బహుముఖ ప్రజ్ఞాశాలి, వ్యక్తిత్వ వికాసానికి మార్గదర్శి పట్టాభిరామ్

On
బహుముఖ ప్రజ్ఞాశాలి, వ్యక్తిత్వ వికాసానికి మార్గదర్శి పట్టాభిరామ్

వ్యక్తిత్వ వికాసానికి వెలుగునివ్విన బి.వి. పట్టాభిరామ్ మృతి 

 (రామ కిష్టయ్య సంగన భట్ల, 
సీనియర్ ఇండిపెండెంట్ జర్నలిస్టు, కాలమిస్టు ...9440595494)

ప్రముఖ ఇంద్రజాలికుడు, వ్యక్తిత్వ వికాస నిపుణుడు బి వి పట్టాభిరామ్ మంగళ వారం గుండె పోటుతో మృతి చెందడంతో ఒక గొప్ప అపూర్వ అపురూప కళాకారుడిని తెలుగు కళామతల్లి కోల్పోయింది.

బి.వి. పట్టాభిరామ్ (భావరాజు వేంకట పట్టాభిరామ్) తెలుగు ప్రజలకు సుపరిచితమైన మానసిక విజ్ఞాన ప్రసారకుడు. వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా, హిప్నాటిస్టుగా, రచయితగా, ఇంద్రజాలికుడిగా, ప్రసంగకర్తగా, సమకాలీన మానవ మనస్సు రహస్యాలను అన్వేషించిన అభ్యుదయవేత్తగా భారతదేశం మొత్తంలో పేరుగాంచారు. ఆయన అంతఃప్రయాణం వేలాది మందికి వెలుగునివ్వగా, బాహ్య ప్రపంచంలో అనేక రంగాల్లో తనదైన ముద్ర వేసిన ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి.

తూర్పుగోదావరి జిల్లాకు చెందిన రావ్ సాహెబ్ భావరాజు సత్యనారాయణ, లక్ష్మీకాంతమ్మ దంపతులకు పుట్టిన పట్టాభిరామ్ 15 మంది సంతానంలో ఒకరు. బాల్యంలోనే జ్ఞాపకశక్తి, విశ్లేషణా బలంతో గరిష్ట స్థాయికి ఎదిగే వాడని గురువులు గుర్తించారు. కాకినాడలో ఉన్నత విద్య చదువుతూ, ఇంద్రజాల కళపై ఆకర్షితుడయ్యారు. అప్పుడు ప్రముఖ మాంత్రికుడు ఎంబేర్ రావు వద్ద శిక్షణ తీసుకుని మాయాజాలం నేర్చుకున్నారు.

విద్యాభ్యాసంలో ఆయన బహుశాఖా ప్రతిభ స్పష్టంగా కనిపించింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి సైకాలజీ, ఫిలాసఫీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో పీహెచ్‌డీ, ఇతర పలు రంగాల్లో కూడా స్నాతకోత్తర విద్యను అభ్యసించారు. హిప్నోథెరపీ, యోగా, కౌన్సిలింగ్, జర్నలిజం వంటి విభిన్న రంగాల్లో పీహెచ్‌డీలు, డిప్లొమాలను పూర్తి చేసి, అవి అన్ని సమాజ సేవకు వినియోగించారు.

పట్టాభిరామ్ తన జీవితం మొత్తాన్ని వ్యక్తిత్వ వికాసానికి అంకితం చేశారు. విద్యార్థులు, యువత, ఉద్యోగార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వంటి అనేక వర్గాలకు ప్రత్యేక శిక్షణా తరగతులు, అవగాహనా సదస్సులను నిర్వహించారు. ఆయన మాటల్లో మంత్రసక్తి ఉంది. "మనస్సుని గెలిచేవాడే జీవితాన్ని గెలవగలడు" అన్న ఆయన సందేశం జనసామాన్యంలో విస్తరించింది.

ఆకాశవాణి, దూరదర్శన్, వివిధ టీవీ చానెల్లు, వర్క్‌షాపులు, శిక్షణా శిబిరాల ద్వారా ఆయన సందేశం లక్షల మందికి చేరింది. హిప్నాటిజం పట్ల ఉన్న అపోహలను తొలగించి, దీనిని ఒక మానసిక చికిత్సా పద్ధతిగా ప్రజలకు అందించారు. "సంస్కార హిప్నోథెరపీ" అనే రూపంలో భావోద్వేగ శుద్ధిని సాధించే మార్గాలను పరిచయం చేశారు. ఆయన హిప్నోథెరపీ ప్రదర్శనలను చూసినవారికి అది మంత్రిక విద్య కాదు, మనోవైద్య విధానమని స్పష్టమైంది.

వైద్య రంగంలో కూడా ఆయన సేవలు విశేషం. క్యాన్సర్, ఫోబియా, డిప్రెషన్, నిద్రలేమి వంటి అనేక సమస్యలకు హిప్నోథెరపీ ద్వారా పరిష్కారాలు సూచిస్తూ డాక్టర్లతో కలిసి పనిచేశారు. ఆయుర్వేద, యోగా, మానసిక చికిత్సల సమన్వయంతో ప్రత్యేక మోడల్‌ను అభివృద్ధి చేశారు.

రచయితగా ఆయన రచనలు లక్షలాది పాఠకుల జీవితాల్లో మార్పు తీసుకు వచ్చాయి. “విజయం నీ చేతుల్లోనే”, “ఆత్మ విశ్వాసమే ఆయుధం”, “ఆలోచనలే ఆయుధాలు”, “జీవిత వికాస మార్గం”, “మీరు విజేతలు కావచ్చు”, “సమర్థమైన చదువు ఎలా చదవాలి?”, “Exam fear ని ఎలా జయించాలి?” వంటి పుస్తకాలు ప్రత్యేకంగా గుర్తించ దగినవి. ఈ రచనలు తెలుగుతో పాటు ఇంగ్లీషు, తమిళం, కన్నడ భాషల్లోనూ వెలువడ్డాయి.

1990లలో ఆంధ్రప్రభ సచిత్రవార పత్రికలో "బాలలకు బంగారుబాట" శీర్షికతో బాలల అభ్యుదయానికి రచనలు చేశారు. "బాలజ్యోతి" పత్రికలో "మాయావిజ్ఞానం" పేరిట ఇంద్రజాలంలోని శాస్త్రీయ కోణాన్ని తెలియజేశారు.

పట్టాభిరామ్ అంతర్జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు పొందారు. అమెరికా, ఆస్ట్రేలియా, మలేషియా, సింగపూర్, అరబ్ దేశాల్లో వర్క్‌షాపులు నిర్వహించి భారతీయ సైకాలజీ విజ్ఞానాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. విద్యార్థులకు, టీచర్లకు, మేనేజర్లకు, వైద్యులకు – వర్గం లేకుండా ప్రతి ఒక్కరికి జీవితానుభవాలతో మేళవించిన ఆత్మవిశ్వాసాన్ని అందించారు.

సినిమా రంగంలో కూడా ఆయన ఆకస్మికంగా కనిపించినా, నటుడిగా తక్కువ సన్నివేశాల్లో తన అభినయ ప్రతిభను చూపించారు. ఇంద్రజాలికుడిగా, హిప్నాటిస్టుగా, రచయితగా, ప్రసంగకర్తగా, పత్రికా వ్యాసకర్తగా, ఆయన విస్తరణ అర్థం చేసుకోవడానికే సమయం కావాలి.

పట్టాభిరామ్ జీవిత భాగస్వామి జయ, తన భర్తతో కలిసి వ్యక్తిత్వ వికాస కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. కుమారుడు ప్రశాంత్ తన తండ్రి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాల్లో ఉన్నాడు.

 హైదరాబాద్‌లో గుండెపోటుతో బి.వి. పట్టాభిరామ్ మృతి చెందారు. ఆయన మరణం సైకాలజీ, వ్యక్తిత్వ వికాస రంగాలకు తీరని లోటుగా నిలిచింది. అయినా ఆయన ప్రవేశపెట్టిన భావాల విత్తనాలు మనసుల్లో మొలకెత్తుతూనే ఉన్నాయి.

బి.వి. పట్టాభిరామ్ పేరు మానవ మానసిక వికాస చరిత్రలో చిరస్థాయిగా నిలవనిది. మన జీవితాల్లో ఒత్తిడి, అనిశ్చితి, గందరగోళం మధ్య ఆలోచనలే ఆయుధాలు అన్న ఆయన పాఠం జీవన మార్గదర్శకంగా నిలుస్తుంది. తన వ్యక్తిత్వంలో జ్ఞానాన్ని, హాస్యాన్ని, శాంతాన్ని మేళవించిన ఈ మేధావి పేరు, పుస్తకాలు, ప్రసంగాలు – తరతరాల పాఠశాలలపై తన ప్రభావాన్ని కొనసాగిస్తూనే ఉంటాయి.

Tags

More News...

Local News 

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి మంత్రి అడ్లూరి లక్ష్మణ్,మాజీ మంత్రి జీవన్ రెడ్డి

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి మంత్రి అడ్లూరి లక్ష్మణ్,మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇందిరా భవన్ లో ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి ఉత్సవాలు జగిత్యాల ఆగస్ట్ 20 ( ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా కేంద్రంలో ఇందిరా భవన్ లో రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి, తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ వికలాంగుల శాఖ మంత్రి వర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు...
Read More...
Filmi News  State News 

వచ్చే ఎన్నికల్లో పోటీచేస్తా - నటుడు సుమన్

వచ్చే ఎన్నికల్లో పోటీచేస్తా - నటుడు సుమన్ ఎందరో నటులు సినీరంగం నుండి రాజకీయాల్లోకి - అదేబాటలు సుమన్ విజయవాడ ఆగస్టు 20: 2029 లో సుమన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి పోటీ పోటీచేస్తానని ప్రకటించారు.ఇక తాజాగా సినీ హీరో సుమన్ ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో స్వతంత్ర సమరయోధులు సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ఆవిష్కరణకు హాజరయ్యారు. ఈ సభలో మాట్లాడిన సుమన్ తన...
Read More...
National  State News 

ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి చిన్నారెడ్డి సంపూర్ణ మద్దతు

ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి చిన్నారెడ్డి సంపూర్ణ మద్దతు సుదర్శన్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని స్వాగతించిన చిన్నారెడ్డి గారు హైదరాబాద్ ఆగస్ట్ 20 (ప్రజా మంటలు): భారత దేశ ఉప రాష్ట్రపతి ఇండియా కూటమి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి పేరును ప్రకటించడం పట్ల రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.  ప్రస్తుతం దేశంలో...
Read More...
Local News  Spiritual  

రేపటి నుండి శ్రీ లోక మాత పోచమ్మ తల్లి దేవాలయ 63వ వార్షికోత్సవాలు

రేపటి నుండి శ్రీ లోక మాత పోచమ్మ తల్లి దేవాలయ 63వ వార్షికోత్సవాలు జగిత్యాల ఆగస్ట్ 19 (ప్రజా మంటలు)): శ్రీ లోక మాత పోచమ్మ తల్లి దేవాలయ 63వ వార్షికోత్సవ ఉత్సవ ప్రచార రథాన్ని డీఎస్పీ దుర్శెట్టి రఘు చందర్ ప్రారంభించారు. అమ్మవారి ఉత్సవాలు తేదీ:20-08-2025 బుధవారం  నుండి 23-08-2025 శనివారం  వరకు జరుగురాయని ఆలయ కమిటీ ప్రకటించింది. డీఎస్పీ దుర్శెట్టి రఘు చందర్  అమ్మవారుకు ప్రత్యేక పూజలు...
Read More...
National  State News 

ముంబై మోనో రైలు ప్రమాదంలో 400 మంది సురక్షితం

ముంబై మోనో రైలు ప్రమాదంలో 400 మంది సురక్షితం ముంబై ఆగస్టు 19: ముంబైలోని మోనోరైలులో చిక్కుకున్న ప్రయాణికులందరినీ సురక్షితంగా రక్షించారు. ముంబైలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రైలు సర్వీసులు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఈ పరిస్థితిలో, ఈ సాయంత్రం (ఆగస్టు 19) భారీ వర్షాల మధ్య నడుస్తున్న మోనోరైలు ముంబైలోని మైసూర్ కాలనీ స్టేషన్ సమీపంలో కదులుతుండగా అకస్మాత్తుగా మధ్యలో ఆగిపోయింది....
Read More...
State News 

వాంకిడి ఘటనపై తెలంగాణ ప్రభుత్వానికి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు

వాంకిడి ఘటనపై తెలంగాణ ప్రభుత్వానికి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు సికింద్రాబాద్, ఆగస్ట్ 19 (ప్రజామంటలు) : తెలంగాణ ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు ఇచ్చింది.- వాంకిడి ప్రభుత్వ ఆశ్రమ పాఠశాల విద్యార్థిని శైలజ కలుషిత ఆహరం తిని 22 రోజులు మృత్యువు తో పోరాడి గత ఏడాది నవంబర్ 25 న మృతి చెందిన విషయం విదితమే. ఈ ఘటనలో-  సుమారు 60...
Read More...
Local News 

కాంగ్రెస్ కుట్రలను తిప్పికొట్టాలి - బిజెపి నాయకురాలు ఎం. రాజేశ్వరి

కాంగ్రెస్ కుట్రలను తిప్పికొట్టాలి - బిజెపి నాయకురాలు ఎం. రాజేశ్వరి అంబేడ్కర్ ను రాజ్యాంగాన్ని అవమానించింది కాంగ్రెస్సే .. సికింద్రాబాద్,  ఆగస్టు 19 (ప్రజా మంటలు):  రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్ర జరుగుతుందని దాన్ని అంబేడ్కర్ వాదులు తిప్పికొట్టాలని కాంగ్రెస్ నాయకులు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టి అంబేద్కర్ గారిని  రాజ్యాంగాన్ని అవమానించిన కాంగ్రెస్ పార్టీ విధానాన్ని ప్రజలకు వివరించి కాంగ్రెస్ పార్టీ గతంలో చేసిన ప్రస్తుతం చేస్తున్న...
Read More...
Local News  State News 

వైద్యుల సమస్యల్ని పరిష్కరించాలని మంత్రి కి టీజీజీడీఏ నేతల వినతి

వైద్యుల సమస్యల్ని పరిష్కరించాలని మంత్రి కి టీజీజీడీఏ నేతల వినతి సికింద్రాబాద్, ఆగస్ట్ 19 (ప్రజామంటలు) : ప్రభుత్వ వైద్యుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం గాంధీ ఆసుపత్రిలో రాష్ర్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ కు తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం గాంధీ యూనిట్ నేతలు వినతి పత్రం సమర్పించారు. కెరీర్ అడ్వాన్స్మెంట్, టైం బౌండ్ ప్రమోషన్స్ అమలు చేయాలని, వైద్యులకు ట్రాన్స్...
Read More...

గాంధీ ఆసుపత్రి కి  స్పెషల్ ఆఫీసర్ ను నియమిస్తాం...వైద్య ఆరోగ్య శాఖ మంత్రి

గాంధీ ఆసుపత్రి కి  స్పెషల్ ఆఫీసర్ ను నియమిస్తాం...వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఓపీ విభాగాల్లో పర్యటించిన మంత్రి    వైద్యాధికారులతో కలసి రివ్యూ మీటింగ్ సికింద్రాబాద్, ఆగస్ట్ 19 (ప్రజామంటలు) : రాష్ర్టంలోనే పెద్ద ఆసుపత్రిగా పేరుగాంచిన గాంధీ ఆసుపత్రిలో ఎప్పటి కప్పుడు సమస్యల పరిష్కారానికి, అడ్మినిస్ర్టేషన్ లో లోపాలు లేకుండా ఓ స్పెషల్ ఆఫీసర్ ను నియమించాలనే ఆలోచన ఉన్నట్లు రాష్ర్ట వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర...
Read More...
Local News  Crime 

ఆత్మకూరు గ్రామంలో గ్రామ సభ లో ఇసుక రవాణాపై అవగాహన

ఆత్మకూరు గ్రామంలో గ్రామ సభ లో  ఇసుక రవాణాపై అవగాహన కుల దూషణ ఘటనపై కేసు నమోదు    మెట్‌పల్లి ఆగస్టు 19( ప్రజా మంటలు దగ్గుల అశోక్):  జగిత్యాల జిల్లా కలెక్టర్ అనుమతితో కథలాపూర్ మండలంలో నిర్మిస్తున్న సూరమ్మ ప్రాజెక్టు కోసం ఆత్మకూర్ గ్రామ వాగు నుండి ఇసుకను తరలించడానికి అనుమతి ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వ అనుమతి ఉన్న ఇసుక రవాణాను ఎవరైనా అడ్డుకుంటే వారిపై...
Read More...
Filmi News  State News 

ఆగస్ట్ 20 నుండి OTT లో "హరిహర వీరమల్లు"

ఆగస్ట్ 20 నుండి OTT లో హైదరాబాద్ ఆగస్ట్ 19: : పవన్కల్యాణ్ కథానాయకుడిగా రూపొందిన హిస్టారికల్ యాక్షన్ చిత్రం హరిహర వీరమల్లు.ఈ చిత్రానికి జ్యోతికృష్ణ, క్రిష్ దర్శకత్వం వహించారు. ఏఎం రత్నం నిర్మించారు. జులై 24న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ మూవీ పవన్ అభిమానులను ఆకట్టుకుంది. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది.  ఇప్పుడు ఈ చిత్రం,ఓటీటీ వేదిక...
Read More...
Local News  State News 

రోళ్ల వాగు ప్రాజెక్టు కు షెట్టర్ బిగచకపోవడంతో నీరు వృధాగా పోతుంది - ఎమ్మెల్సీ ఎల్ రమణ

రోళ్ల వాగు ప్రాజెక్టు కు షెట్టర్ బిగచకపోవడంతో నీరు వృధాగా పోతుంది - ఎమ్మెల్సీ ఎల్ రమణ జగిత్యాల ఆగస్ట్ 19 (ప్రజా మంటలు): గత ప్రభుత్వ హయంలోనే 90% పూర్తయిన రోల్లవాగు ప్రాజెక్ట్ కు ఇంతవరకు షట్టర్లు అమర్చకపోవడంతో వర్షపు నీరంతా గోదారి పాలౌతుందని, రైతుల పంటలకు నీరందించలేక పోతుందని MLC ఎల్ .రమణ విమర్శించారు. గతంలో మాజీ మంత్రి కొప్పులఈశ్వర్, బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు, జెడ్పీ...
Read More...