తెలంగాణకు అన్యాయం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి - ఎమ్మెల్సీ కవిత
నిన్నటి డిల్లీ సమావేశంలో ఎజెండాలో మొదటి అంశమే బనకచర్ల.ముఖ్యమంత్రి, మంత్రి ఉత్తమ్ సిగ్గులేకుండా గోదావరి జలాలను చంద్రబాబు చేతిలో పెట్టారు.
బనకచర్లపై చర్చే జరగలేదని రేవంత్ రెడ్డి బుకాయిస్తున్నాడు - తెలంగాణ హక్కులను కాలరాసిన నాన్ సీరియస్ ముఖ్యమంత్రి తన పదవి రాజీనామా చేయాలి.
బనకచర్ల ప్రాజెక్టు కాంట్రాక్టర్లు,
కమీషన్ల కోసమే కడుతున్నారు
- ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత
హైదరాబాద్ జూలై 17:
సీఎం రేవంత్ రెడ్డి బనకచర్లపై బుకాయిస్తున్నారు.సీఎం రేవంత్ రెడ్డికి పాలించే హక్కు లేదు.తక్షణమే సీఎం పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి విలేఖరుల సమావేశంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.
ఈరోజు ఆమె నివాసంలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడిన కవిత, బనకచర్ల వల్ల ఆంధ్రా ప్రజలకు ఏమి లాభం లేదు.కాంట్రాక్టర్లు, కమిషన్ల కోసం బనకచర్ల కడుతున్నారు.ముఖ్యమంత్రి మెగా కంపెనీ వాటా కోసమే డిల్లీకి వెళ్లారనీ ఆరోపించారు.
చంద్రబాబు ఎజెండాలో భాగంగానే సీఎం డిల్లీకి వెళ్ళాడు..బనకచర్ల ఆపకపోతే న్యాయపోరాటం చేస్తాం పార్లమెంట్ సమావేశాలు జరగబోతున్న నేపధ్యంలో ముఖ్యమంత్రి అఖిలపక్షాన్ని డిల్లీకి తీసుకువెళ్లాలనీ కవిత డిమాండ్ చేశారు.
ఇంకా కవిత ఇలా అన్నారు:
తన స్కూల్ బీజేపీ, కాలేజీ టీడీపీ, ఉద్యోగం కాంగ్రెస్ లో అని సీఎం చెప్తుంటారు.ముఖ్యమంత్రి ఇంకా కాలేజ్ లోనే ఉన్నానని అనుకుంటున్నారు. అందుకే గోదావరి నీళ్లను చంద్రబాబు కు గిఫ్టుగా ఇచ్చారు*
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను జనాభా లెక్కలోనుంచి తీసేసా. ఆయన ఎవరో నాకు తెలియదు.సీఎం రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ శాఖామంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చంద్రబాబును ఎదుర్కొని సన్మానం చేశారు
సీఎం రేవంత్ రెడ్డి,ఉత్తమ్ కుమార్ రెడ్డి సిగ్గులేకుండా బనకచర్ల ప్రాజెక్టును చంద్రబాబుకు అప్పనంగా అప్పగించారు.నాలుగు విజయాలు సాధించామని సీఎం రేవంత్ రెడ్డి గొప్పలు చెప్పుకుంటున్నారు
కృష్ణానది బోర్డును అమరావతిలో పెట్టడం అనేది ఏపీ విభజన చట్టంలో ఉంది. తెలంగాణ ప్రజల హక్కులను చంద్రబాబునాయుడు కాళ్ళ దగ్గర తాకట్టుపెట్టారు. బనకచర్ల ప్రాజెక్టు ద్వారా ఏపీ ప్రజలకు ఉపయోగం లేదు.ఏపీలో నీళ్లు రాని ప్రాంతాలకు ప్రాజెక్టులు కట్టి నీళ్లు తీసుకుపోతే నేను స్వాగతిస్తా
బనకచర్ల ప్రాజెక్టు కాంట్రాక్టర్లు,
కమీషన్ల కోసమే కడుతున్నారు
మెగా కంపెనీకి బనకచర్ల ప్రాజెక్టును అప్పగించే కుట్ర జరుగుతోంది. రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుకు సద్ది మోస్తున్నారు.తెలంగాణ జాగృతి తరపున బనకచర్ల ప్రాజెక్టుపై న్యాయ పోరాటం చేస్తాము.
కచ్చితంగా బనకచర్లను
ఆపి తీరుతాము
పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ప్రభుత్వం ఢిల్లీకి అఖిలపక్షం తీసుకువెళ్లి బీసీ బిల్లు,బనకచర్లపై
కేంద్రంతో మాట్లాడాలి.తుపాకులగూడెం నుంచి
నదుల అనుసంధానం జరిగితే తెలంగాణ,ఆంధ్రాకు
న్యాయం జరుగుతుంది
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అచేతనస్థితికి మేము బాధపడుతున్నాం.సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి అఖిలపక్షం తీసుకువెల్లకపోతే మేము జాగృతి తరపున ఢిల్లీకి కలిసివచ్చే వాళ్ళతో ఢిల్లీలో పోరాటం చేస్తాము. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు బనకచర్లపై అసలు చర్చ జరగలేదు
కొప్పుల ఈశ్వర్ స్వయంగా బొగ్గుగని కార్మికుడు వారికి బొగ్గుగని కార్మిక సంఘం భాద్యతలు అప్పగించడాన్ని స్వాగతిస్తున్నా
More News...
<%- node_title %>
<%- node_title %>
సికింద్రాబాద్ కంటోన్మెంట్ కు స్వచ్చ్ సర్వేక్షన్ అవార్డు

వ్యభిచార గృహం పై సి సిఎస్ పోలీసుల దాడి పోలీసుల అదుపులో ఇద్దరు మహిళలు, ఇద్దరు యువకులు, పరారీలో నిర్వాహకురాలు

ఫుడ్ పాయిజన్ తో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించిన మాజీ జడ్పీ చైర్పర్సన్ వసంత

జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్ గురుకుల ఘటనపై ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పందన

మహాత్మా జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం_ పలువురికి అస్వస్థత_ మాతా శిశు కేంద్రానికి తరలింపు_ విద్యార్థుల పరిస్థితి పరిశీలించిన జిల్లా కలెక్టర్

మెట్టుగూడ స్మశాన వాటికలో సమస్యల తిష్ట - కనీస వసతులు కరువు

వెల్గటూర్ మండల బడులలో PRTU సభ్యత్వ నమోదు

రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రజలు భాగస్వాములు కావాలి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

నాగులపేట పేకాట స్థావరంపై CCS పోలీసుల దాడి
2.jpeg)
చిట్టీల పేరిట ఘరానా మోసం..దంపతులకు జైలు శిక్ష - పదేండ్ల తర్వాత కోర్టు తీర్పు..

సిప్ అబాకస్ పోటీల్లో మెరిసిన పద్మారావునగర్ విద్యార్థులు

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు సీనియర్ సిటీజేన్స్ వినతిపత్రం
