కూకట్ పల్లి బాలిక హత్య కేసులో నిందితుని గుర్తింపు?
హైదరాబాద్ ఆగస్టు 22 (ప్రజా మంటలు):
కూకట్ పల్లి లోని సంగీత నగర్ లో ఇటీవల పదేళ్ల పాప దారుణ హత్య వెనుక మిస్టరీని పోలీసులు విడదీశారు.
ఆదేప్పఆన్దోతమలో ఉండే ఓ తరగతి విద్యార్థి, ఈ బాలికను హత్య చేసినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైనట్టు తెలుస్తుంది. సమయంలో ఇంట్లో చోరీ కోసం వెళ్లిన బాలుడు, బాలిక ఒకతె ఉండటంతో హత్య చేసినట్టు, బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిసింది.
సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం ముక్తాక్యాసారం గ్రామానికి చెందిన కృష్ణ, రేణుక దంపతులు ఐదేళ్లుగా కూకట్ పల్లి లోని సంగీత నగర్ లో నివాసం ఉంటున్నారు. కృష్ణ స్థానికంగా మెకానిక్ షెడ్డులో పనిచేస్తుండగా, రేణుక ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్. వీరికి కుమార్తె సహస్ర(10), కుమారుడు(7) ఉన్నారు. సహస్ర బోయిన్పల్లిలోని కేంద్రీయ విద్యాలయంలో ఆరో తరగతి చదువుతోంది. కుమారుడు కాలనీలోని బడికి వెళ్తున్నాడు. సోమవారం ఉదయం యథావిధిగా తల్లిదండ్రులు విధులకు వెళ్లగా, వారి కుమారుడు పాఠశాలకు వెళ్లాడు.
క్రీడోత్సవాల నేపథ్యంలో పాఠశాలకు సెలవు ఇవ్వడంతో బాలిక ఒంటరిగా ఇంట్లో ఉంది.
స్కూల్ నుంచి ఫోన్ రావడంతో,తానే స్కూల్కు వెళ్లి తమ్ముడికి టిఫిన్ బాక్స్ ఇస్తానని బాలిక చెప్పడంతో తల్లి భోజనం సిద్ధం చేయిపెట్టి, పనికి వెళ్ళిపోయింది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో 'లంచ్ బాక్సు తీసుకురాలేదేమంటూ' స్కూల్ సిబ్బంది కృష్ణకు ఫోన్ చేశారు. ఆయన ఇంటికి వెళ్లారు. తలుపు బయట నుంచి గడియ పెట్టి ఉండటంతో తెరిచారు. కుమార్తె శరీరంపై కత్తిపోట్లతో మంచంపై విగతజీవిగా కనిపించడంతో భయభ్రాంతులకు గురై కేకలు వేయడంతో,ఇరుగుపొరుగు వారు చేరి, పోలీసులకు సమాచారమిచ్చారు.
బాలిక ఒంటి మీద 20 కత్తి గాట్లు..బాలిక శరీరంపై 20వరకు కత్తి గాయాలున్నాయి. మెడపైనే 10 ఉన్నాయి. పోస్టుమార్టం ప్రాథమిక నివేదిక ప్రకారం..హత్య సోమవారం ఉదయం 9.30-10.30 గంటల మధ్య జరిగినట్లు తెలుస్తుంది.
ఆ సమయంలోనే బాలిక కేకలు వినిపించినట్లు పక్క భవనంలో నివసించేవారు పోలీసులకు సమాచారమిచ్చారు. జాగిలం ఘటనా స్థలం నుంచి నేరుగా కిందికి వెళ్లింది. దర్యాప్తులో భాగంగా సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజీలు సేకరించిన పోలీసులు, ఐదు రోజులుగా అన్ని కోణాల్లో సమాచారం సేకరించి, ఎట్టకేలకు నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.
More News...
<%- node_title %>
<%- node_title %>
మాజీ ఎంపీ సురవరంకు మాజీ మంత్రి రాజేశం గౌడ్ నివాళులు

ప్రజాసేవతోనే నాయకులకు గుర్తింపు... ఘనంగా మర్రి శశిధర్ రెడ్డి జన్మదిన వేడుకలు

సికింద్రాబాద్ లో సిక్కులు గురు గ్రంథ్ సాహిబ్ పేహ్ల ప్రకాశ్ పూరబ్

ఎవరి కోసం"నటన"రాజన్ యాత్ర

స్కై ఫౌండేషన్ 283 వ అన్నదానం

అభినవ్ నగర్ అధ్యక్షులుగా చంద్రపాల్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక

గాంధీ మెడికల్ కాలేజీకి సురవరం డెడ్ బాడీ డొనేట్

వర్ష కొండ గ్రామంలో చనిపోయిన మేక మాంసం విక్రయం?

పాడ్యమి పర్వదినం పురస్కరించు కొని ప్రత్యేక పల్లకి సేవ

రాష్ట్ర స్థాయి ఫూట్ బాల్ పోటీలకు జ్యోతి హైస్కూల్ ఐఐటీ అకాడమీ విద్యార్థులు

నిరుపేద కుటుంబానికి ప్రజా ప్రతినిధులు, గ్రామపెద్దలు యువకుల ఆర్థిక సహాయం

ఘనంగా ముగిసిన భగవద్గీత శిక్షణ తరగతులు
