ఎవరి కోసం"నటన"రాజన్ యాత్ర
అధికారంలో ఉన్నారా..? ప్రతి పక్షంలో ఉన్నారా?
సికింద్రాబాద్ ఆగస్టు 24 (ప్రజా మంటలు):
తెలంగాణ రాష్ట్రంలో ప్రజాహిత యాత్ర పేరిట కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ చేస్తున్న యాత్ర కేవలం నటన కోసం మాత్రమే అన్నట్లుగా ఉందని, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నదా లేదా ప్రతిపక్షంలో ఉన్నదా అని తెలంగాణ ప్రజలు అయోమయంలో ఉన్నారని బీజేపీ రజక సెల్ రాష్ట్ర కన్వీనర్ మల్లేశ్వరపు రాజేశ్వరి విమర్శించారు. మెట్టుగూడ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ కేంద్రంలో మరియు దేశంలోని ఇరవై రాష్ట్రాల పైచిలుకు బీజేపీ అధికారంలో ఉంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ అధికారంలో ఉందనుకొని ఊహించి కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జీ మీనాక్షి నట రాజన్ పాదయాత్ర చేస్తున్నారని ఎద్దేవాచేశారు.ప్రజాహిత యాత్ర అని కాకుండా ఆరు గ్యారంటీలు 420 హామీలతో అధికారంలో వచ్చి అమలు చేయనందుకు ప్రజలు క్షమించాలి అనే పేరుతో యాత్ర చేపడితే బాగుండేదని అన్నారు. మహిళకు తులం బంగారం నెల నెల 2500 వందలు అయిదు వందలకే సిలిండర్ అని మహిళలను మోసం చేసినందుకు మహిళల పక్షాన మీనాక్షి నటరాజన్ తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీయాలని డిమాండ్ చేశారు.
యాత్రలో కాంగ్రెస్ నాయకులు యూరియాను నల్ల బజార్ కు తరలిస్తూ కృత్రిమ కొరత సృష్టిస్తూ కేంద్రాన్ని బద్నాం చేయాలని చూస్తున్నారని పేర్కొన్నారు. యూరియా కోసం,రెండు లక్షల రుణమాఫీ కోసం రైతులు కాంగ్రెస్ నాయకులను ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా అని కాంగ్రెస్ నాయకులను నిలదీస్తున్నారని అన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మాజీ ఎంపీ సురవరంకు మాజీ మంత్రి రాజేశం గౌడ్ నివాళులు

ప్రజాసేవతోనే నాయకులకు గుర్తింపు... ఘనంగా మర్రి శశిధర్ రెడ్డి జన్మదిన వేడుకలు

సికింద్రాబాద్ లో సిక్కులు గురు గ్రంథ్ సాహిబ్ పేహ్ల ప్రకాశ్ పూరబ్

ఎవరి కోసం"నటన"రాజన్ యాత్ర

స్కై ఫౌండేషన్ 283 వ అన్నదానం

అభినవ్ నగర్ అధ్యక్షులుగా చంద్రపాల్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక

గాంధీ మెడికల్ కాలేజీకి సురవరం డెడ్ బాడీ డొనేట్

వర్ష కొండ గ్రామంలో చనిపోయిన మేక మాంసం విక్రయం?

పాడ్యమి పర్వదినం పురస్కరించు కొని ప్రత్యేక పల్లకి సేవ

రాష్ట్ర స్థాయి ఫూట్ బాల్ పోటీలకు జ్యోతి హైస్కూల్ ఐఐటీ అకాడమీ విద్యార్థులు

నిరుపేద కుటుంబానికి ప్రజా ప్రతినిధులు, గ్రామపెద్దలు యువకుల ఆర్థిక సహాయం

ఘనంగా ముగిసిన భగవద్గీత శిక్షణ తరగతులు
