ఎస్ కే ఎన్ ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
జగిత్యాల సెప్టెంబర్ 20 (ప్రజా మంటలు)
ఎస్.కె.ఎన్.ఆర్. ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో బతుకమ్మ పండుగ సంబరాలను, ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ప్రత్యేకతను ప్రతిబింబించే ఈ పూల పండుగలో విద్యార్థినులు, అధ్యాపక సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జగిత్యాల అదనపు కలెక్టర్ .ఎస్.లత మాట్లాడుతూ బతుకమ్మ పండుగ స్త్రీల ఆరాధన పండుగగా, ప్రకృతి సంపదను కాపాడే పండుగగా, తెలంగాణ సాంస్కృతిక చిహ్నంగా నిలుస్తుందని అన్నారు. గౌరమ్మ పూజ ద్వారా మహిళల ఆధ్యాత్మిక శక్తి, కుటుంబ బంధాలు మరింత బలపడతాయని, వేర్వేరు రకాల పువ్వులతో బతుకమ్మను అలంకరించడం ప్రకృతి పట్ల గల గౌరవానికి ప్రతీక అని వివరించారు.
కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఏ. అశోక్ మాట్లాడుతూ బతుకమ్మ ప్రతి మహిళకు సంబంధించిన పండుగ మాత్రమే కాకుండా, సమాజాన్ని కలుపుకునే వేదిక అని, సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడే ఉత్సవమని అన్నారు.
ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ. శ్రీనివాస్, లెఫ్టినెంట్ పి.రాజు, గోవర్ధన్ సాయి మధుకర్, కే శ్రీనివాస్ లైబ్రేరియన్ కే సురేందర్ దివ్యరాణి, డాక్టర్ మహేష్ స్వరూప, సుప్రియ, కవిత రజిత, వేణు, గట్టయ్య ,పవన్ కళ్యాణ్, ప్రమోద్, ఏవో అరవింద్, నీరజ గణేష్ , ప్రభు అధ్యాపకులు, విద్యార్థులు, పాల్గొన్నారు. చివరగా బతుకమ్మను ఘనంగా నిమజ్జనం చేశారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ప్రజా సమస్యలను తెలుసుకొని, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే మా లక్ష్యం - కల్వకుంట్ల కవిత

సిఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్సీ ఎల్ రమణ

సెంట్రల్గే లైబ్రరీ గేటు వద్దనే గ్రూప్-1 అభ్యర్థులతో కవిత "మాట ముచ్చట"

గాంధీనగర్ పీఎస్ పరిధిలో డ్రగ్స్ పై అవేర్నెస్

థరూర్ క్యాంప్ బడిలో ప్రపంచ మానసిక ఆరోగ్య అవగాహన

మేడిపల్లి మండలంలో గంజాయి పట్టివేత

గాంధీ మెడికల్ కాలేజీలో పీజీలకు సీపీఆర్ పై అవెర్నెస్

పట్టణం అభివృద్ధి పనులపై మున్సిపల్ అధికారులతో ఎమ్మెల్యే డా.సంజయ్ సమీక్ష

జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలో గంజాయి పట్టివేత.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో గంజాయి చాక్లెట్ల పట్టివేత

ప్రభుత్వ చిహ్నాలను, కమీషన్ పేరును అక్రమంగా వినియోగిస్తున్న వారిపై మానవ హక్కుల కమిషన్ సుమోటోగా కేసు

నాకు ఈ కాలేజీ అస్సలు నచ్చలేదు - వెళ్లిపోతున్నా!
