మైనార్టీలకు కాంగ్రెస్ పార్టీ సదా అండగా ఉంటుంది - రాష్ర్ట మంత్రి వివేక్ వెంకటస్వామి
వైఎంసీఏ లో చిన్నప్పుడు క్రికెట్, టేబుల్ టెన్నిస్ ఆడేవాన్ని
సికింద్రాబాద్ వైఎంసీఏ లో మంత్రి అడ్లూరి తో కలసి ప్రారంబోత్సవాలు
సికింద్రాబాద్, సెప్టెంబర్ 12 (ప్రజామంటలు) :
మైనార్టీలకు కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ అండగా ఉంటుందని, అలాగే మైనార్టీలు కూడ ఎప్పుడూ పార్టీ వెంట నడుస్తారని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. శుక్రవారం సికింద్రాబాద్ వైఎంసీఏలో వైఎంసీఏ ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటేడ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఆండ్ మల్టీ పర్పస్ ప్రొగ్రామ్ సెంటర్ శంకుస్థాపన, నూతన ఆడిటోరియం లను మరో మంత్రి అడ్లూరి లక్ష్మన్ కుమార్ తో కలసి ఆయన ప్రారంభించారు. ఈసందర్బంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ..క్రిస్టియన్ మైనార్టీలకు అందాల్సిన నిధులు, సంక్షేమ పథకాలు, ఆ వర్గాలకు అందాల్సిన పదవుల గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుందన్నారు.
అలాగే బడ్జెట్ లో నిధుల కేటాయింపులో కూడా సముచిత స్థానం కల్పించనున్నామని తెలిపారు. వైఎంసీఏ తో తనకు చిన్ననాటి నుంచి అనుబంధం ఉందని, చిన్నప్పుడు నారాయణగూడ గ్రౌండ్ లో క్రికెట్ , టేబుల్ టెన్నిస్ ఆడేవాడినని అన్నారు. విద్యార్థి దశలో క్రికెట్ టోర్నమెంట్ కోసం సింగపూర్ పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడ వైఎంసీఏ లో బస చేశామని గుర్తు చేశారు. అందరూ ఐకమత్యంతో ఉండి వైఎంసీఏ ను మరింత అభివృద్దిలో తీసుకొని రావాలని ఆకాంక్షించారు. ఆడిటోరియం, గెస్ట్ హౌజ్ లను నిర్మించిన వైఎంసీఏ నిర్వాహకులను మంత్రి అభినందించారు. మంత్రి అడ్లూరి లక్ష్మన్ కుమార్ మాట్లాడుతూ..కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సముచిత స్థానం కల్పిస్తుందని, గత ప్రభుత్వం క్రైస్తవ మైనార్టీ వర్గాల ప్రజలను పట్టించుకోలేదని, ఇటీవల జరిగిన సమీక్షలో తెలిసిందన్నారు.
కానీ తాను మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత క్రైస్తవ మైనార్టీలకు సంబందించిన స్మశాన వాటికలు, వారికి కేటాయించిన భూముల విషయంలో అమలు కాకుండా పెండింగ్ లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కారించాలని కలెక్టర్ కు ఆదేశించినట్లుచెప్పారు. అలాగే ఈ స్థలాలు కబ్జా కాకుండా కాపాడేలాపెన్సింగ్ తో పాటు సౌకర్యాలను కల్పించాలని ఆదేశించినట్లు తెలిపారు. వైఎంసీఏ ప్రపంచంలోనే సేవలు అందిస్తున్న అత్యుత్తమైన సంస్థ అని దీన్ని అభివృద్ది పథంలో నడిపిస్తున్న అద్యక్షులు జయకర్ డేనియల్కు అభినందించారు. మాజీ మంత్రి డాక్టర్ గీతారెడ్డి మాట్లాడుతూ...వైఎంసీఏ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుందన్నారు. మంత్రి వివేక్ వెంకటస్వామి ఫ్యామిలికి ఎంతో గొప్ప పేరుందని, వారి కుటుంబం అనేక సామాజిక సేవ కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు. ఈసందర్బంగా వైఎంసీఏ ఆశ్రయ్ కు ఛైర్మన్ గా వ్యవహరించి సేవలు అందించిన మాజీ మంత్రి డాక్టర్ గీతారెడ్డిని అవార్డు జ్ఞాపికతో మంత్రులు సత్కరించారు.
కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఠాగోపాల్, క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్ , వైఎంసీఏ అద్యక్షులు జయకర్ డేనియల్ తెలంగాణ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వర రావు,మంత్రి అడ్లూరి సతీమణిఅడ్లూరి శాంతికుమారి, కార్పొరేటర్ కొంతం దీపిక, సుప్రీం కోర్టు న్యాయవాది జోయ్స్ , సుప్రీం కోర్టు జడ్జి సూరపనేని నంద, బిషప్ సింగం,మోజాస్,లెనార్డ్ తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
అంగరంగ వైభవంగా కొనసాగిన వామన పురాణం

అంగన్వాడీ కేంద్రంలో, సంచార జాతుల వారి మధ్యలో స్కై ఫౌండేషన్ వేడుకలు

మైనార్టీలకు కాంగ్రెస్ పార్టీ సదా అండగా ఉంటుంది - రాష్ర్ట మంత్రి వివేక్ వెంకటస్వామి

మాజీ మంత్రి హరీష్ రావును కలిసిన మాజీ మంత్రి రాజేశం గౌడ్

సైన్స్ ల్యాబ్ నిర్మూణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

సింగరేణి ఎన్నికల్లో గెలవబోయేది మనమే - కల్వకుంట్ల కవిత

జగిత్యాల జిల్లా పెగడపల్లి ఎమ్మార్వో రవీందర్ పై కేసు నమోదు

గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ గా ప్రొ. వాణి బాధ్యతల స్వీకరణ

రాజీ మార్గమే...రాచ మార్గం...లోక్ అదాలత్ ఈనెల 13న

మేడిపల్లి పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

ఎన్ సి డియక్స్ నుంచి పసుపు ను తొలగించాలి జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి ని కోరిన పసుపు వ్యాపారులు

హరీష్ కుటుంబానికి విద్యుత్ శాఖ అండగా నిలవాలి కోరుట్ల నియోజకవర్గ ఇన్చార్జి జువ్వడి నర్సింగరావు
