ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే 2025 వేడుకలు
సికింద్రాబాద్, జూలై 03 (ప్రజామంటలు) :
సికింద్రాబాద్ క్రిస్టియన్ ప్రెస్ క్లబ్ లో గురువారం యేసుక్రీస్తు ప్రభువుతో జీవించిన శిష్యులు సెయింట్ తోమా హతసాక్షిగ చనిపోయిన రోజును పురస్కరించుకొని ఇండియన్ క్రిస్టియన్ భక్తి దినోత్సవంగా జరుపుకున్నారు. సికింద్రాబాద్ లో క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో సెయింట్ థామస్ చేసిన సువార్త పరిచర్యను కొనసాగించాలని తీర్మానించారు. హిందూమతోన్మాద సంస్థలు ఆరోపిస్తున్నట్లు గా క్రైస్తవం బ్రిటిషువారి మతం కాదు, క్రీస్తుశకం 0052 లో థామస్ ఇండియాలో కేరళ ప్రాంతం వచ్చి యేసుక్రీస్తు బోధనలు చేస్తూ క్రీస్తు శకం 0072 లో తమిళనాడు సెయింట్ తోమా చర్చి సమీపంలో మతోన్మాదులు దాడిలో చనిపోయి ప్రాణత్యాగం చేశారని తెలిపారు. క్రీస్తుశకం 1608 లో ఆంగ్లేయులు వ్యాపారం కొరకు ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్ఛిందని. కాబట్టి ఇంగ్లీష్ వారికంటే సుమారు 1500 సంవత్సరాలకు ముందే క్రైస్తవం ఇండియాకు వచ్చిందని తెలంగాణ క్రైస్తవ సేన వ్యవస్థాపకులు నాగళ్ళ ఇశ్రాయేల్ తెలిపారు. సమావేశం అనంతరం కేక్ కట్ చేశారు.ఈ కార్యక్రమంలో ఆనంద్, జెరుసాలేము మత్తయ్య , ఆండ్రూస్ జేవియర్, మోజెసెస్, రోమ్ చౌదరి, మెర్సీ , హరిత, అర్చన పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
6 లక్షల మంది భక్తులు బల్కంపేట అమ్మవారిని దర్శించుకున్నారు - పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డా. కోట నీలిమ

బహుముఖ ప్రజ్ఞాశాలి, వ్యక్తిత్వ వికాసానికి మార్గదర్శి పట్టాభిరామ్

ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే 2025 వేడుకలు

బన్సీలాల్ పేట లో వెలుగు చూసిన బోనాల చెక్కుల గోల్ మాల్

డెంగ్యూ పాజిటివ్ కేసు..అప్రమత్తమైన అధికారులు

రేపటి నుంచి వారం పాటు శ్రీసాయి సప్తాహ ఉత్సవాలు

ఆర్థికంగా వెనుకబడిన అమ్మాయి చదువుకి శ్రీ సత్యసాయి సేవా సమితి ఆర్థిక చేయూత

రాయికల్ మండల కేంద్రంలో సామాజిక ఆరోగ్య కేంద్రంను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్

సేవా భారతి ఆధ్వర్యంలో గోరింటాకు వేడుకలు.

పద్మశాలి సేవ సంఘ భవన నిర్మాణానికి నిధుల కోసం ఎమ్మెల్యే కు వినతి

మలేసియా సదస్సుకు జగిత్యాల జిల్లావాసి గల్ఫ్ కార్మికుల స్థితిగతులపై అంతర్జాతీయ సదస్సు

షిర్డీ సాయి మందిరంలో ఘనంగా సాయి చరిత్ర పారాయణం ప్రారంభం
