ఎస్సీ స్కాలర్షిప్ నిధుల విడుదల కోసం జగిత్యాల ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్యాల వినతి
జగిత్యాల జూలై 30 (ప్రజా మంటలు)
జిల్లా ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్య సంఘం తరఫున ఎస్సీ విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ నిధుల విడుదల కోసం జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి రాజ్ కుమార్ ని కలసి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా యాజమాన్య సంఘ ప్రతినిధులు మాట్లాడుతూ2024 - 25 విద్యా సంవత్సరం నుంచి ఎస్సీ విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ మొత్తాలను ప్రభుత్వం నేరుగా విద్యార్థుల ఖాతాలోకి జమ చేస్తుందని, ఈ మొత్తాలలో 60% నిధులను కేంద్ర ప్రభుత్వం ఇస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం కేవలం 40 శాతం నిధులను మంజూరు చేస్తే విద్యార్థుల స్కాలర్షిప్ బకాయిలు పూర్తి అయిపోతాయన్నారు.
. కానీ రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయి పై చదువులకు వెళ్లలేక పోతున్నారని కావున ప్రభుత్వం దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్లి నిధులు విడుదల చేయించాలని సంక్షేమ శాఖ అధికారిని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా డిగ్రీ కళాశాలల యాజమాన్య సంఘం ప్రతినిధులు జగిత్యాల నుండి శ్రీపాద నరేష్, ముసిపట్ల రాజేందర్, కొక్కుల రాజేందర్,కోరుట్ల నుండి పోతని ప్రవీణ్ కుమార్, మెట్టుపల్లి నుండి ప్రకాష్, ధర్మపురి నుండి మూర్తి తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఆషాడ జాతర ఉజ్జయిని టెంపుల్ హుండీల లెక్కింపు

పుప్పాల గూడ భూములపై విచారణకు లోకాయుక్త ఆదేశం

రోడ్డు ప్రమాద బాధితుడికి 1.52 లక్షలు సాయం.

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి ఆరోగ్య కేంద్రాలలో అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలి జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

కొడంగల్ - నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు భూనిర్వాసితులతో ఎమ్మెల్సీ కవిత

పదవీ విరమణ పొందిన పోలీస్ అధికారుల సేవలు స్ఫూర్తివంతం. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

పట్టదారుల వివరాలను పారదర్శకంగా ఎంక్వయిరీ చేయాలి.. రాష్ట్ర సిసిఎల్ఎ..కమిషనర్ లోకేష్ కుమార్ సర్వే సెటిల్మెంట్ కమిషనర్ రాజీవ్ గాంధీ హనుమంతు

సృష్టి కేసులో ఐదు రోజుల కస్టడీకి డాక్టర్ నమ్రత

న్యూ ఢిల్లీలో లండన్ వెళ్లాల్సిన విమానం నిలిపివేత - ఆందోళనలో ప్రయాణికులు

పలు గ్రామాలకు నూతన ఆర్టీసీ బస్సును ప్రారంభించిన మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్

అర్హులైన పేద ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి -: మంత్రి లక్ష్మణ్ కుమార్

జర్నలిస్టు సంఘ నాయకులను సన్మానించిన ఐఎంఏ వైద్యులు
