్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తెలుగు పండితులు చెరుకు మహేశ్వర శర్మ నాగుల పంచమి విశిష్టతను వివరించారు.బ్రహ్మదేవుడు , ఆదిశేషువును అనుగ్రహించిన రోజును నాగ పంచమిగా...
Read More...
National  International   Current Affairs  

ఈయూ అమెరికా  15% సుంకాల ఒప్పందం - తొలిగిన అనుమానాలు

ఈయూ అమెరికా  15% సుంకాల ఒప్పందం - తొలిగిన అనుమానాలు బ్రస్సెల్స్ జులై 28: US మరియు EU సమ్మె సుంకాల ఒప్పందం తర్వాత యూరోపియన్ స్టాక్‌లు 4 నెలల గరిష్టానికి పెరిగాయివాషింగ్టన్ మరియు బ్రస్సెల్స్ మధ్య పూర్తి స్థాయి వాణిజ్య యుద్ధ ముప్పును ఒప్పందం తొలగిస్తుంది.US మరియు EU సమ్మె సుంకాల ఒప్పందం తర్వాత యూరోపియన్ స్టాక్‌లు 4 నెలల గరిష్టానికి పెరిగాయి. వాషింగ్టన్...
Read More...
National  State News 

సాంకేతిక లోపంతో  టెక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే కిందకు దిగిన ఎయిర్ ఇండియా విమానం - ప్రయాణికులు సురక్షితం

సాంకేతిక లోపంతో  టెక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే కిందకు దిగిన ఎయిర్ ఇండియా విమానం - ప్రయాణికులు సురక్షితం న్యూఢిల్లీ జులై 28: ఇండియా విమానంను ప్రారంభించిన ఈవెనిక్కి మళ్ళించారు. ముంబై వెళ్తున్న విమానంలో 'సాంకేతిక లోపం' తప్పని తేలింది; విమాన ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు జైపూర్ నుండి ముంబైకి వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం శుక్రవారం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే అనుమానాస్పద సాంకేతిక సమస్య కారణంగా జైపూర్‌కు తిరిగి రావాల్సి వచ్చిందని అధికారులు PTIకి...
Read More...
Local News 

శ్రీరేణుకా ఎల్లమ్మ టెంపుల్ లో ఘనంగా పలహారబండి ఊరేగింపు

శ్రీరేణుకా ఎల్లమ్మ టెంపుల్ లో ఘనంగా పలహారబండి ఊరేగింపు సికింద్రాబాద్, జూలై 28 (ప్రజామంటలు ): సికింద్రాబాద్ పద్మారావునగర్ వాకర్ టౌన్ శ్రీసాయిబాబా టెంపుల్ పక్కనున్న శ్రీరేణుకా ఎల్లమ్మ ఆలయంలో బోనాల ఉత్సవాల సందర్బంగా నిర్వహించిన ఫలహార బండి ఊరేగింపు కన్నులపండువగా సాగింది. ఈసందర్బంగా శ్రీరేణుకా ఎల్లమ్మ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన లష్కర్ జిల్లా సాధన సమితి అద్యక్షుడు గుర్రం...
Read More...
Local News 

ప్రజావాణి దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలి   అదనపు కలెక్టర్ బి. ఎస్. లత.

ప్రజావాణి దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలి    అదనపు కలెక్టర్ బి. ఎస్. లత. జగిత్యాల జూలై 28(ప్రజా మంటలు)                                   ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి క్షేత్ర స్థాయిలో పరిశీలించి వెంటవెంటనే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ బి. ఎస్. లత సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరెట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను ఆర్డీఓ లతో కలిసి అదనపు కలెక్టర్ బి.ఎస్...
Read More...
Local News 

తప్పిపోయిన వృద్ధ మహిళను క్షేమంగా బంధువులకు అప్పగించిన ధర్మపురి పోలీసులు

తప్పిపోయిన వృద్ధ మహిళను క్షేమంగా బంధువులకు అప్పగించిన ధర్మపురి పోలీసులు ధర్మపురి జులై 28 (ప్రజా మంటలు) బీర్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రేకులపల్లి గ్రామానికి చెందిన మందపల్లి నరసవ్వ వయస్సు79 సంవత్సరాల వృద్ధ మహిళ  అనుకోకుండా గ్రామం నుంచి తప్పిపోయి కనిపించకుండా పోయింది.ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే స్పందించి గాలింపు చర్యలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ధర్మపురి పోలీస్ స్టేషన్ పరిదిలోని  రాయపట్నం చెక్‌పోస్ట్...
Read More...
Local News 

సల్లూరి మల్లేష్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి కొప్పుల

సల్లూరి మల్లేష్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి కొప్పుల వెల్గటూర్ జూలై 27 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం కిషన్రావుపేట గ్రామానికి చెందిన సల్లూరి మల్లేష్ ఇటీవలే హత్యను గురై మృతి చెందగా ఆదివారం వారి కుటుంబాన్ని  మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పరామర్శించారు.అనంతరం వారి కుటుంబానికి 10 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు.ఈ కార్యక్రమంలో మండల బిఆర్ఎస్ పార్టీ...
Read More...
Local News 

మునిసిపాలిటీ పరిధిలోని సీసీ రోడ్డు మరియు డ్రైనేజీల పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్.

మునిసిపాలిటీ పరిధిలోని సీసీ రోడ్డు మరియు డ్రైనేజీల పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్. జగిత్యాల జులై 27 (ప్రజా మంటలు)   ఆదివారం రోజున జగిత్యాల జిల్లా మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డులలో సీసీ రోడ్డు మరియు డ్రైనేజీలు పనులను పరిశీలించి 16 17 వార్డులలో పనులను పరిశీలించి వేగవంతంగా పూర్తి చేయాలని పనులు నాణ్యతంగా ఉండేలా  పాటించాలని అధికారులకు ఆదేశించిన జిల్లా కలెక్టర్ .   అదేవిధంగా వర్షాలు ఎక్కువ  
Read More...
Local News 

జగిత్యాల జిల్లాలో జిపిఓ గ్రామ పాలనాధికారి మరియు లైసెన్స్ ల్యాండ్ సర్వేర్ పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్.

జగిత్యాల జిల్లాలో జిపిఓ గ్రామ పాలనాధికారి మరియు లైసెన్స్ ల్యాండ్ సర్వేర్ పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్.      జగిత్యాల జూలై 27 ( ప్రజా మంటలు) జిల్లా కేంద్రం లోని SKNR గవర్నమెంట్ డిగ్రీ & పీజీ కళలశాలలో ఆదివారం రోజు నిర్వహించిన లైసెన్స్డ్ సర్వేయర్ మరియు గ్రామ పాలన అధికారి పరీక్ష లు  నిర్వహించిన పరీక్ష కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్. ఈ సందర్భగా కలెక్టర్ అన్ని పరీక్ష...
Read More...