వినియోగదారుల సమస్యల సత్వర పరిష్కారానికి సీజీఆర్ఎఫ్ లోకల్ కోర్టులు
మెట్పల్లి జూన్ 11 (ప్రజా మంటలు)
అపరిష్కృతంగా మిగిలిపోయిన విద్యుత్ సంబంధిత సమస్యలు తక్షణమే పరిష్కరించడానికి లోకల్ కోర్టులు నిర్వహిస్తున్నామని, అందుకు విద్యుత్ అధికారులు, సిబ్బంది మెరుగైన సేవలు అందించాలని సీజీఆర్ఎఫ్-2, నిజామాబాద్ చైర్ పర్సన్ ఎరుకల నారాయణ పిలుపునిచ్చారు.
విద్యుత్ వినియోగదారుల సమస్యలకు సంబంధించి ఏర్పాటు చేసిన పరిష్కార వేదిక-లోకల్ కోర్టు ఫోరమ్ చైర్ పర్సన్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో అధికారులు వినియోగారుల సమస్యను లోతుగా పరిశీలించి వెనువెంటనే పరిష్కరించి న్యాయం చేయాలని, ఉపేక్షిస్తే, అలసత్వం ప్రదర్శించిన ఉద్యోగులపై కఠినమైన చర్యలుంటాయని హెచ్చరించారు.
వినియోగదారుల పట్ల జవాబుదారీ తనంతో ఉండాలని, అన్ని విధ్యుత్ కార్యాలయాల ముందర పౌర సేవా పత్రం అతికించాలని, ఇంజనీర్లు, సిబ్బంది చరవాణి నంబర్లను గోడలపై రాయించాలని ఆదేశించారు.
రైతులు, వినియోగారులు విద్యుత్ ఆదా కొరకు తమ వ్యవసాయ పంపుసెట్లకు కెపాసిటర్లు బిగించుకోవాలని, ప్రమాదాలపట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
లోకల్ కోర్టు లో ఒక్క పిర్యాదు కూడా నమోదు కాలేదని, భవిష్యత్తులో సిజిఆర్ఎఫ్ లోకల్ కోర్టు ల గురించి వినియోగదారుల్లో విస్తృత ప్రచారం కల్పించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో సిజిఆర్ఎఫ్ మెంబర్ టెక్నికల్ రామకృష్ణ, మెంబర్ ఫైనాన్స్ కిషన్, జగిత్యాల ఎస్ఈ షాలియా నాయక్, మెటుపల్లి డిఈ గంగారాం, ఏడీఈ లు మనోహర్, రఘుపతి, ఏఈలు రవి, ప్రదీప్, శివకుమార్, శ్రీనివాస్, అజయ్, మెటుపల్లి సబ్ డివిజన్ పరిధిలోని మూడు సెక్షన్ల వినియోగదారులు, రైతులు హాజరైనారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఆషాడ జాతర ఉజ్జయిని టెంపుల్ హుండీల లెక్కింపు

పుప్పాల గూడ భూములపై విచారణకు లోకాయుక్త ఆదేశం

రోడ్డు ప్రమాద బాధితుడికి 1.52 లక్షలు సాయం.

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి ఆరోగ్య కేంద్రాలలో అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలి జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

కొడంగల్ - నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు భూనిర్వాసితులతో ఎమ్మెల్సీ కవిత

పదవీ విరమణ పొందిన పోలీస్ అధికారుల సేవలు స్ఫూర్తివంతం. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

పట్టదారుల వివరాలను పారదర్శకంగా ఎంక్వయిరీ చేయాలి.. రాష్ట్ర సిసిఎల్ఎ..కమిషనర్ లోకేష్ కుమార్ సర్వే సెటిల్మెంట్ కమిషనర్ రాజీవ్ గాంధీ హనుమంతు

సృష్టి కేసులో ఐదు రోజుల కస్టడీకి డాక్టర్ నమ్రత

న్యూ ఢిల్లీలో లండన్ వెళ్లాల్సిన విమానం నిలిపివేత - ఆందోళనలో ప్రయాణికులు

పలు గ్రామాలకు నూతన ఆర్టీసీ బస్సును ప్రారంభించిన మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్

అర్హులైన పేద ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి -: మంత్రి లక్ష్మణ్ కుమార్

జర్నలిస్టు సంఘ నాయకులను సన్మానించిన ఐఎంఏ వైద్యులు
