సకాలంలో గుర్తించి, ట్రీట్మెంట్ తీసుకుంటే వాస్క్యులర్ సమస్య నివారించవచ్చు

On
సకాలంలో గుర్తించి, ట్రీట్మెంట్ తీసుకుంటే వాస్క్యులర్ సమస్య నివారించవచ్చు

నేషనల్ వాస్క్యులర్ డే ...కిమ్స్సన్ షైన్ ఆసుపత్రి ఆధ్వర్యంలో వాక్ థాన్, అవేర్నేస్
   - పాల్గొన్న సినీ నటుడు రాజీవ్ కనకాల
 
సికింద్రాబాద్, ఆగస్ట్ 06 (ప్రజామంటలు) :
 
త్వరితంగా గుర్తించి, సకాలంలో  సరైన వైద్య చికిత్సలు తీసుకుంటే, వాస్క్యులర్ తో బాధపడుతున్న వారిలో   80శాతం వరకు అంప్యూటేషన్‌ (చేతులు, కాళ్ళు తీసివేయడం) లను నివారించవచ్చునని వైద్య నిపుణులు పేర్కొన్నారు .నేషనల్ వాస్క్యులర్ డే సందర్భంగా బేగంపేట కిమ్స్-సన్‌షైన్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో బుధవారం వాక్‌థాన్, అవగాహన సమావేశం నిర్వహించారు. వాక్ ఎ మైల్ టు లివ్ విత్ ఎ స్మైల్ అనే పేరుతో పీపుల్ ప్లాజా నుంచి  వాక్ ప్రారంభమైంది. ఆసుపత్రి వైద్యులతో కలిసి ప్రముఖ సినీ నటుడు రాజీవ్ కనకాల జెండా ఊపి వాక్ థాన్ ను ప్రారంభించారు.  పెద్ద సంఖ్యలో యువతీ, యువకులు, వైద్య విద్యార్థులు, పలువురు వైద్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
 
భారతదేశంలో వాస్క్యులర్ వ్యాధులు భయంకర పరిస్థితిలో ఉన్నాయని వైద్యులు వెల్లడించారు. ప్రతి సంవత్సరం భారతదేశంలో సుమారు 25,000 మంది వాస్క్యులర్ సమస్యల వల్ల చేతులు లేదా కాళ్లను కోల్పోతున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా మధుమేహం ఉన్న రోగులలో ఇది అధికంగా  కనిపిస్తుందని అన్నారు.
 
చెయ్యి కాపాడండి–-జీవితం కాపాడండి–-అంప్యూటేషన్‌లకు చెబుదాం వద్దని... అనే సందేశాన్ని  ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయడం లక్ష్యంగా కృషి చేస్తున్న కిమ్స్-సన్‌షైన్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గురువ రెడ్డికి, కిమ్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ బి. భాస్కర్ రావుకు సినీ నటుడు  రాజీవ్ కనకాల కృతజ్ఞతలు తెలిపారు.
Tags

More News...

Local News 

ప్రో జయశంకర్ కు బార్ అసోసియేషన్ నివాళి

ప్రో జయశంకర్ కు బార్ అసోసియేషన్ నివాళి మెట్టుపల్లి ఆగస్ట్ 06:  మెటుపల్లి  బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, కంతి మోహన్ రెడ్డి, డా. తుల రాజేందర్ కుమార్, బార్ కార్యదర్శులు పి. శ్రీనివాస్, గజెల్లి రామదాస్, శంకర్, సాగర్, గుయ్య సాయి కుమార్, సత్యనారాయణ, రమేష్,దయాకర్ వర్మ, కోలా అశోక్ తదితర న్యాయవాదులు ప్రొ. కొత్తపల్లి జయశంకర్ కు నివాళులు అర్పిస్తూ తెలంగాణ రాష్ట్ర...
Read More...
Local News 

కంటోన్మెంట్ లో ఎమ్మెల్యే శ్రీగణేష్ జన్మదిన వేడుకలు

కంటోన్మెంట్ లో ఎమ్మెల్యే శ్రీగణేష్ జన్మదిన వేడుకలు   పలు చోట్ల హాజరైన శ్రీగణేష్ ఫౌండేషన్ నిర్వాహకులు ముకుల్   సికింద్రాబాద్, ఆగస్ట్ 06 (ప్రజా మంటలు): కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ జన్మదినం సందర్భంగా బుధవారం నియోజకవర్గంలోని అన్ని వార్డులలో కాంగ్రెస్ పార్టీ నాయకులు జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్యే శ్రీగణేష్ ఢిల్లీలో టిపిసిసి ఆధ్వర్యంలో చేపట్టిన మహా ధర్నాలో పాల్గొంటున్నందున నియోజకవర్గంలో అభిమానులకు, కార్యకర్తలకు...
Read More...
Local News  State News 

ఆచార్యుడిని యాది మరిచిన గాంధీ ఆసుపత్రి

ఆచార్యుడిని యాది మరిచిన గాంధీ ఆసుపత్రి ప్రొఫెసర్ జయశంకర్ జయంతి జాడే లేదు..    బీటలు వారిన శిలాఫలకం, ఊడిన గ్రానైట్ రాళ్ళు.. సికింద్రాబాద్, ఆగస్ట్ 06 (ప్రజామంటలు)  : తెలంగాణ రెండోదశ ఉద్యమానికి ఊపిరిలూదిన తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని గాంధీ ఆసుపత్రి పాలనయంత్రాంగం వైద్యాధికారులు మరిచారు. ఆసుపత్రి  మెయిన్ బిల్డింగ్ కు వెళ్ళే గేట్ వద్దే ఉన్న జయశంకర్ విగ్రహం...
Read More...
Local News 

కస్తూర్బా స్కూల్లో రాఖీ పౌర్ణమి వేడుకలు

కస్తూర్బా స్కూల్లో రాఖీ పౌర్ణమి వేడుకలు పాల్గొన్న రాష్ట్ర మంత్రి అడ్డూరి లక్ష్మణ్  కుమార్ సతీమణి కాంత కుమారి (అంకం భూమయ్య) గొల్లపల్లి ఆగస్టు 06 (ప్రజా మంటలు):      అలెగ్జాండర్ రాజుగా పాలిస్తున్న కాలంలో పురుషోత్తముడితో యుద్ధం చేస్తున్నప్పుడు పురుషోత్తముడు భార్య తమను రక్షించాలని  ఆమె తన కొంగు చివరి అంచును చింపి అలెగ్జాండర్ కు  రాఖీల కడుతుంది. ఈ క్రమంలో గొల్లపల్లి...
Read More...
Local News 

తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రధాత ఆచార్య జయ శంకర్  తల్లీ తెలంగాణ విమోచనం కోసం పోరాడిన శిఖరం ఆయన

తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రధాత ఆచార్య జయ శంకర్   తల్లీ తెలంగాణ విమోచనం కోసం పోరాడిన శిఖరం ఆయన జగిత్యాల ఆగస్టు 6 ( ప్రజా మంటలు)       ఆచార్య శ్రీ కొత్తపెల్లి జయశంకర్ సార్ జయంతి సందర్భంగా జగిత్యాల పట్టణంలోని జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించిన జిల్లా  తొలి జడ్పీ చైర్ పర్సన్  దావ వసంతసురేష్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.తెలంగాణ లోని 4కోట్ల మంది ప్రజల ఆరాధ్య దైవం...
Read More...
Local News 

ఎస్ కె ఎన్ ఆర్ ప్రభుత్వ కళాశాలలో ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు

ఎస్ కె ఎన్ ఆర్ ప్రభుత్వ కళాశాలలో ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు జగిత్యాల ఆగస్టు 6 (ప్రజా మంటలు) ఎస్ కే ఎన్ ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ మరియు సైన్స్ కళాశాల జగిత్యాల జిల్లా కేంద్రంలో బుధవారం ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్  అరిగెల అశోక్  మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ప్రొఫెసర్  జయశంకర్  చాలా చురుకుగా పాల్గొని తెలంగాణ...
Read More...
Local News 

పెగడపల్లి  మండల కేంద్రంలోని  తెలంగాణ మోడల్ స్కూల్ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్. 

పెగడపల్లి  మండల కేంద్రంలోని  తెలంగాణ మోడల్ స్కూల్ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్.     పెగడపల్లి ఆగస్ట్ 8 (ప్రజా మంటలు)బుధవారం రోజున జగిత్యాల జిల్లా పెగడపల్లి.మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్  పాఠశాలను జిల్లా కలెక్టర్  సత్య ప్రసాద్   తనిఖీ చేసి   పరిశీలించి.  పాఠశాల విద్యార్థుల హాజరు రిజిస్టర్ లను పరిశీలించారు. విద్యార్థులకు  నాణ్యత మైన విద్యను అందించాలి. విద్యార్థులతో కలిసి కూర్చొని విద్యా బోధనను పరిశీలించిన జిల్లా...
Read More...
Local News 

ఈవీఎం గోడౌన్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్

ఈవీఎం గోడౌన్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్                                                                                                                                         జగిత్యాల ఆగస్టు 6 ( ప్రజా మంటలు)                                                                                                                                                                                         బుధవారం రోజున జగిత్యాల జిల్లా కేంద్రంలోని  ధరూర్ క్యాంప్ లో గల ఈ.వీ.ఎం గోడౌన్ కేంద్రాన్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు.  ఈ.వి.ఎం భద్రతకు  సంబంధించి ప్రతి నెలా తనిఖీ చేయడం జరుగుతుందని, అందులో భాగంగా  ఈవీఎం గోడౌన్...
Read More...
Local News 

జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా ఆచార్య జయశంకర్ జయంతి వేడుకలు

జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా ఆచార్య జయశంకర్ జయంతి వేడుకలు జగిత్యాల ఆగస్టు 6 ( ప్రజా మంటలు) తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్త . ఆచార్య జయశంకర్  జయంతి వేడుకలను  జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ప్రొ. జయశంకర్ జయంతిని పురస్కరించుకోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యాక్రమములో ముందుగా   డిపిఓ కార్యాలయ  ఏ ఓ శశికళా   ప్రొ. జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి...
Read More...
Local News  State News 

ప్రొఫెసర్ జయశంకర్ సార్ స్పూర్తితో సామాజిక తెలంగాణ సాధనకు కృషి -ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

ప్రొఫెసర్ జయశంకర్ సార్ స్పూర్తితో సామాజిక తెలంగాణ సాధనకు కృషి -ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సామాజిక విప్లవానికి తెలంగాణ జాగృతి నాయకత్వం వహిస్తుంది సామాజిక తెలంగాణ సాధన కోసం ఏ ఒక్క అంశాన్ని వదిలిపెట్టబోం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బీసీలను మోసం చేస్తున్నాయి ఢిల్లీలో కాంగ్రెస్ దొంగ ధర్నాలతో ఒరిగేదేమీలేదు బీసీల నోటికాడి ముద్దను బీజేపీ లాక్కుంటుంది తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్ ఆగస్ట్...
Read More...
Local News  State News  Crime 

గిత్యాల ఆర్టీఓ ఆఫీస్‌లో ఏసీబీ ఆకస్మిక దాడులు డిటివో నాయక్

గిత్యాల ఆర్టీఓ ఆఫీస్‌లో ఏసీబీ ఆకస్మిక దాడులు డిటివో నాయక్ 22 వేల లంచం తీసుకుంటూ,రెడ్ హ్యాండెడ్ పట్టుబడ్డ DTO బద్రు నాయక్  కోరుట్ల జెసిబి ఓనర్ శశిధర్ ఫిర్యాదుతో ఏసీబీ అధికారుల సోదాలు జగిత్యాల ఆగస్ట్ 06: జగిత్యాల్ జిల్లా రవాణా అధికారి (DTO) బానోత్ భద్రు నాయక్ ని ACB కరీంనగర్ యూనిట్ తన కార్యాలయంలో రెడ్ హ్యాండెడ్ గా  పట్టుకుంది. తన వాహన...
Read More...
Local News 

సకాలంలో గుర్తించి, ట్రీట్మెంట్ తీసుకుంటే వాస్క్యులర్ సమస్య నివారించవచ్చు

సకాలంలో గుర్తించి, ట్రీట్మెంట్ తీసుకుంటే వాస్క్యులర్ సమస్య నివారించవచ్చు నేషనల్ వాస్క్యులర్ డే ...కిమ్స్సన్ షైన్ ఆసుపత్రి ఆధ్వర్యంలో వాక్ థాన్, అవేర్నేస్       - పాల్గొన్న సినీ నటుడు రాజీవ్ కనకాల    సికింద్రాబాద్, ఆగస్ట్ 06 (ప్రజామంటలు) :    త్వరితంగా గుర్తించి, సకాలంలో  సరైన వైద్య చికిత్సలు తీసుకుంటే, వాస్క్యులర్ తో బాధపడుతున్న వారిలో   80శాతం వరకు అంప్యూటేషన్‌ (చేతులు, కాళ్ళు తీసివేయడం) లను నివారించవచ్చునని...
Read More...