గణేశ్ నిమజ్జనోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ గణేష్ నిమజ్జనోత్సవానికి పటిష్ట బందోబస్తు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
గణేశ్ నిమజ్జన ప్రాంతాలను ప్రత్యక్షంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్,ఎస్పీ
జగిత్యాల /మెట్పల్లి సెప్టెంబర్ 2 (ప్రజా మంటలు)
గణేశ్ నిమజ్జనO శాంతియుతంగా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా సజావుగా జరిగేలా అన్ని విభాగాలు సమన్వయంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ అన్నారు. జిల్లా ఎస్పి అశోక్ కుమార్ తో కలిసి గణేష్ నిమజ్జన ప్రాంతాలైన జగిత్యాలలో చింతకుంట చెరువు, కోరుట్లలో పెద్దవాగు, మెట్పల్లిలోని వట్టి వాగు, రాయపట్నం బ్రిడ్జి ప్రాంతాలను ప్రత్యక్షంగా పరిశీలించారు.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.... నిమజ్జన ఘాట్‌ల వద్ద ప్రజలకు తాగునీరు, లైటింగ్, శానిటేషన్ వంటి సౌకర్యాలు కల్పించాలని అన్నారు. నిమజ్జనo కు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చే అవకాశం ఉన్నందున ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేయాలని అదికారులను ఆదేశించారు. విగ్రహాల తరలింపు సమయంలో ఎక్కడ విద్యుత్ షాక్ గురికాకుండా తగిన చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ వారికి సూచించారు.
మున్సిపల్,విద్యుత్, రెవెన్యూ అధికారులు, పోలీస్ శాఖ సమన్వయంతో నిమజ్జన కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేయాలని సూచించారు.
ఈ సందర్బంగా జిల్లా ఎస్పి మాట్లాడుతూ.... వినాయక నిమజ్జన కార్యక్రమాలు శాంతియుతంగా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సజావుగా పూర్తి కావడానికి పోలీస్ శాఖ తరఫున అన్ని రకాల భద్రతా చర్యలు చేపట్టడం జరుగుతుందని అన్నారు.
నిమజ్జనం అంతయు ప్రశాంత వాతావరణం లో పూర్తి అయ్యేలా అవసరమైన ప్రాంతాలలో సిసి కెమెరాలను, వీడియోగ్రఫీ ఏర్పాటు చేశామని, స్థానిక గజ ఈతగాళ్లు ను నిమర్జన ప్రాంతములో అందుబాటులో ఉంచమని, శోభాయాత్ర వెళ్ళేమార్గం లో ఇతర శాఖ ల యొక్క సమన్వయము తో ఎటువంటి అవాంతరములు తలెత్తకుండా పటిష్టమైన చర్యలను తీసుకుంటున్నామని తెలిపారు.
నిమజ్జనం సందర్భంగా డీజే లు, సౌండ్ సిస్టంలు,బాణాసంచా కాల్చడం వంటివి చేయరాదని తెలిపారు. చట్టాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని, చట్టానికి లోబడి నడుచుకోవాలని తెలిపారు. చట్టానికి విరుద్ధంగా ఎవరైనా ప్రవర్తించిన వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వినాయక నిమజ్జను శాంతియుతంగా, సామరస్యంగా జరుపుకోవాలని అందుకు ప్రజలు పూర్తిగా పోలీసు వారికి సహకారం అందించాలని కోరారు.
ఈ యొక్క కార్యక్రమమం లో ఆర్డీవోలు మధుసూదన్, శ్రీనివాస్, జీవాకర్ రెడ్డి, డీఎస్పీలు రఘు చందర్, రాములు, పోలీస్, రెవిన్యూ ,మున్సిపల్, విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
అమిత్ షా హైదరాబాద్ పర్యటన రద్దు
1.jpeg)
2026 కల్లా 1.50. లక్షలకు చేరువగా 10 గ్రామ్ ల బంగారం ధర
-overlay.jpeg.jpg)
విద్యుత్ గణేష మంటపం వద్ద అన్న ప్రసాద వితరణ

గీత భవన్ లో కొనసాగుతున్న అష్టాదశ పురాణ ప్రవచనం

కొడిమ్యాల పోలీసుల ఆధ్వర్యంలో గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు

బీహార్ లో తేజస్విని సీఎం చేయడంపై కాంగ్రెస్ సందేహాలు?
.jpeg)
సోషల్ మీడియా అప్ లను నిషేధించిన నేపాల్ ప్రభుత్వం
.jpeg)
కిడ్నీ వ్యాధుల పట్ల అవగాహన పై గాంధీలో ర్యాలీ

నల్లగుట్ట స్కూల్ లో ఘనంగా టీచర్స్ డే సెలబ్రేషన్స్...

గాంధీ ఆసుపత్రిలో పెయిన్ క్లినిక్ ప్రొసీజర్ రూమ్ ప్రారంభం

ఎల్‌ఐసి ఆఫ్ ఇండియా పోటీలలో విద్యార్థుల ప్రతిభ

బైకుల దొంగ దంపతులను పట్టించిన సీసీ టీవీ ఫుటేజీ
