సృష్టి కేసులో ఐదు రోజుల కస్టడీకి డాక్టర్ నమ్రత
సికింద్రాబాద్ కోర్టు తీర్పు..
సికింద్రాబాద్, జూలై 31 (ప్రజామంటలు) :
సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ అక్రమ సరోగసి,ఐవీఎఫ్, శిశువుల అక్రమ రవాణా తదితర కేసుల్లో ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రత కు పోలీసు కస్టడీ కోసం సికింద్రాబాద్ సివిల్ కోర్టు గురువారం అనుమతినిచ్చింది. సికింద్రాబాద్ సివిల్ కోర్టు పదవ అదనపు చీఫ్ మెజిస్ట్రేట్ ఐదు రోజుల పోలీస్ కస్టడీ కి అనుమతినిస్తూ తీర్పు వెల్లడించారు.
సృష్టి కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న నిర్వాహకురాలు డాక్టర్ నమ్రత కు ఐదు రోజుల కస్టడీ విచారణలో కీలక విషయాలు బయటకి రానున్నాయి. సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ లో ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో మరింత సమాచారాన్ని రాబట్టాలని ఉద్దేశంతో పోలీస్ కస్టడీకి విధించినట్టు పేర్కొన్నారు.ఈ కేసులో నిందితులుగా ఉన్న ఏ–2 డాక్టర్ నమ్రత కుమారుడు జయంత్ కృష్ణ, ఏ–6 అసోం కు చెందిన మీడియేటర్ ధనశ్రీ సంతోషిలను కూడ కస్టడీకి అప్పచెప్పాలని పోలీసులు కోర్టును కోరారు. కాగా ఐదు రోజుల డాక్టర్ నమ్రత కస్డడీ విచారణలో మరెన్నో విషయాలు వెలుగు చూడనున్నాయి.
శుక్రవారం ఉదయం చంచల్ గూడ జైల్ నుంచి పోలీసులు డాక్టర్ నమ్రతను కస్డడీలోకి తీసుకొని, విచారణ జరపనున్నారు. ఇప్పటికే డాక్టర్ నమ్రతను అడిగే ప్రశ్రలకు సంబందించిన ప్రశ్నావళిని పోలీసులు సిద్దం చేసినట్లు సమాచారం. డాక్టర్ నమ్రత చెప్పే సమాచారాన్ని బట్టి ఈ కేసులో సంబందం ఉన్న మరింత మంది అరెస్ట్ లు జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత 72 గంటల నిరాహార దీక్షకు పోలీసుల అడ్డంకి

మున్సిపల్ సమస్యలపై జోనల్ కమీషనర్ కలిసిన బీజేపీ నేత మర్రి

ప్రభుత్వ టీచర్లకు ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ ప్రారంభం

అంగన్వాడి సెంటర్లో తల్లిపాలవారోత్సవాలు
.jpg)
బీఆర్ఎస్సోళ్ళు ఉప ఎన్నికలు వస్తేనే స్కీం లు ఇచ్చేవాళ్ళు - మంత్రి పొన్నం

యూనియన్ బ్యాంక్ హెడ్ క్యాషియర్ కు కళాశాల ప్రిన్సిపల్ చే సత్కారం

అన్ని శాఖల సమన్వయంతో ఆపరేషన్ ముస్కాన్-XI విజయవంతం. జిల్లా లో 36 మoది బాల కార్మికులకు విముక్తి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

సారంగాపూర్ మండలం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్.

ఎస్సారెస్పీ కెనాల్ నీటిని సకాలంలో విడుదల చేసి ఆయకట్టు రైతాంగాన్ని ఆదుకోవాలి..... తెలంగాణ రైతు ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు శేర్ నర్సారెడ్డి

యూరియా పంపిణీపై కల్వకుంట్ల సంజయ్ బహిరంగ చర్చకు రావాలి

హమాలి బస్తీలో తల్లిపాల వారోత్సవాలు

ధర్మపురిలో ఘనంగా శ్రావణ శుక్రవార వేడుకలు
