రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు. అదనపు కలెక్టర్ బి.ఎస్ లత.
జగిత్యాల మే 30(ప్రజా మంటలు)
జిల్లాలో నిర్వహించు రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ బి.ఎస్ లత సంబంధిత అధికారులను ఆదేశించారు.
శుక్రవారం రోజున అదనపు కలెక్టర్ బి.ఎస్ లత సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల ఏర్పాట్ల పై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా *అదనపు కలెక్టర్ బి.ఎస్ లత మాట్లాడుతూ* రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు సమీకృత జిల్లా కలెక్టరేట్ లో జరుగుతాయని, జిల్లాలోని ప్రతి శాఖకు చెందిన అధికారులు , సిబ్బంది వేడుకలకు తప్పనిసరిగా హాజరు కావాలని అదనపు కలెక్టర్ తెలిపారు.
రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు సంబంధించి ఫ్లాగ్ ఏర్పాట్లు, గ్రౌండ్ సిద్దం చేయడం మొదలగు ఏర్పాట్లు పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు సమన్వయంతో పూర్తి చేయాలని అన్నారు. రాష్ట్ర అవతరణ వేడుకల వేదిక , సీటింగ్ ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ ఆర్ &బీ అధికారులను ఆదేశించారు. ప్రోటోకాల్ ప్రకారం సీటింగ్ ఏర్పాట్లు చేయాలని, అన్నారు.
వేడుకల వద్ద ఏ.ఎన్.ఏం ఆధ్వర్యంలో వైద్య బృందాలచే వైద్య శిభిరాలు ఏర్పాటు చేయాలని, అవసరమైన మేర త్రాగు నీటి సరఫరా పనులు మున్సిపల్ కమిషనర్ ఏర్పాటు చేయాలని అదనపు కలెక్టర్ తెలిపారు. వేడుకలకు ఆహ్వాన పత్రాలు ప్రోటోకాల్ ప్రకారం ప్రతి ఒక్కరికీ అందాలని అన్నారు.
జగిత్యాల పట్టణంలోని స్వశక్తి మహిళా సంఘాల ప్రతినిధులు హజరయ్యేలా మెప్మా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. ముఖ్య అతిథి అందించే సందేశం రూపొందించేందుకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల వివరాలను క్లుప్తంగా మే 28 నాటికి సాయంత్రం నాటికి అందజేయాలని అన్నారు.
ముఖ్య అతిథి గౌరవ వందనం, ఇతర బందోబస్తు ఏర్పాటు పకడ్బందిగా చేయాలని అన్నారు.
ఈ సమావేశంలో జగిత్యాల జిల్లా అదనపు, ఎస్పీ భీమ్ రావు వివిధ జిల్లా శాఖల అధికారులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు .
More News...
<%- node_title %>
<%- node_title %>
తల్లిదండ్రుల దినోత్సవం - జన్మదాతలకు పాదపూజ

నిరుపేద బాలిక వైద్యం కోసం 1.21 లక్షలు విరాళాలు.

మున్నూరు కాపు సంఘ అభివృద్ధిలో యువత భాగస్వాములు కావాలి

ఫుట్ పాత్ అనాధలకు దుస్తులు, మందుల పంపిణీ

పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

పావని కంటి ఆసుపత్రిలో ఉచిత నేత్ర చికిత్సలు అద్దాలు మందుల పంపిణీ

రాష్ట్ర ప్రభుత్వం అందించే అత్యంత ప్రతిషాత్మకమైన పోలీస్ పతకాల ను అందుకోనున్న జిల్లా పోలీసులు.

తెలంగాణ జాగృతి కార్యాలయ కార్యదర్శిగా పొన్నమనేని బాలాజీ రావు
.jpg)
ఈసారి వానలు బాగా ఉన్నాయి...అధికారులు అప్రమత్తంగా ఉండాలి
.jpg)
మారువేషంలో కిలాడీ లేడీ దొంగతనం

రాజమాత అహల్యాబాయి హోల్కర్ ను కీర్తిస్తూ శోభాయాత్ర*

ఎన్ఎమ్సీ చైర్మన్ తో భేటి అయిన జూడా ప్రతినిధులు
