సెంట్రల్గే లైబ్రరీ గేటు వద్దనే గ్రూప్-1 అభ్యర్థులతో కవిత "మాట ముచ్చట"
ఇది వరకు ఉన్న ప్రభుత్వం అన్యాయం చేసినందుకే ఆ ప్రభుత్వాన్ని ఓడించారు.
విద్యార్థులతో కలిసి చాయ్ తాగిన కవిత, పోలీసుల అదుపులో తెలంగాణ జాగృతి నాయకులు
సెంట్రల్ లైబ్రరీలోనికి వెళ్లకుండా పోలీసుల అడ్డగింత
చిక్కడపల్లి హైదరాబాద్ అక్టోబర్ 14 (ప్రజా మంటలు):
గ్రూప్ -1లో జరిగిన అక్రమాలపై విద్యార్థులతో చర్చించేందుకు చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీకి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వెళ్ళారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, తెలంగాణ జాగృతి నాయకులు చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు.
సెంట్రల్ లైబ్రరీ ప్రధాన ద్వారం లోపలికి వెళ్లి విద్యార్థులతో మాట్లాడదానికి వెళుతుండగా, పోలీసులు అడ్డగించడంతో,. కాంగ్రెస్ ప్రభుత్వం, పోలీసులకు వ్యతిరేకంగా జాగృతి నాయకుల నినాదాలు చేశారు.సెంట్రల్ లైబ్రరీ గేటు వద్దనే బైఠాయించి కల్వకుంట్ల కవిత, జాగృతి నాయకులు ఆందోళనకు దిగారు.
అనంతరం మీడియాతో కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ, గ్రూప్ -1లో జరిగిన అక్రమాలపై విద్యార్థులతో మాట్లాడేందుకు ఇక్కడికి వచ్చాను.. లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు.కేసీఆర్ పరిపాలనలో కూడా అవకతవకలు జరిగాయని విద్యార్థులు చెప్పారు.ఆనాడైనా, ఈనాడైనా విద్యార్థులకు న్యాయం జరగాలనే నేను కోరుతున్నానాని అన్నారు.
విద్యార్థులకు ఉద్యోగాలు రావాలనే తెలంగాణ తెచ్చుకున్నాం. గ్రూప్ -1 లో అక్రమాలు జరిగాయని ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. ఈ ఎగ్జామ్ ను రద్దు చేసి మళ్లీ రీ ఎగ్జామ్ పెట్టండి. ప్రభుత్వం పారదర్శకంగా రిక్రూట్ మెంట్లు చేసి ఉంటే రాత్రికి రాత్రే అపాయింట్ మెంట్లు ఇవ్వాల్సిన అవసరమేముందని ఆమె ప్రశ్నించారు.
మా పేపర్లను ఇస్తామంటూ ప్రతి విద్యార్థి ఛాలెంజ్ చేస్తున్నాడు. ఉద్యోగాలు వచ్చిన వారి పేపర్లు బయట పెట్టడానికి ప్రభుత్వానికి భయం ఎందుకు? ర్యాంకర్ల పేపర్లు ఇచ్చేందుకు ప్రభుత్వం ఎందుకు వెనక్కి పోతుంది. ప్రతిభ, ధైర్యం ఉన్న విద్యార్థులు ఛాలెంజ్ చేస్తుంటే ప్రభుత్వం ఎందుకు ముందుకు రావటం లేదనీ అన్నారు.
అర్హత లేని వారికి ఉద్యోగాలు రావద్దనే మేము కోరుతున్నాం.
ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ను తుంగలో తొక్కి నాన్ లోకల్స్ 8 మందికి ఉద్యోగాలు ఇచ్చారు.మేము ఆంధ్రోళ్లకు ఉద్యోగాలు రావాలని ఉద్యమాలు చేయలే. తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాల కోసం ఉద్యమాలు చేశాం.
రాహుల్ గాంధీ గారు బీహార్ ఎన్నికల్లో తిరుగుతూ తెలంగాణలో విద్యార్థులకు అన్యాయం జరుగుతున్నా పట్టించుకోవటం లేదు.రాహుల్ గాంధీ ఇక్కడకు రావాలి. లేదంటే మేము బీహార్ కు వస్తాం. ఈ విధంగా విద్యార్థులకు అన్యాయం చేయవద్దని కోరుతున్నా.
రేపు కోర్టులో ఈ అంశంపై విచారణ ఉంది. న్యాయమూర్తులు కూడా ఆలోచన చేయాలని కోరుతున్నా.తెలుగులో పరీక్షలు రాసిన విద్యార్థులకు అన్యాయం చేశారు. గ్రూప్ -1 రాసిన వాళ్లలో పోలీసోళ్ల పిల్లలు కూడా ఉన్నారు.
మీ పిల్లలకు అన్యాయం చేస్తున్న ప్రభుత్వాన్ని ఎందుకు కాపాడుతున్నారని పోలీసులను అడుగుతున్నా. తెలుగు, ఉర్ధూ మీడియం లో రాసిన అభ్యర్థులకు అన్యాయం చేశారు.
ఇది వరకు ఉన్న ప్రభుత్వం అన్యాయం చేసినందుకే ఆ ప్రభుత్వాన్ని ఓడించారు.
2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ పేరు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కానీ పాత 50 వేల ఉద్యోగాలే ఇచ్చారు తప్ప ఒక్క కొత్త నోటిఫికేషన్ వేయలేదు.
తెలంగాణలో విద్యార్థులకు జరుగుతున్న అన్యాయం పై పార్లమెంట్ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఎందుకు మాట్లాడటం లేదు?
గ్రూప్-1 విషయంలో డివిజన్ బెంచ్ లో అనుకూలంగా తీర్పు రాకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తాం. ప్రభుత్వం బేషజాలకు పోకుండా గ్రూప్ -1 ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నా.
విద్యార్థులతో కలిసి చాయ్ తాగిన కవిత
చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ వద్ద విద్యార్థులతో కలిసి కల్వకుంట్ల కవిత చాయ్ తాగారు.జాబ్ క్యాలెండర్ అమలు చేయాలని, గ్రూప్ - 1లో అక్రమాలపై నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు
*పోలీసుల అదుపులో తెలంగాణ జాగృతి నాయకులు*
చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ వద్ద పోలీసులు పలువురు జాగృతి నాయకులను అదుపులోకి తీసుకుని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు.సెంట్రల్ లైబ్రరీ వద్ద ఆందోళన చేస్తున్న పలువురు జాగృతి నాయకులపై పోలీసులు దాడి చేశారు.
గత ప్రభుత్వంలో నేను కూడా భాగస్వామినే మా వల్ల తప్పు జరిగి ఉండవచ్చు.మనలో మనం తెలంగాణ వాళ్లం తప్పు సరిదిద్దుకోవాలి. అంతేగానీ ఆంధ్రవాళ్ల కోసం ఈ ప్రభుత్వం తలవంచింది. ఆంధ్రోళ్లకు ఎట్ల ఉద్యోగాలు ఇస్తారన్న విషయాన్ని అందరు గమనించాలి.
తప్పులు మనం చేస్తే మనమే సరిదిద్దుకుందాం.గ్రూప్-1 ఉద్యోగాలు కచ్చితంగా అమ్ముకొని అవినీతి చేశారు. ఇవ్వాళ కాకపోయిన సరే రేపు ఈ విషయం బయటపడుతుంది. వీటిని ఎదుర్కొనే ధైర్యం లేకనే ముఖ్యమంత్రి సుప్రీంకోర్టు వరకు వెళ్తున్నారు.
పేద విద్యార్థులతో ఈ ప్రభుత్వం తలపడుతోంది. ఇది న్యాయమా?లక్షలు ఇచ్చి లాయర్లను తీసుకొచ్చి పేద విద్యార్థులపై ప్రయోగిస్తారా?అని ప్రశ్నించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సెంట్రల్గే లైబ్రరీ గేటు వద్దనే గ్రూప్-1 అభ్యర్థులతో కవిత "మాట ముచ్చట"

గాంధీనగర్ పీఎస్ పరిధిలో డ్రగ్స్ పై అవేర్నెస్

థరూర్ క్యాంప్ బడిలో ప్రపంచ మానసిక ఆరోగ్య అవగాహన

మేడిపల్లి మండలంలో గంజాయి పట్టివేత

గాంధీ మెడికల్ కాలేజీలో పీజీలకు సీపీఆర్ పై అవెర్నెస్

పట్టణం అభివృద్ధి పనులపై మున్సిపల్ అధికారులతో ఎమ్మెల్యే డా.సంజయ్ సమీక్ష

జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలో గంజాయి పట్టివేత.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో గంజాయి చాక్లెట్ల పట్టివేత

ప్రభుత్వ చిహ్నాలను, కమీషన్ పేరును అక్రమంగా వినియోగిస్తున్న వారిపై మానవ హక్కుల కమిషన్ సుమోటోగా కేసు

నాకు ఈ కాలేజీ అస్సలు నచ్చలేదు - వెళ్లిపోతున్నా!

రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

జిల్లా పరిధిలోని యువతకు, ఔత్సహిక ఫోటోగ్రాఫర్లకు ఫోటోగ్రఫీ,షార్ట్ ఫిలిమ్ పోటీలకు ఆహ్వానం:జిల్లా ఎస్పి అశోక్ కుమార్
.jpg)