శాంతి భద్రతలకు భంగం కలిగించే రౌడీషీటర్ బండి శ్రీకాంత్ పై పీడి యాక్ట్ అమలు. నిందితునికి కరీంనగర్ జైల్లో పీడి ఉత్తర్వులు అందజేత.
జగిత్యాల సెప్టెంబర్ 13(ప్రజా మంటలు)
హత్య, హత్యయత్నాలు, దోపిడీలు, బెదిరింపులు సహా 20 కేసుల్లో నిందితుడిగా బండి శ్రీకాంత్
శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై పిడి యాక్ట్ అమలు చేస్తాం:జిల్లా ఎస్పి అశోక్ కుమార్
జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని విద్యానగర్ కు చెందిన బండి@తరాల శ్రీకాంత్ అనే వ్యక్తి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ తరచు ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తూ, సామాన్య ప్రజా జీవనానికి భంగం కలిగిస్తూ ఉంటే గతంలో శ్రీకాంత్ పై రౌడి షీట్ ఓపెన్ చేసి పలు మార్లు కౌన్సెలింగ్ నిర్వహించిన శ్రీకాంత్ ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాకపోవడంతో శాంతి భద్రతలకు తరుచూ విఘాతం కలిగించేలా వ్యవహరిస్తున్నందున పీడి ఆక్ట్ నమోదు చేసి ఉత్తర్వుల కాపీని నిందితునికి కరీంనగర్ జైల్లో అందజేసి చర్లపల్లి జైలుకు తరలించడం జరిగిందని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు.
తెలంగాణా నియంత్రణ చట్టం ప్రకారం నేరాలకు పాల్పడే వారిని నేరస్తుని గా నిర్ధారించి, ఇతని బారి నుండి ప్రజలను రక్షించాలన్న ఉద్దేశ్యంతో జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల ప్రకారం పి.డి.యాక్ట్ పెట్టడం జరిగింది. ఇట్టి నిందితునిపై గతంలో హత్య ,పలు హత్యయత్నం లు ,దొంగతనాలు,బెదిరింపులకు పాల్పడిన 20 కేసులు నమోదు కావడం జరిగింది.
ఈ సందర్భం గా ఎస్పి మాట్లాడుతూ.. సామాన్య ప్రజల భద్రత కోసం నేరప్రవర్తన కలిగిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటాము. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారి పై పీడీ యాక్ట్ తో పాటు, అవసరమైతే నగర బహిష్కరణ (Externment Orders) కూడా అమలు చేస్తాము. జిల్లా వ్యాప్తంగా ఉన్న రౌడీషీటర్లను నిరంతరం పర్యవేక్షిస్తూ, పునరావృత నేరాలను అరికట్టేందుకు పోలీస్ శాఖ కృషి నిరంతరం కృషి చేయడం జరుగుతుందని తెలిపారు.
ఈ పీడీ యాక్ట్ ను అమలు చేయడంలో కీలక పాత్ర పోషించిన డిఎస్పి రఘు చంధర్, టౌన్ ఇన్స్పెక్టర్ కరుణాకర్ లను జిల్లా ఎస్పీ అభినందించడం జరిగింది.
More News...
<%- node_title %>
<%- node_title %>
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన బండ కార్తీక చంద్రారెడ్డి

ఏడు దశాబ్దాల వైద్య సేవల గాథ… గాంధీ మెడికల్‌కళాశాలకు జయహో

ఓల్డ్ బోయిన్ పల్లిలో మత్తు మందు తయారీ గుట్టు రట్టు

ఎల్. ఐ.సి. ఎవోఐ డివిజన్ "కో - కన్వీనర్" గా ఆమందు రాజ్ కుమార్

యూరియా గోదాం ను ప్రారంభించిన మార్కెట్ చైర్మన్ భీమా సంతోష్

ఆర్యవైశ్య అభ్యున్నతే లక్ష్యంగా కృషి - రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కాల్వ సుజాత

సి సి రోడ్డు డ్రైనేజీ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డా. సంజయ్

పెన్షనర్ల సంక్షేమానికి కృషి. - జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్

శాంతి భద్రతలకు భంగం కలిగించే రౌడీషీటర్ బండి శ్రీకాంత్ పై పీడి యాక్ట్ అమలు. నిందితునికి కరీంనగర్ జైల్లో పీడి ఉత్తర్వులు అందజేత.

నిద్రపోయిన విద్యార్థుల కళ్లకు జిగురు పోసిన అగంతకులు

వరంగల్ సిటీ విశ్రాంత ఉద్యోగుల నూతన కార్యవర్గం

భారతదేశంపై కన్ను వేసిన చైనా - టిబెట్ ప్రవాస ప్రభుత్వ మాజీ ప్రధాని లోబ్సాంగ్ సంగే హెచ్చరిక
