శిల్పకళ, వాస్తుశిల్పి మూలపురుషుడు విశ్వకర్మ జిల్లా సమీకృత భవనంలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు పాల్గొన్న •బిసి కమిషన్ చైర్మన్ జి. నిరంజన్
జగిత్యాల సెప్టెంబర్ 17 (ప్రజా మంటలు)
జిల్లా సమీకృత భవన సముదాయం లో శిల్పకళ, వాస్తు శిల్పి విశ్వకర్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్బంగా బిసి కమిషన్ చైర్మన్ జి. నిరంజన్,జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ తో కలిసి విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం చైర్మన్ మాట్లాడుతూ విశ్వకర్మ జయంతి అనేది కళలు, శిల్పకళ, మరియు వాస్తుశిల్పానికి ప్రతీక.
ఆయన సృష్టికర్త కాబట్టి, ఇంజనీర్లు, వాస్తుశిల్పులు, చేతివృత్తులవారు, మెకానిక్‌లు, మరియు ఫ్యాక్టరీ కార్మికులు ఈ పండుగను గొప్పగా జరుపుకోవాలని కోరారు.
నేటి ఆధునిక ప్రపంచంలో, ఇంజనీర్లు, యంత్రాల రూపకర్తలు, సాంకేతిక నిపుణులు విశ్వకర్మను ఆదర్శంగా భావించాలి.
శారీరక శ్రమకు, సృజనాత్మకతకు, మరియు వృత్తిపరమైన నైపుణ్యానికి గౌరవం ఇవ్వాలని మన పనిలో విజయం సాధించడానికి విశ్వకర్మ ఆశీస్సులు ఉండాలని కోరారు.
ఈ విశ్వకర్మ జయంతి సందర్భంగా, మన జీవితంలో జ్ఞానం, సృజనాత్మకత, మరియు శ్రమ యొక్క ప్రాముఖ్యతను గుర్తుచేసుకుంటూ.
మన పనులు దైవికమైనవిగా, సృజనాత్మకమైనవిగా, మరియు సమాజానికి ఉపయోగపడేవిగా మారాలని విశ్వకర్మను ప్రార్థిస్తూ అందరికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లు బిఎస్ లత, బి. రాజా గౌడ్, బిసి సంక్షేమ అధికారిణి జి. సునీత మరియు సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
రానున్న గోదావరి పుష్కరాల ప్రణాళికపై, ప్రాథమిక సమీక్ష ఆగమన, వాస్తు శాస్త్రం ప్రకారం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం పునః నిర్మాణం ధర్మపురి పట్టణానికి మాస్టర్ ప్లాన్

గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహించాలి -రాష్ట్ర సంక్షేమ మంత్రి అడ్లూరి
.jpg)
మిసెస్ చికాగో యూనివర్స్ గా ధర్మపురి చెందిన సౌమ్య బొజ్జా

చాలా రాష్ట్రాలలో సగానికిపైగా ఓటర్లు ఏ కాగితం చూపక్కర లేదు - ఎన్నికల కమీషన్

శిల్పకళ, వాస్తుశిల్పి మూలపురుషుడు విశ్వకర్మ జిల్లా సమీకృత భవనంలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు పాల్గొన్న •బిసి కమిషన్ చైర్మన్ జి. నిరంజన్

ఉత్తమ అధ్యాపకుని అభినందించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

బన్సీలాల్ పేట్ డివిజన్ బీజేపీ ఆధ్వర్యంలో విశేష కార్యక్రమాలు

గాంధీ ఆస్పత్రిలో ఘనంగా మధుసుధాకర్‌రెడ్డి వీడ్కోలు సభ

కల్లుగీత పారిశ్రామిక సంఘం భవన నిర్మాణ శంకుస్థాపనకు ఎమ్మెల్యేకు. సంఘం ఆహ్వానం

జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు

స్టైఫండ్ ల విడుదలలో జాప్యం నివారించండి

గాంధీ ఆవరణలో గుర్తుతెలియని మహిళ డెడ్ బాడీ
