ఏడు దశాబ్దాల వైద్య సేవల గాథ… గాంధీ మెడికల్‌కళాశాలకు జయహో
రేపు 71వ వ్యవస్థాపక దినోత్సవం
సికింద్రాబాద్, సెప్టెంబర్ 13 (ప్రజామంటలు) :
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో చిన్నగా పీపుల్స్‌మెడికల్‌కాలేజీగా మొదలైన గాంధీ మెడికల్‌కాలేజీ నేటికి 71 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇప్పటి వరకు దేశ, విదేశాల్లో నిష్ణాతులైన వేలాది మంది వైద్యులను తయారు చేసి, వైద్యరంగంలో అగ్రగామిగా నిలిచిన ఈ కళాశాలను వైద్యులను తయారు చేసే కర్మాగారం గా విశ్లేషిస్తారు.దేశంలోనే గాంధీ మెడికల్ కాలేజీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. 1954 సెప్టెంబర్14న అన్వర్ ఉలామ్ ఎడ్యుకేషనల్‌సొసైటీ ఆధ్వర్యంలో 40మంది విద్యార్థులతో పీపుల్స్‌మెడికల్‌కాలేజీ ప్రారంభమైంది.
1955 జూన్25న హుమాయూన్‌నగర్‌లో కొత్త భవనాన్ని అప్పటి రాష్ట్రపతి డా. రాజేంద్రప్రసాద్‌ప్రారంభించారు. 1958 జూలైలో బషీర్‌బాగ్‌కు తరలించి గాంధీ మెడికల్‌కళాశాలగా పేరుమారింది. 2003లో సికింద్రాబాద్ లో ఉన్న ప్రస్తుత ఆధునిక భవన సముదాయం అందుబాటులోకి వచ్చింది. 1950---–60 దశకంలోనే గాంధీ ఆస్పత్రి మెడికల్ కాలేజీకి అనుబంధమైంది. ఇప్పుడు విశాలమైన స్థలంలో గాంధీ మెడికల్ కాలేజీ,ఆసుపత్రి ఒకే ప్రాంగణంలో ఉన్నాయి.
అలుమ్నీ సేవలు
గాంధీ మెడికల్‌కళాశాల పూర్వవిద్యార్థుల సంఘం ప్రతి సంవత్సరం ప్రతిభావంతులైన విద్యార్థులను గోల్డ్ మెడల్స్, ప్రోత్సాహక బహుమతులతో సత్కరిస్తూ, వారిని ప్రోత్సహిస్తోంది. పేద విద్యార్థులను ఎంపిక చేసి స్కాలర్ షిప్ లు అందిస్తుంది. అలాగే వైద్య పరికరాలను, ముఖ్యంగా కోవిడ్ సమయంలో అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించింది. ఈ నెల 14న గాంధీ మెడికల్ కాలేజీ ఆవరణలోని అలుమ్నీ భవనంలో 71వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు ఘనంగా జరగనున్నాయి.ఈ కార్యక్రమానికి నిమ్స్‌మాజీ డైరెక్టర్‌రాజారెడ్డి, డీఎంఈ నరేందర్‌కుమార్, గాంధీ కళాశాల ప్రిన్సిపాల్ కే. ఇందిర, సూపరింటెండెంట్ ఎన్. వాణి, టీజీఎస్ఎమ్సీ చైర్మన్ డా..కే.మహేశ్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నట్లు అలుమ్నీ అసోసియేషన్‌అధ్యక్షుడు డాక్టర్‌జీఆర్‌లింగమూర్తి, కార్యదర్శి వెంకటరత్నం తెలిపారు.ఈసందర్బంగా అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన పీజీ, సూపర్ స్పెషాలిటీ,యూజీ వైద్య విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ ను అందచేస్తారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన బండ కార్తీక చంద్రారెడ్డి

ఏడు దశాబ్దాల వైద్య సేవల గాథ… గాంధీ మెడికల్‌కళాశాలకు జయహో

ఓల్డ్ బోయిన్ పల్లిలో మత్తు మందు తయారీ గుట్టు రట్టు

ఎల్. ఐ.సి. ఎవోఐ డివిజన్ "కో - కన్వీనర్" గా ఆమందు రాజ్ కుమార్

యూరియా గోదాం ను ప్రారంభించిన మార్కెట్ చైర్మన్ భీమా సంతోష్

ఆర్యవైశ్య అభ్యున్నతే లక్ష్యంగా కృషి - రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కాల్వ సుజాత

సి సి రోడ్డు డ్రైనేజీ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డా. సంజయ్

పెన్షనర్ల సంక్షేమానికి కృషి. - జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్

శాంతి భద్రతలకు భంగం కలిగించే రౌడీషీటర్ బండి శ్రీకాంత్ పై పీడి యాక్ట్ అమలు. నిందితునికి కరీంనగర్ జైల్లో పీడి ఉత్తర్వులు అందజేత.

నిద్రపోయిన విద్యార్థుల కళ్లకు జిగురు పోసిన అగంతకులు

వరంగల్ సిటీ విశ్రాంత ఉద్యోగుల నూతన కార్యవర్గం

భారతదేశంపై కన్ను వేసిన చైనా - టిబెట్ ప్రవాస ప్రభుత్వ మాజీ ప్రధాని లోబ్సాంగ్ సంగే హెచ్చరిక
