హెచ్ టి సర్వీసుల మంజూరుకు సింగిల్ విండో వ్యవస్థ
జగిత్యాల జూలై 29(ప్రజా మంటలు)
వినియోగదారుల హెచ్ టి. 11 KV , 33 KV ఆ పై వోల్టేజి సర్వీసుల మంజూరు వేగవంతం చేయడానికి సింగిల్ విండో వ్యవస్థ ఎంతగానో దోహదపడుతుందని జగిత్యాల సర్కిల్ సూపెరింటెండింగ్ ఇంజనీర్ బి. సుదర్శనం స్పష్టం చేశారు .
హెచ్ టి. 11 KV , 33 KV, ఆ పై వోల్టేజి సర్వీసుల మంజూరుకు మరింత సరళీకృతం చేయడానికి హెచ్ టి మానిటర్ సెల్ ను సర్కిల్ ఆఫీస్, కార్పొరేట్ ఆఫీస్ లో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు .
ఇందులో భాగంగా 11 KV వోల్టేజి దరఖాస్తులను సర్కిల్ ఆఫీస్ ఏ.డి.ఈ కమర్షియల్ అధికారి మానిటర్ చేస్తారని, అలాగే 33 KV వోల్టేజి, ఆపై వోల్టేజి దరఖాస్తులను ఏ.డి.ఈ కమర్షియల్ కార్పొరేట్ ఆఫీస్ అధికారి మానిటర్ చేస్తారన్నారు .
ఈ సింగిల్ విండో కొత్త విధానం వలన మొదట వినియోగదారులు TGNPDCL పోర్టల్‌లో అవసరమైన పత్రాలతో HT దరఖాస్తులు( టీజీ ఐపాస్ లో నమోదు కానటువంటివి) నమోదు చేసుకున్న తర్వాత కొత్త అప్లికేషన్ నంబర్ (UID) ఉత్పన్నమవుతుంది . అలా వచ్చిన కొత్త దరఖాస్తులు TGNPDCL యొక్క సంబంధిత సర్కిల్‌లలో డాష్ బోర్డులో కనిపిస్తుంది. ప్రతిరోజూ ADE/కమర్షియల్ అధికారులు డాష్ బోర్డుని మానిటర్ చేస్తూ ఉంటారు..
దరఖాస్తు నమోదు చేసుకున్న తర్వాత 11KV , 33 KV ఆ పై వోల్టేజి దరఖాస్తులు సంబంధిత అధికారులకు ఎస్టిమేట్ల కొరకు పంపించబడుతుందని , ADE/కమర్షియల్ సర్కిల్ ఆఫీస్ ఫీల్డ్ స్టాఫ్ ఫీజిబిలిటీ కోసం అవసరమైన మౌలిక సదుపాయాల కోసం లొకేషన్‌ను సందర్శిస్తారు. 33 KV మరియు ఆ పై వోల్టేజి ఎస్టిమేట్లను కార్పొరేట్ ఆఫీస్ అధికారులు అనుమతులు ఇస్తారు.
ఇక 33KV ఆ పై వోల్టేజి దరఖాస్తులు అయితే, ఆన్‌లైన్‌లో సంబంధిత CE/కమర్షియల్ & RAC/TGTRANSCO హైదరాబాద్ కి ఫీజిబిలిటీ కోసం పంపించబడుతుంది .
11KV వోల్టేజి దరఖాస్తులు పరిశీలించి ఫీజిబిలిటీ ఉంటె రెండు రోజుల్లో అప్‌లోడ్ చేయబడుతుంది. వివిధ కారణాల వల్ల సాధ్యపడకపోతే, 2 రోజులలోపు ఆ సూచనలు వినియోగదారునికి SMS రూపేణా పంపబడుతుంది. అలాగే 33 కె వి,ఆపై వోల్టేజి దరఖాస్తులు పరిశీలించి వాటికీ కావాల్సిన మౌలిక వసతుల ఏర్పాటుకు పొందుపరచిన సమయానుగుణంగా మంజూరు చేయడం జరుగుతుందన్నారు .
సింగిల్ విండో వ్యవస్థ వలన త్వరిత గతిన సర్వీసులు మంజూరు అవుతాయని, ప్రతి సారి ఆఫీసులకు రాకుండా ట్రాక్ చేసుకునే సౌకర్యం ఉందని అన్నారు . దీని వలన అత్యంత పారదర్శకత పెరుగుతుందని, వినియోగదారులకు దరఖాస్తుల స్థితి గతులను ఎప్పటి కప్పుడు ఎస్ ఏం ఎస్ రూపేణా సమాచారం పంపబడుతుందని వివరించారు .
More News...
<%- node_title %>
<%- node_title %>
విద్యార్థులకు నాణ్యత ప్రమాణాలతో కూడిన విద్యను నేర్పించాలి బీర్పూర్ మండలం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

హెచ్ టి సర్వీసుల మంజూరుకు సింగిల్ విండో వ్యవస్థ

ఎస్ కె ఎన్ ఆర్ డిగ్రీ కళాశాల 60 వసంతాల ఉత్సవానికి ముఖ్యమంత్రి ఆహ్వానించిన ఎమ్మెల్యే సంజయ్ ,ఎమ్మెల్సీ రమణ
.jpg)
రాయపట్నం గ్రామంలో గంజాయి పట్టివేత
.jpeg)
ఎర్ర పోచమ్మ దేవాలయంలో నాగుల పంచమి ప్రత్యేక పూజలు

మైనర్ బాలికపై అత్యాచారం కేసులలో నిందితునికి 10 సంవత్సరాల జైలు శిక్ష

ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో వన మహోత్సవం

విద్యార్థులకు నాణ్యమైన డిజిటల్ విద్యాబోధన అందించాలి

లబ్ధిదారుల గ్రామలకు వెళ్లి కల్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్

బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జడ్జికు సన్మానం.

భక్తి శ్రద్దలతో.సికింద్రాబాద్ ప్రాంతంలో నాగుల పంచమి

నూతనంగా ఎన్నికైన,జిల్లా జర్నలిస్టుల సంఘం( టి యు డబ్ల్యు జె ఐజేయు), జిల్లాపాఠశాల విద్యాశాఖ ఫోరం, కోశాధికారి, కార్యదర్శికి బ్రాహ్మణ సంఘం సత్కారం
