ఇబ్రహీంపట్నం మండలం లో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం నాణ్యతతో వేగవంతంగా పూర్తి చేయాలి
పనులు సకాలంలో పూర్తిచేసి బిల్లులు పొందాలి : జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్
ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ 18 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):
జగిత్యాల జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలం యామాపూర్ గ్రామంలో గురువారం రోజున ఇందిరమ్మ ఇండ్లు, అంగన్వాడీ కేంద్రం, ప్రైమరీ స్కూల్ వంటగది నిర్మాణం పనులను జిల్కలా లెక్టర్ సత్యప్రసాద్ క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ,మొదటి విడతలో మంజూరైన ఇండ్ల పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మంజూరైన ఇందిరమ్మ ఇండ్లకు గ్రౌండింగ్ చేసి పనులు వెంటనే చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
నిరుపేదలకు అవసరమైతే మహిళా సంఘాల ద్వారా రుణాలు అందజేసే విధంగా చూడాలని తెలిపారు.
ఇండ్ల నిర్మాణాలకు ఏవైనా సమస్యలు ఉన్నాయా అని లబ్ధిదారులను నేరుగా అడిగి తెలుసుకున్నారు.
పనులు సకాలంలో పూర్తిచేసి బిల్లులు త్వరగా పొందాలని లబ్ధిదారులకు తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక ఉచితంగా అందిస్తుందని, రవాణా ఖర్చులు కూలీల ఖర్చులు లబ్ధిదారులే భరించాలని తెలిపారు.
అంగన్వాడీ కేంద్రం పరిశీలించిన: జిల్లా కలెక్టర్
గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలోని వంటగదిని పరిశీలించారు. చిన్నారులకు అందిస్తున్న ఆహార పదార్థాలపై నాణ్యత పై ఆరాతీశారు.అంగన్వాడి కేంద్రంలోని ప్రతి విభాగాన్ని కోడిగుడ్లను సమూలంగా పరిశీలించారు.
సిబ్బందితో మాట్లాడి చిన్నారులకు గర్భిణీలకు బాలింతలకు అందిస్తున్న పోషకాహారం సదుపాయాలను తెలుసుకున్నారు.
అంగన్వానికి కేంద్రాల్లోని చిన్నారులకు,గర్భిణీలకు, బాలింతలకు నాణ్యమైన ఆహారం అందించాలని కలెక్టర్ తెలిపారు.
అక్టోబర్ 16 వరకు పోషణ మాసం కార్యక్రమం అంగన్వాడి కేంద్రాల ఆధ్వర్యంలో నిర్వహించాలని తెలిపారు.
ఆరోగ్య తెలంగాణ సాధనలో భాగంగా పోషణ మాసం కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని విజయవంతంగా కార్యక్రమాన్ని నిర్వహించాలని తెలిపారు.
పోషణ మాసంలో గర్భిణీలు, బాలింతలతో సమావేశాలు ఏర్పాటు చేసి ఆరోగ్యాకరమైన ఆహారపు అలవాట్లు, జీవనశైలి,పౌష్టికాహారం పై అవగాహనా కల్పించాలని తెలియజేశారు.
ప్రైమరీ స్కూల్ వంటగది నిర్మాణం పనులు పరిశీలన
అనంతరం గ్రామంలోని ప్రైమరీ స్కూల్ వంటగది నిర్మాణపనులను పరిశీలించారు.నాణ్యత లోపించకుండా సకాలంలో పనులు పూర్తిచేయాలనీ తెలిపారు.
గ్రామ పంచాయతీ భవన నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలి
ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్ తాండలో నిర్మిస్తున్న గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులను పరిశీలించారు.
గుత్తేదారులనితో మాట్లాడి పనులు త్వరగా పూర్తిచేసి బిల్లులు పొందాలని, నాణ్యత ప్రమాణాలను పాటించాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో మెట్పల్లి రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాస్, ఈ పి ఆర్ ఓ లక్ష్మణ్ రావు, హౌసింగ్ పిడి ప్రసాద్,ఎమ్మార్వో ఎంపీడీవో మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
భువనేశ్వర్–ముంబయి గంజాయి అక్రమ రవాణా రాకెట్ ఆటకట్టు

గాంధీ ఆసుపత్రిలో మెగా పీడియాట్రిక్ క్యాంపు

ఇబ్రహీంపట్నం మండలం లో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్

ముత్తారం మూలమలుపు చెట్ల తొలగింపు - స్పందించిన ముల్కనూర్ పోలీస్

రానున్న గోదావరి పుష్కరాల ప్రణాళికపై, ప్రాథమిక సమీక్ష ఆగమన, వాస్తు శాస్త్రం ప్రకారం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం పునః నిర్మాణం ధర్మపురి పట్టణానికి మాస్టర్ ప్లాన్

గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహించాలి -రాష్ట్ర సంక్షేమ మంత్రి అడ్లూరి
.jpg)
మిసెస్ చికాగో యూనివర్స్ గా ధర్మపురి చెందిన సౌమ్య బొజ్జా

చాలా రాష్ట్రాలలో సగానికిపైగా ఓటర్లు ఏ కాగితం చూపక్కర లేదు - ఎన్నికల కమీషన్

శిల్పకళ, వాస్తుశిల్పి మూలపురుషుడు విశ్వకర్మ జిల్లా సమీకృత భవనంలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు పాల్గొన్న •బిసి కమిషన్ చైర్మన్ జి. నిరంజన్

ఉత్తమ అధ్యాపకుని అభినందించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

బన్సీలాల్ పేట్ డివిజన్ బీజేపీ ఆధ్వర్యంలో విశేష కార్యక్రమాలు

గాంధీ ఆస్పత్రిలో ఘనంగా మధుసుధాకర్‌రెడ్డి వీడ్కోలు సభ
