ఇందిరమ్మ రాజ్యంలో విద్య కోసం ఇక్కట్లా? విద్యార్థులను చదువుకు దూరం చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ _జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్
జగిత్యాల సెప్టెంబర్ 16(ప్రజా మంటలు)
ఇందిరమ్మ రాజ్యంలో విద్యార్థులు విద్య కొసం ఇక్కట్లు పడడం శోచనీయం అని జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో వసంత మాట్లాడుతూ విద్యార్ధి ఉద్యమాలతో ఊపందుకోని, రాష్ట్రం సాధించే వరకు పోరాటం చేసినా విద్యార్థుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వివక్ష, నిర్లక్ష్యం చూపడం సబబు కాదన్నారు. అసెంబ్లీ సాక్షిగా విడతల వారీగా బకాయిలు చెల్లిస్తామని పేర్కొన్న రాష్ట్ర ప్రభుత్వం, ఆ మాటను మర్చిందన్నారు. యాజమాన్యాలు పోరాటం చేసినప్పుడల్లా అధికారం అడ్డుపెట్టుకొని యాజమాన్యం లను బెదిరించడం ప్రభుత్వం కు పరిపాటిగా మారిందన్నారు.
ప్రభుత్వం నిర్లక్ష్యంతో నిరుపేద విద్యార్థులకు ఉన్నత విద్య అందని ద్రాక్షగా మారే ప్రమాదం ఉందన్నారు. విద్యా, వైద్యం రాజ్యాంగం కల్పించిన హక్కులని, వాటిని సక్రమంగా అందించడం ప్రభుత్వ బాధ్యత అని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తు ఎరుగాలన్నారు. ఇందిరమ్మ రాజ్యం తెస్తామని బూటకపు మాటలతో గద్దెనెక్కిన ప్రభుత్వం, అధికారంలోకి వచ్చాక నిరుపేద విద్యార్థులను విద్యకు దూరం చేస్తుందని ఆరోపించారు.
గత మూడేళ్లుగా MTF, రియాంబర్స్ మెంట్ బకాయిలు పెండింగ్ లో ఉండడంతో యాజమాన్యం లు సైతం ఆర్థికంగా చిక్కిశల్యం అవుతున్నాయన్నారు. నిర్వహణ భారమై ఇప్పటికే అనేక కళాశాలలు మూత పడే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్యలు పోరాటం చేస్తామన్నా ప్రతిసారి ఎదో రూపంలో ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడడం, బకాయిలు విడుదల చేస్తామని మభ్య పెట్టడం తర్వాత ఇచ్చిన హామీని విస్మరించడం పరిపాటిగా మారిందన్నారు.
ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం క్షేత్ర స్థాయిలో యాజమాన్యం లు పడుతున్న ఇబ్బందులు, వాటి వల్ల విద్యార్థులపై పడుతున్న ప్రభావంను దృష్టిలో ఉంచుకొని ఇచ్చిన మాట ప్రకారం పెండింగ్ బకాయిలు విడుదల చెయ్యాలని వసంత గారు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ట్రీట్మెంట్ పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి

సికింద్రాబాద్ లో మెడికవర్ హాస్పిటల్స్ ప్రారంభం

ఉమేశ్ ఖండేల్వాల్ కు కన్నీటీ వీడ్కోలు

ఇందిరమ్మ రాజ్యంలో విద్య కోసం ఇక్కట్లా? విద్యార్థులను చదువుకు దూరం చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ _జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్

ర్యాగింగ్ చట్ట రీత్యా నేరం దీని వల్ల భవిష్యత్తు నాశనం అవుతుంది: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

టీ చింగ్ మెటీరియల్ ద్వారా పాఠాలు సులభతరం అవుతాయి జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్

ఈవీఎం గోదాము తనిఖీ భద్రత ఏర్పాట్లు, సిసి కెమెరాల పనితీరులను పరిశీలించిన : కలెక్టర్ బి. సత్యప్రసాద్

ఓజోన్ పరిరక్షణ కరపత్రం ఆవిష్కరణ

శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయంలో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజావాణి పలు సమస్యలపై వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

పశువైద్యశాల నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా .సంజయ్ కుమార్

గోధుర్ శ్రీ లక్ష్మి నరసింహ స్వామి గుడికి ₹2 లక్షల నిదుల ప్రొసీడింగ్
