గాంధీ మెడికల్ కాలేజీకి సురవరం డెడ్ బాడీ డొనేట్
కడసారి వీడ్కోలు పలికిన నేతలు , కార్యకర్తలు
సికింద్రాబాద్, ఆగస్ట్ 24 (ప్రజామంటలు) :
సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్‌రెడ్డి పార్ధివ దేహాన్ని వైద్యవిద్యార్థుల పరిశోధనల నిమిత్తం సికింద్రాబాద్‌గాంధీ మెడికల్‌కళాశాలకు డొనేట్ చేశారు. ఆదివారం సాయంత్రం మఖ్దూంభవన్‌నుంచి గాంధీ మెడికల్‌కాలేజీ వరకు సురవరం భౌతికకాయాన్ని కార్యకర్తలు వెంట రాగా ఊరేగింపుగా తీసుకువచ్చారు. కుటుంబసభ్యులు, సీపీఐ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్దసంఖ్యలో హజరై కామ్రెడ్ లాల్‌సలామ్...అంటూ నినాదాలు చేస్తు ఆయనతో తమకున్న, జ్ఞాపకాలను,సన్నిహిత్యాన్ని గుర్తుచేసుకున్నారు. ఈసందర్బంగా కళాకారులు గీతాలు ఆలపించారు.ఆయన కోరిక మేరకు భార్య విజయలక్ష్మీ, కుమారులు నిఖిల్,కపిల్ లతో కలిసి పలువురు సీపీఐ నేతలు సురవరం సుధాకర్‌రెడ్డి పార్ధివ దేహాన్ని గాంధీ మెడికల్‌కాలేజీ ప్రిన్సిపాల్‌ప్రొఫెసర్‌ఇందిర, ఫిజియాలజీ హెచ్‌ఓడీ ప్రొఫెసర్‌రమాదేవి, అనాటమీ ప్రొఫెసర్‌సుధాకర్‌బాబులకు అప్పగించారు. చాలా కాలం వరకు ఉండే విదంగా సురవరం భౌతికకాయానికి ఎంబామింగ్ చేసి భధ్రపరుస్తామని, వైద్యవిద్యార్థుల పరిశోధనలు, శరీర నిర్మాణం, సైంటిఫిక్‌నాలెడ్జ్‌పెంచుకునేందుకు దోహదపడుతుందని వివరించారు. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా, రాజ్యసభ సభ్యులు బియన్‌విశ్వం, సంతోష్, కేరళ రాష్ట్ర మంత్రి రాజన్, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, మాజీ మంత్రులు హరీష్‌రావు, శ్రీనివాసగౌడ్, చెరుకు సుధాకర్, ప్రెస్‌అకాడమీ ఛైర్మన్‌శ్రీనివాసరెడ్డి తదితరులు హజరై సురవరం సుధాకర్‌రెడ్డి భౌతికకాయంపై పూలమాలలు వేసి నివాళులర్పించి, కడసారి వీడ్కోలు పలికారు. సురవరం సుధాకర్ రెడ్డి పార్థివ దేహాన్ని వైద్య విద్యార్థులు, సిబ్బంది అనాటమీ డిపార్ట్ మెంట్ కు తరలించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మాజీ ఎంపీ సురవరంకు మాజీ మంత్రి రాజేశం గౌడ్ నివాళులు

ప్రజాసేవతోనే నాయకులకు గుర్తింపు... ఘనంగా మర్రి శశిధర్ రెడ్డి జన్మదిన వేడుకలు

సికింద్రాబాద్ లో సిక్కులు గురు గ్రంథ్ సాహిబ్ పేహ్ల ప్రకాశ్ పూరబ్

ఎవరి కోసం"నటన"రాజన్ యాత్ర

స్కై ఫౌండేషన్ 283 వ అన్నదానం

అభినవ్ నగర్ అధ్యక్షులుగా చంద్రపాల్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక

గాంధీ మెడికల్ కాలేజీకి సురవరం డెడ్ బాడీ డొనేట్

వర్ష కొండ గ్రామంలో చనిపోయిన మేక మాంసం విక్రయం?

పాడ్యమి పర్వదినం పురస్కరించు కొని ప్రత్యేక పల్లకి సేవ

రాష్ట్ర స్థాయి ఫూట్ బాల్ పోటీలకు జ్యోతి హైస్కూల్ ఐఐటీ అకాడమీ విద్యార్థులు

నిరుపేద కుటుంబానికి ప్రజా ప్రతినిధులు, గ్రామపెద్దలు యువకుల ఆర్థిక సహాయం

ఘనంగా ముగిసిన భగవద్గీత శిక్షణ తరగతులు
