అసలైన ఓటు చోర్ కాంగ్రెస్ పార్టీయే -బీజేపీ నాయకురాలు ఏం. రాజేశ్వరి
అబద్ధాలు ఆడడంలో కాంగ్రెస్ కు ఆస్కార్ అవార్డు ఇవ్వాలి
సికింద్రాబాద్, ఆగస్ట్ 22 (ప్రజామంటలు ):
ఎన్నికలు రాగానే కాంగ్రెస్ పార్టీకి ప్రజాస్వామ్యం, రాజ్యాంగం గుర్తుకొస్తాయని బిజెపి రజక సెల్ రాష్ట్ర కన్వీనర్ మల్లేశ్వరపు రాజేశ్వరి విమర్శించారు. ఆమె శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, రాజ్యాంగాన్ని జేబులో పెట్టుకొని ప్రజాస్వామ్యం,రాజ్యాంగం ప్రమాదంలో పడిందని మైనారిటీలు ప్రమాదంలో ఉన్నారని రిజర్వేషన్లు ప్రమాదంలో ఉన్నాయని కాంగ్రెస్ తప్పుడు ఆరోపణలు చేస్తుందన్నారు.
హిందీ భాషను రాష్ట్రాలపై బలవంతంగా రుద్దడం వలన ప్రాంతీయ భాషలు ప్రమాదంలో పడ్డాయని దుష్ప్రచారం చేసి, ఇప్పుడు కొత్తగా మీ ఓటు ప్రమాదంలో పడిందని, ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వం కలిసి మీ ఓటును దొంగిలిస్తున్నాయని కాంగ్రెస్ చేస్తున్న ప్రచారం ఎవరు నమ్మే స్థితిలో లేరన్నారు.
ప్రమాదంలో పడింది 65సంవత్సరాలు దేశాన్ని పాలించిన నెహ్రూ కుటుంబం, కాంగ్రెస్ పార్టీ ప్రమాదంలో పడబోతుందని తెలుసుకొని దేశప్రజల దృష్టిని మరల్చడానికి ఓటు చోరీ అంటూ రోడ్లపై తిరుగుతిన్నారని పేర్కొన్నారు.
స్వాతంత్రానంతరం నెహ్రూ కాలం నుండి అసలైన ఓటు చోరీ కి పాల్పడింది నెహ్రూ కుటుంబ సభ్యులేనని విమర్శించారు.1947 సంవత్సరంలో మొదటి సారిగా ప్రధానమంత్రి ఎన్నికకు రాజ్యాంగ పరిషత్ లోని 15 ఓట్లకుగాను 12ఓట్లు సాధించిన సర్దార్ పటేల్ ప్రధాన మంత్రి కాకుండా ఒక్క ఓటు వచ్చిన నెహ్రూ ప్రధాన మంత్రి అయి ఓటు చోరికి పాల్పడ్డారని అన్నారు.
తర్వాత అడ్డదారిలో గెలిచిన ఇందిరాగాంధీ నియామకం చెల్లదని అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇస్తే తీర్పును కాలరాసి అత్యవసర పరిస్థితి ప్రకటించి ఓటు చోరికి పాల్పడ్డారని అన్నారు.1968లో సోనియా వివాహం జరిగితే 16 సంవత్సరాల వరకు భారత పౌరసత్వం తీసుకోలేదని కాని 1983లో జరిగిన ఎన్నికల్లో సోనియా ఓటు వేసి ఓటు చోరికి పాల్పడిందని పీవీ నరసింహ రావు ప్రధాన మంత్రి అయ్యాక జరిగిన బల ప్రదర్శనలో పార్లమెంటు సాక్షిగా ఎంపీలను కొనుగోలు చేసి డబ్బుల సూటుకేసులు మార్చుకొని ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసి ఓటు చోరికి పాల్పడిందని అన్నారు.
రాహుల్ గాంధీకి బ్రిటన్ లో పౌరసత్వం కొనసాగిస్తూ భారత్ లో ఓటు చోరీ చేసుకుంటూ ఎంపీ అవుతున్నారని దుయ్యబట్టారు.2024లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో 100నియోజకవర్గాల్లో ఓటు చోరీ జరిగింది అని చేస్తున్న ప్రచారం అది నిజమే అయితే కాంగ్రెస్ పార్టీ గెలిచిన 99 నియోజకవర్గాలతో పాటు హైద్రాబాద్ నుండి గెలిచిన అసదుద్దీన్ నియోజవర్గాల్లో ఓటు చోరీ జరిగినట్లు రాహుల్ గాంధీ ఒప్పుకోవాలని అన్నారు. బిజెపి ఓటు చోరికి పాల్పడేది అయితే వాజపేయి ఒక్క ఓటు తేడాతో ప్రధాన మంత్రి పీఠాన్ని వదులుకునే వారు కాదనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తెరగాలి అన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు భారతదేశాన్ని ధర్మ సత్రంగా మార్చి పాకిస్థాన్,ఆఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్ ల నుండి వచ్చిన రోహింగ్యాలకు అక్రమ చొరబాటుదారులకు ఓటు హక్కు కల్పించి ఓటు బ్యాంకుగా మార్చుకుందని ఆరోపించారు.కాంగ్రెస్ పార్టీ నిజంగా గాంధేయవాదానికి కట్టుబడి ఉంటే భారత ఎన్నికల సంఘం చేపట్టిన బోగస్ ఓటర్ల ఏరివేతకు సహకరించాలని స్వచ్ఛ భారత్ లో భాగంగానే బోగస్ ఓటర్ల తొలగింపు కార్యక్రమం ఎన్నికల సంఘం చేపట్టిందని మల్లేశ్వరపు రాజేశ్వరీ అన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మాజీ ఎంపీ సురవరంకు మాజీ మంత్రి రాజేశం గౌడ్ నివాళులు

ప్రజాసేవతోనే నాయకులకు గుర్తింపు... ఘనంగా మర్రి శశిధర్ రెడ్డి జన్మదిన వేడుకలు

సికింద్రాబాద్ లో సిక్కులు గురు గ్రంథ్ సాహిబ్ పేహ్ల ప్రకాశ్ పూరబ్

ఎవరి కోసం"నటన"రాజన్ యాత్ర

స్కై ఫౌండేషన్ 283 వ అన్నదానం

అభినవ్ నగర్ అధ్యక్షులుగా చంద్రపాల్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక

గాంధీ మెడికల్ కాలేజీకి సురవరం డెడ్ బాడీ డొనేట్

వర్ష కొండ గ్రామంలో చనిపోయిన మేక మాంసం విక్రయం?

పాడ్యమి పర్వదినం పురస్కరించు కొని ప్రత్యేక పల్లకి సేవ

రాష్ట్ర స్థాయి ఫూట్ బాల్ పోటీలకు జ్యోతి హైస్కూల్ ఐఐటీ అకాడమీ విద్యార్థులు

నిరుపేద కుటుంబానికి ప్రజా ప్రతినిధులు, గ్రామపెద్దలు యువకుల ఆర్థిక సహాయం

ఘనంగా ముగిసిన భగవద్గీత శిక్షణ తరగతులు
