స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుపై ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.- తెలంగాణ జన సమితి
బీసీ రిజర్వేషన్లను* *స్వాగతిస్తున్నాం....* గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు ఎం నర్సయ్య
హైదరాబాద్ జూలై 11:
స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుపై ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని కె.ధర్మార్జున్,పల్లె వినయ్ కుమార్, తెలంగాణ జన సమితి పార్టి ప్రధాన కార్యదర్శులు అన్నారు.
ఎన్నో పోరాటాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అదేస్పూర్తితోటి సామాజిక తెలంగాణ దిశగా అడుగులు వేయుట కొరకు రాష్ట్రంలోని వివిధ సామాజిక శక్తులు తెలంగాణ జన సమితి చేసిన పోరాటాలు ప్రయత్నాల మూలంగా ఈరోజు స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అనే ఆర్డినెన్స్ సాధించుకోగలిగామని ఇది ప్రజా విజయమని కె.ధర్మార్జున్,పల్లె వినయ్ కుమార్, తెలంగాణ జన సమితి పార్టి ప్రధాన కార్యదర్శులు అభిప్రాయపడుతుంది. తెలంగాణ సాధించుకుంటే రాష్ట్రంలో సామాజిక న్యాయానికి అడుగులు పడతాయని జయశంకర్ నాడు తాను ముచ్చట్లో చెప్పినట్టుగానే ఈరోజు అడవుల దిశ మొదలైందని మేం భావిస్తున్నాం.
గత పది ఏళ్ల కాలంలో బీసీలకు ఉన్న రిజర్వేషన్లు తగ్గించి టిఆర్ఎస్ సామాజిక న్యాయానికి తూట్లు పొడిచింది అని 32 శాతం రిజర్వేషన్లు 18 శాతానికి తగ్గించి బీసీలకు ప్రాతినిధ్యం లేకుండా చేసింది. ఈ రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం సాహసో పేతమైనది ఈ సాహసోపేత నిర్ణయాన్ని తెలంగాణ జన సమితి అభినందిస్తుంది. ఈ నిర్ణయాన్ని శాస్త్రీయంగా అమలులోకి తీసుకురావాలని తెలంగాణ జన సమితి కోరుతుంది.
బీసీ రిజర్వేషన్లను* *స్వాగతిస్తున్నాం....* గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు ఎం నర్సయ్య
స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లను అమలు చేయాలని రాష్ట్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణ జన సమితి స్వాగతిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె వినయ్ అన్నారు. శుక్రవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు ఎం నర్సయ్యతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పల్లె వినయ్ మాట్లాడుతూ గత టీఆర్ఎస్ ప్రభుత్వం 32 నుంచి 18 శాతానికి రిజర్వేషన్లను తగ్గిస్తే రేవంత్ రెడ్డి సర్కారు ఏకంగా 42 శాతం పెంచడాన్ని హర్శిస్తున్నామని అన్నారు. ఈ రిజర్వేషన్ల అమలు ద్వారా తెలంగాణ ప్రాంతంలో సామాజిక న్యాయం జరుగుతుందని, సామాజిక తెలంగాణ దిశగా కొనసాగడానికి అవకాశం ఉంటుందన్నారు . ఈ రిజర్వేషన్లు అమలు కోసం తెలంగాణ జన సమితి తో పాటు పలు సంఘాలు, బీసీ సంఘాలు అలుపెరగని పోరాటం చేశాయని, ఈ పోరాట ఫలితమే రిజర్వేషన్ల అమలు అని ఆయన పేర్కొన్నారు.
ఈ సమావేశంలో గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి బట్టల రామచందర్ ,రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ధారసత్యం, ఆఫీస్ ఇన్చార్జి హనుమంత్ రెడ్డి, నగర నాయకులు హనుమంతు గౌడ్ ,లక్ష్మణ్, జైపాల్ రెడ్డి ,మాణిక్యం ,సురేష్, సుధాకర్, గోవింద్ ,రాజు, వాసుదేవ్ తదితరులు పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
గాజుల పోచమ్మ ఆలయంలో ఘనంగా గోరింటాకు ఉత్సవాలు

ఓల్డ్ మల్కాజ్‌గిరిలో, సర్దార్ పటేల్ నగర్ లలో సీసీ రోడ్డు ప్యాచ్ పనులు ప్రారంభం: కార్పొరేటర్ శ్రవణ్

జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జనాభా దినోత్సవ వారోత్సవాలు ప్రారంభం

జిల్లా ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని అభినందించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
.jpg)
నెంబర్ ప్లేట్స్ లేని వాహనాలపై ప్రత్యేక డ్రైవ్: 316 వాహనాలు సీజ్: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు లారీలు సీజ్
.jpeg)
ప్రభుత్వ విద్యను బలోపేతం చేద్దాము.. తపస్

స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుపై ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.- తెలంగాణ జన సమితి

హైకోర్టులో కేవియట్ వేసి బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ ఇవ్వాలి - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

మల్లన్నపేట పాఠశాలలో ఆషాఢ మాస గోరింటాకు పండగ

నిరంతర ప్రజాసేవకుడు బండి సంజయ్ కుమార్ పుట్టినరోజు ఘనంగా నిర్వహణ

గౌరెల్లి ప్రాజెక్టు కెనాల్ భూ నిర్వాసితులతో సదస్సు*
