మానసిక సమస్యతో ఏడు బ్లేడ్లను మింగిన వ్యక్తి
ట్రీట్మెంట్ చేసి కాపాడిన గాంధీ వైద్యులు
సికింద్రాబాద్, ఆగస్టు 22 (ప్రజామంటలు):
వైద్య చరిత్రలో అరుదైన ఘటన ఇది. సిటీకి మౌలాలీకి ఆటో డ్రైవర్ రియాజుద్దీన్ పాషా అనే 37 ఏండ్ల వ్యక్తి ఈనెల 16న మానసిక సమస్యతో 7 షేవింగ్ బ్లేడ్లను మింగాడు.వెంటనే కుటుంబీకులు గాంధీ ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డులో చేర్పించారు. జనరల్ సర్జరీ విభాగంలో డాక్టర్లు పేషంట్‌కు పలు వైద్యపరీక్షలు చేసి, ఆహారం ఇవ్వకుండ, మందులు, ప్లూయిడ్స్ ఇచ్చారు.
ముందుగా ఎండోస్కోపి ద్వారా బ్లేడ్లను బయటకు తీయాలని అనుకున్నారు. కాని వాటిని తీసే క్రమంలో కడుపులోని అన్నవాహిక, జీర్ణాశయం, పేగులకు గాయాలు అవుతాయని భావించి, ఆప్రయత్నం మానుకున్నారు. అబ్జర్వేషన్ లో పెట్టి, మందులను ఇచ్చారు. అదృష్టవశాత్తు జీర్ణాశయంలో ఎలాంటి రక్తగాయాలు కాలేదు.
చివరికి మలద్వారం వెంట 7 బ్లేడ్లు పడిపోవడంతో పేషంట్‌ను శుక్రవారం గాంధీ నుంచి డిశ్చార్జీ చేసినట్లు డా.సునీల్ తెలిపారు.
అరుదైన వైద్యం అందించి, పేషంట్ ప్రాణాలను కాపాడిన గాంధీ డాక్టర్లను పలువురు అభినందించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మాజీ ఎంపీ సురవరంకు మాజీ మంత్రి రాజేశం గౌడ్ నివాళులు

ప్రజాసేవతోనే నాయకులకు గుర్తింపు... ఘనంగా మర్రి శశిధర్ రెడ్డి జన్మదిన వేడుకలు

సికింద్రాబాద్ లో సిక్కులు గురు గ్రంథ్ సాహిబ్ పేహ్ల ప్రకాశ్ పూరబ్

ఎవరి కోసం"నటన"రాజన్ యాత్ర

స్కై ఫౌండేషన్ 283 వ అన్నదానం

అభినవ్ నగర్ అధ్యక్షులుగా చంద్రపాల్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక

గాంధీ మెడికల్ కాలేజీకి సురవరం డెడ్ బాడీ డొనేట్

వర్ష కొండ గ్రామంలో చనిపోయిన మేక మాంసం విక్రయం?

పాడ్యమి పర్వదినం పురస్కరించు కొని ప్రత్యేక పల్లకి సేవ

రాష్ట్ర స్థాయి ఫూట్ బాల్ పోటీలకు జ్యోతి హైస్కూల్ ఐఐటీ అకాడమీ విద్యార్థులు

నిరుపేద కుటుంబానికి ప్రజా ప్రతినిధులు, గ్రామపెద్దలు యువకుల ఆర్థిక సహాయం

ఘనంగా ముగిసిన భగవద్గీత శిక్షణ తరగతులు
