భారతీయ సినిమా నిర్మాణానికి కేంద్రంగా హైదరాబాద్ -సీఎం రేవంత్ రెడ్డి
71 వ జాతీయ చలన చిత్ర అవార్డు గ్రహీతల సన్మానం
హైదరాబాద్ ఆగస్ట్ 18:
భారతీయ సినిమా నిర్మాణానికి కేంద్రంగా హైదరాబాద్ నగరాన్ని నిలుపాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. సినిమా రంగానికి ప్రోత్సాహాకానికి అవసరమైన చేయూతను అందిస్తామని తెలిపారు. 71 వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో వివిధ విభాగాల్లో ఎంపికైన సినీ ప్రముఖులు ముఖ్యమంత్రి గారిని జూబ్లీహిల్స్‌లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లను సినీ ప్రముఖులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చారు. హైదరాబాద్‌లో సినిమా రంగ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందిస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీతలకు ముఖ్యమంత్రి అభినందనలు తెలియజేశారు.
అవార్డు గ్రహీతలైన భగవంత్ కేసరి సినిమా డైరెక్టర్ అనిల్ రావిపూడి, హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, హనుమాన్ సినిమాకు విజువల్ ఎఫెక్ట్స్‌కు సంబంధించి వెంకట్ , శ్రీనివాస్, టీమ్ సభ్యులు, ఫైట్ మాస్టర్స్ నందు, పృథ్వీ, బేబి సినిమా డైరెక్టర్ సాయి రాజేశ్, సింగర్ రోహిత్ లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్మానించారు.
కార్యక్రమంలో హనుమాన్ సినిమా నిర్మాతలు చైతన్య రెడ్డి, నిరంజన్ రెడ్డి గారు, బేబి సినిమా నిర్మాత ఎస్కేఎన్, భగవంత్ కేసరి, నిర్మాత గారపాటి సాహు తో పాటు ఇతరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఓట్ల కుంభకోణంపై SIT ద్వారా విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టులో పిటిషన్

ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలి - ఎంపీడీవో మహమ్మద్ సలీం

ఇబ్రహీంపట్నం తాసిల్దార్ కార్యాలయ తనిఖీ.

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకల్లో డాక్టర్ కోట నీలిమ

ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో దంపతుల అదృశ్యం

ఘనంగా రాజీవ్ గాంధీ గారి జయంతి వేడుక

130వ సవరణ రాజకీయ శుద్ధికా లేక రాజ్యాంగ మౌలికాంశాలనే మార్చడానికా?

ముల్కనూర్ నూతన ఎస్సైగా రాజు

వరల్డ్ మస్కిటో డే సందర్భంగా ర్యాలీ

సినిమాల్లో మహిళలకు సమానత్వం - పురుష-స్త్రీ బైనరీని దాటి వెళ్ళాలి, అంతర సంబంధితిత వాస్తవికతలను పరిష్కరించాలి: కేరళ హైకోర్టు

దేశ యువతకు స్ఫూర్తి రాజీవ్ గాంధీ - సీఎం రేవంత్ రెడ్డి

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి మంత్రి అడ్లూరి లక్ష్మణ్,మాజీ మంత్రి జీవన్ రెడ్డి
