మంత్రి గా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం జగిత్యాలకు వచ్చిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు కాంగ్రెస్ శ్రేణులచే ఘన స్వాగతం
జగిత్యాల జూన్ 11 ( ప్రజా మంటలు)
తెలంగాణ రాష్ట్ర కేబినెట్ మంత్రివర్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మొట్టమొదటిసారిగా జగిత్యాలకు వచ్చిన అడ్లూరీ లక్ష్మణ్ కుమార్ కి మాజీ మంత్రివర్యులు తాటిపర్తి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు భారీగా ఘన స్వాగతం పలికాయి.
ఈ సందర్భంగా జిల్లాలోని నలుమూలల నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు.
జగిత్యాల పట్టణంలో కాంగ్రెస్ పార్టీ జెండాల ఏర్పాటు తో పండుగ వాతావరణం నెలకొంది.
బైక్ ర్యాలీ
స్థానిక ఇందిరా భవన్ నుండీ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు జెండాలు పట్టుకొని బైక్ ర్యాలీ నిర్వహిస్తూ రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ కు ఘన స్వాగతం పలికారు. బైక్ ర్యాలీతో పట్టణంలోని టౌన్ హాల్ వరకు ర్యాలీ నిర్వహించారు.
కార్యకర్తలు టపాసులు పేల్చి, సంబురాలు నిర్వహించారు.
డీజె పాటలు. కార్యకర్తల నినాదాలు. వందలాది బైక్ లతో భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి ఆడ్లూరీ లక్ష్మణ్ కుమార్ రాజీవ్ గాంధీ విగ్రహానికి, పాత బస్టాండ్ లోని ఇంద్రమ్మ విగ్రహానికి ,తహశీల్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఓపెన్ టాప్ జీప్ లో జీవన్ రెడ్డి, జువ్వాడి నర్సింగ్ రావుపాటు కాంగ్రెస్ నాయకులతో కలిసి, ప్రజలకు అభివాదం చేస్తూ, ర్యాలీ లో పాల్గొన్నారు.
అనంతరం టౌన్ హాల్ లో మాజీ మంత్రి వర్యులు తాటిపర్తి జీవన్ రెడ్డి ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి వందలాది మంది తరలివచ్చి, లక్ష్మణ కుమార్ ను శాలువాలతో సన్మానించారు.
మొదటి సరిగా జగిత్యాలకు వచ్చిన కేబినెట్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను సన్మానించేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పోటీ పడ్డారు.
పదేళ్ల నుండి పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు ఇవ్వాలని నాయకులు కోరారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి మాట్లాడుతూ..
కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా లక్ష్మణ్ కుమార్ సమర్ధవంతముగా పని చేశారని, మంత్రిగా రాష్ట్ర ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలు అందిస్తారని అన్నారు.
సామాజిక న్యాయం పాటించడంలో
దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తోందన్నారు.
42 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తీర్మానం చేసిందని గుర్తు చేశారు.
రిజర్వేషన్ ఫలాలు అందరికీ అందించాలని అన్నారు.
ఏ రాజకీయ పార్టీ అయినా కార్యకర్తల మనోభావాలు గౌరవించాలని కోరారు.
కాంగ్రెస్ క్రమ శిక్షణ గల కార్యకర్తగా అంచెలంచెలుగా ఎదిగిన లక్ష్మణ్ కుమార్ కార్యకర్తలకు ఆదర్శం అన్నారు.
రాబోయే స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కృషి చేస్తామన్నారు.
రాష్ట్ర కేబినెట్ మంత్రి వర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ..
అందరి కృషి ఆశీర్వాదం తో మంత్రి పదవి దక్కిందన్నారు.
పనిలో నిజాయితీ గా ఉండాలి..పార్టీ కోసం పనిచేయాలి.
రాహుల్ గాంధీ ఆలోచన విధానం తో సీఎం రేవంత్ రెడ్డి బీసీ కులగణన చేసి, 42 శాతం రిజర్వేషన్ కల్పనకు కృషి చేస్తున్నారు.
కష్టాల్లో తోడుగా నిలిచిన జీవన్ రెడ్డి సహకారం తో ముందుకు సాగుతానని,జీవన్ రెడ్డి కి అండగా నిలుస్తామని అన్నారు.
ధర్మపురి, జగిత్యాల, వేములవాడ, కోరుట్ల, చొప్పదండి నియోజక వర్గాల కార్యకర్తలు, నాయకుల సలహాలు తీసుకుంటూ, అందరి సమస్యలు పరిష్కరిస్తారని లక్ష్మణ కుమార్ హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో జువ్వాడి నర్సింగ్ రావు, ఆకుల లింగా రెడ్డి, కరం చాంద్,
బండ శంకర్, షాకీర్, గాజంగి నందయ్య, జున్ను రాజేందర్, తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి, కళ్లేపల్లి దుర్గయ్య, రమేష్ రావు,జలపతి రెడ్డి,
మసర్తి రమేష్, చాంద్ పాషా, కొయ్యడ మహిపాల్, మ్యకల రమేష్, మన్సూర్, నిశాంత్ రెడ్డి, శైలేంద్ర రెడ్డి నేహాల్, భూక్యా సరళ, గోపి మాధవి,ధర రమేష్ బాబు, గోపి రాజిరెడ్డి, బీరం రాజేష్, నల్లా స్వామి రెడ్డి, బో గ సందీప్ పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఆషాడ జాతర ఉజ్జయిని టెంపుల్ హుండీల లెక్కింపు

పుప్పాల గూడ భూములపై విచారణకు లోకాయుక్త ఆదేశం

రోడ్డు ప్రమాద బాధితుడికి 1.52 లక్షలు సాయం.

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి ఆరోగ్య కేంద్రాలలో అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలి జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

కొడంగల్ - నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు భూనిర్వాసితులతో ఎమ్మెల్సీ కవిత

పదవీ విరమణ పొందిన పోలీస్ అధికారుల సేవలు స్ఫూర్తివంతం. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

పట్టదారుల వివరాలను పారదర్శకంగా ఎంక్వయిరీ చేయాలి.. రాష్ట్ర సిసిఎల్ఎ..కమిషనర్ లోకేష్ కుమార్ సర్వే సెటిల్మెంట్ కమిషనర్ రాజీవ్ గాంధీ హనుమంతు

సృష్టి కేసులో ఐదు రోజుల కస్టడీకి డాక్టర్ నమ్రత

న్యూ ఢిల్లీలో లండన్ వెళ్లాల్సిన విమానం నిలిపివేత - ఆందోళనలో ప్రయాణికులు

పలు గ్రామాలకు నూతన ఆర్టీసీ బస్సును ప్రారంభించిన మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్

అర్హులైన పేద ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి -: మంత్రి లక్ష్మణ్ కుమార్

జర్నలిస్టు సంఘ నాయకులను సన్మానించిన ఐఎంఏ వైద్యులు
