నేడే పోలాల అమావాస్య.. పశువులను పూజించడం ఆనవాయితీ
ప్రతియేటా శ్రావణమాసంలో వచ్చే అమావాస్యను పోలాల అమావాస్య అంటారు. శనివారం అమావాస్య సందర్భంగా పశువులను పూజించడం పూజలు నిర్వహించడం ఆనవాయితీ గా వస్తుంది.
ఈ క్రమంలో ఈ అమావాస్య విశిష్టతను, వ్రతం కథను తెలుసుకుందాం హిందూ సాంప్రదాయంలో ఆవులు ఎద్దులు , బర్రెలు దున్నలు వంటి పశువులు
వ్యవసాయ పనులలో
రైతులకు ముమ్మరంగా సహాయం చేసేవి . దాంతో పోలాలన్ని నాట్లు పూర్తయి శ్రావణ బహుళ అమావాస్య వరకు ఎటూ చూసినా పచ్చని పచ్చదనం పరుచుకుని పశువులకు కాస్త తెరిపి దొరికేది . పశువులు తమకు చేసిన మేలువల్ల రైతాంగం పశువులను నీళ్ళతో కడిగి కొమ్ములకు రంగులు వేసి గౌరవించి పూజించడం ఆనవాయితీ గా మారింది
సంతానం పొందిన మహిళలు తమ పిల్లల బాగుకోసం ఈ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరిస్తారు.
పురాణాల ప్రకారం
పోలాల అమావాస్య కథ
పూర్వం ఓ గ్రామంలో నివసించే బ్రాహ్మణ దంపతులకు ఏడుగురు కుమారులు. యుక్త వయస్సు రాగానే కుమారులందరికీ వివాహాలు చేశారు. వారికి సంతానం కూడా కలిగింది. ఏడుగురు కుమారులు ఆ గ్రామంలోనే వేర్వేరుగా కాపురాలు పెట్టుకున్నారు.
తమ పిల్లలు బాగుండాలంటే శ్రావణ మాసంలో వచ్చే అమావాస్య రోజు పోలాంబ అమ్మవారిని పూజిస్తూ వ్రతం ఆచరిస్తే శుభం జరుగుతుందని పెద్దలు చెబుతారు.
దీంతో ఏడుగురు అన్నదమ్ములు శ్రావణమాసం లో ఉన్న ముఖ్యమైన వ్రతాలన్నీ ఆచరించారు. చివరిగా అమావాస్య రోజు వచ్చే పోలాల అమావాస్య వ్రతం ఆచరించేందుకు అన్నీ ఏర్పాట్లు చేసుకున్నారు. అంతలోనే పోలాల అమావాస్య వ్రతం రోజు ఉదయాన్నే చివరి కొడుకు కుమారుడు మరణిస్తాడు. దీంతో వ్రతం చేయలేకపోతారు. మరుసటి ఏడాది వ్రతం ఆచరించడానికి ప్రయత్నాలు ప్రారంభిస్తారు. మళ్లీ ఆ ఏడాది కూడా చివరి కుమారుడి మరో బిడ్డ మరణిస్తాడు. దీంతో ఆ ఏడాది కూడా వ్రతం చేయలేకపోతారు.
ఇలా ప్రతి ఏడాది వ్రతం చేయడానికి ఏర్పాట్లు చేసుకోవడం.. బిడ్డ మరణించడం, వ్రతం చేయలేకపోవడం.. ఇలా ఏడేళ్లు జరుగుతుంది. దీంతో మిగిలిన ఆరు మంది కోడళ్లు ఏడో కోడలి వల్లే వ్రతం చేయలేకపోతున్నాము అంటూ తిట్టుకుంటారు. ఈ కారణంగా ఏడో కోడలు కుమిలిపోతూ ఉంటుంది.
ఈ క్రమంలో 8వ ఏడాది కూడా వ్రతం చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటారు. ఆరోజు కూడా ఏడో కోడలి మరో బిడ్డ చనిపోతుంది. ఈ విషయం అందరికీ తెలిస్తే మళ్లీ నిందిస్తారని బిడ్డ మరణించిన విషయాన్ని బయటకు చెప్పకుండా.. మాములుగానే మిగతా వారితో కలిసి వ్రతంలో పాల్గొంటుంది. అందరూ ఆనందంగా వ్రతం చేస్తుంటే.. ఏడో కోడలు మాత్రం యాంత్రికంగా వ్రతంలో పాల్గొంటుంది. రాత్రి వరకూ అలాగే గడిచిపోతుంది.
అయితే.. రాత్రి బాగా చీకటి పడి గ్రామంలో అందరూ నిద్రపోయిన సమయంలో చనిపోయిన బిడ్డను భుజాన వేసుకుని ఆ గ్రామ పొలిమేరలో కొలువై ఉన్న పోలేరమ్మ గుడి వద్దకు చేరుకుంటుంది. ఆ అమ్మవారి గుడి ముందు తన బిడ్డ మృతదేహాన్ని ఉంచి.. దుఖిస్తూ ఉంటుంది. ఆ సమచంలో గ్రామదేవత అయిన పోలేరమ్మ గ్రామ సంచారం ముగించుకుని గుడి వద్దకు చేరుకుంటుంది. అప్పటికే గుడి దగ్గర ఉన్న ఆమెను చూసి ఎందుకు ఏడుస్తున్నావు అంటూ కారణం అడిగి తెలుసుకుంటుంది.
దీంతో ఆమె గత ఎనిమిదేళ్లుగా జరుగుతున్న విషయాన్ని చెబుతుంది. అప్పుడు పోలేరమ్మ కరుణించి ఆమెకు అక్షతలు ఇస్తుంది. ఈ అక్షతలను చనిపోయిన మీ పిల్లలను పూడ్చిన చోట చల్లి ఆ పిల్లలను వారి పేర్లతో పిలవమని చెబుతుంది. ఆమె అదే విధంగా చేస్తుంది. దీంతో చనిపోయిన పిల్లలు అందరూ నిద్రలో నుంచి లేచి వచ్చినట్లుగా బయటకు వస్తారు. ఆనందంతో ఆమె పిల్లలందరినీ వెంటబెట్టుకుని పోలేరమ్మ అమ్మవారి వద్దకు తీసుకెళ్లి.. ఆమె ఆశీస్సులు తీసుకుని ఇంటికి చేరుకుంటుంది.
ఉదయం గ్రామంలోని వారందరికీ జరిగిన విషయం చెప్పగా అందరూ సంతోషిస్తారు. అప్పటి నుంచి ప్రతి ఏడాది ఈ పోలాల అమావాస్య వ్రతాన్ని ఆచరించసాగారు అని లోకోక్తి. ఈ వ్రతం చేయడం వల్ల సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని.. సంతానం ఉంటే పిల్లలకు అపమృత్యుభయం తొలగిపోయి, ఆయురారోగ్యాలు కలుగుతాయని శాస్త్ర వచను .
పూజా సమయంలో కంద మొక్కను పూజా గదిలో ఉంచి, దానిపై తొమ్మిది పసుపు కొమ్మలు కట్టాలి. మొదట వినాయకుడిని ఆరాధించి, ఆ తర్వాత కంద మొక్కలోకి మంగళగౌరీ దేవిని లేదా సంతానలక్ష్మీ దేవిని ఆహ్వానించి, షోడశోపచార పద్ధతిలో పూజించాలి ఐదు రకాల పిండి వంటకాలను నైవేద్యంగా సమర్పించడం ఆచారంగా వస్తుంది.పూజ అనంతరం వ్రతకథను వినాలి శక్తి మేరకు ముత్తైదువులకు భోజన తాంబూలాలు ఇవ్వాలి
***. ****
.చెరుకు మహేశ్వర శర్మ రాయికల్ జగిత్యాల
More News...
<%- node_title %>
<%- node_title %>
రేషన్ డీలర్లకు కమిషన్ పాత పద్ధతిలోనే ఇవ్వాలని వినతి పత్రం

ప్రో.తాటికొండ వెంకట రాజయ్య మృతికి సంతాపం

మాజీ ఎంపీ సురవరంకు మాజీ మంత్రి రాజేశం గౌడ్ నివాళులు

ప్రజాసేవతోనే నాయకులకు గుర్తింపు... ఘనంగా మర్రి శశిధర్ రెడ్డి జన్మదిన వేడుకలు

సికింద్రాబాద్ లో సిక్కులు గురు గ్రంథ్ సాహిబ్ పేహ్ల ప్రకాశ్ పూరబ్

ఎవరి కోసం"నటన"రాజన్ యాత్ర

స్కై ఫౌండేషన్ 283 వ అన్నదానం

అభినవ్ నగర్ అధ్యక్షులుగా చంద్రపాల్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక

గాంధీ మెడికల్ కాలేజీకి సురవరం డెడ్ బాడీ డొనేట్

వర్ష కొండ గ్రామంలో చనిపోయిన మేక మాంసం విక్రయం?

పాడ్యమి పర్వదినం పురస్కరించు కొని ప్రత్యేక పల్లకి సేవ

రాష్ట్ర స్థాయి ఫూట్ బాల్ పోటీలకు జ్యోతి హైస్కూల్ ఐఐటీ అకాడమీ విద్యార్థులు
