గ్యారెంటీ లేని 6 గ్యారెంటీలను నమ్మకండి - బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ బోగ శ్రావణి

On
గ్యారెంటీ లేని 6 గ్యారెంటీలను నమ్మకండి  - బీజేపీ  రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ బోగ శ్రావణి

మాటలకే పరిమితమైన కాంగ్రెస్.. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పథకాల వివరిస్తూ  ప్రచారంలో దూసుకుపోతున్న బిజెపి

మాటలకే పరిమితమైన కాంగ్రెస్..

కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పథకాల వివరిస్తూ  ప్రచారంలో దూసుకుపోతున్న బిజెపి

గ్యారెంటీ లేని 6 గ్యారెంటీలను నమ్మకండి

-జాబితాపూర్ వెల్దుర్తి గ్రామస్తులతో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ బోగ శ్రావణి

జగిత్యాల , ఏప్రిల్ 27(ప్రజా మంటలు జిల్లా ప్రతినిధి):

జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ వెల్దుర్తి గ్రామాలలో  స్థానిక గ్రామస్తులు,మహిళలతో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల్ నియోజకవర్గం ఇంచార్జ్ డాక్టర్ బోగ శ్రావణి   సమావేశమయ్యారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ

మాటలకే కాంగ్రెస్ ప్రభుత్వం పరిమితమయ్యాయని,  6 గ్యారెంటీ ల పేరుతో ప్రజలు మోసం చేస్తున్నారని ప్రభుత్వంపై  ధ్వజమెత్తింది.

రైతులకు  బోనస్ ఎక్కడ పోయిందని వివాహానికి తులం బంగారం ఎక్కడుందని మండిపడ్డారు. ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని  ప్రజలు గ్రహించాలని మోసం చేస్తున్న పార్టీని గెలిపించకుండా, కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ  నిజామాబాద్ పార్లమెంటు ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ను ఎంపీగా అత్యధిక మెజార్టీతో మరోసారి గెలిపించాలని  కోరారు.మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మహిళల అభివృద్ధి సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నది.

అన్ని రంగాలలోనూ మహిళల సాధికారత కోసం మహిళలు స్వయంగా నిలదొక్కుకోవడం కోసం విశేషమైన కృషి చేస్తున్నది మహిళా స్వయం సహకార బృందాల సభ్యులకు ఆర్థికంగా పరిపుష్టం చేయడానికి చిత్తశుద్ధితో కష్టపడుతున్నది కేంద్ర ప్రభుత్వం మన నిజాంబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని మహిళా సంఘాల ద్వారా మహిళలకు గత ఐదేళ్లలో  రూపాయలు 6,382 కోట్ల రుణాల పంపిణీ జరిగింది.

ప్రతి పేదింటి మహిళలకు సొంత ఇల్లు ఉండాలన్నది బీజేపీ ప్రభుత్వా లక్ష్యం ఆ లక్ష్యం కోసం ఇప్పటిదాకా ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా దేశ వ్యాప్తంగా దాదాపు నాలుగు కోట్ల పేద కుటుంబాలకు సొంత ఇంటిని అందించిన ఘనత మన ప్రధాని నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది అని అన్నారు.

ఈ కార్యక్రమంలో రూరల్ మండల అధ్యక్షుడు నలువాల తిరుపతి, అరిగేల శ్రీకాంత్, శెట్టి రవి,కుసరి మహేష్, బొక్కల కిషన్, సంతోష్,బోగ నరేష్,రాగి నరేష్, బొమ్మెన శ్రీనివాస్ మరియు బిజెపి సీనియర్ నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Tags