కంటోన్మెంట్ అభివృద్ధే లక్ష్యంగా ముందడుగు. - కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్
సికింద్రాబాద్, ఆగస్ట్ 23 (ప్రజామంటలు) :
కంటోన్మెంట్ నియోజకవర్గ అభివృద్దే లక్ష్యంగా ముందుకు సాగుతామని ఎమ్మెల్యే శ్రీగణేశ్ అన్నారు. శనివారం వార్డు 3 మడ్ ఫోర్ట్ కంటోన్మెంట్ క్వార్టర్స్ ఏరియాలోని బస్తీ వాసుల నీటి ఎద్దడిని తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ తో ఎమ్మెల్యే శ్రీ గణేష్ నూతన బోర్ వెల్ వేయించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మద మల్లికార్జున్ తో పాటు కలసి పాల్గొని బోర్ వెల్ డ్రిల్లింగ్ పనులను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే తన ప్రధాన లక్ష్యమని, రాజకీయాలు కేవలం ఎన్నికల వరకే పరిమితం కావాలని, తర్వాత పార్టీలకు అతీతంగా అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలన్నారు.
ఎన్నో ఏళ్ల నుంచి మంచినీటి వసతికి కూడా ఇబ్బందులు పడుతున్న ఈ కాలనీవాసులు సమస్యను నా దృష్టికి తీసుకురావడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో మాట్లాడి నియోజకవర్గానికి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ తీసుకువచ్చామన్నారు. మొదటగా మంచినీటి సమస్య, అంతర్గత రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచడానికి కృషి చేస్తున్నానని, దీనికి అందరూ సహకరించాలన్నారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మాజీ ఎంపీ సురవరంకు మాజీ మంత్రి రాజేశం గౌడ్ నివాళులు

ప్రజాసేవతోనే నాయకులకు గుర్తింపు... ఘనంగా మర్రి శశిధర్ రెడ్డి జన్మదిన వేడుకలు

సికింద్రాబాద్ లో సిక్కులు గురు గ్రంథ్ సాహిబ్ పేహ్ల ప్రకాశ్ పూరబ్

ఎవరి కోసం"నటన"రాజన్ యాత్ర

స్కై ఫౌండేషన్ 283 వ అన్నదానం

అభినవ్ నగర్ అధ్యక్షులుగా చంద్రపాల్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక

గాంధీ మెడికల్ కాలేజీకి సురవరం డెడ్ బాడీ డొనేట్

వర్ష కొండ గ్రామంలో చనిపోయిన మేక మాంసం విక్రయం?

పాడ్యమి పర్వదినం పురస్కరించు కొని ప్రత్యేక పల్లకి సేవ

రాష్ట్ర స్థాయి ఫూట్ బాల్ పోటీలకు జ్యోతి హైస్కూల్ ఐఐటీ అకాడమీ విద్యార్థులు

నిరుపేద కుటుంబానికి ప్రజా ప్రతినిధులు, గ్రామపెద్దలు యువకుల ఆర్థిక సహాయం

ఘనంగా ముగిసిన భగవద్గీత శిక్షణ తరగతులు
