కొత్త రేషన్ కార్డులపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటన
కొత్త రేషన్ కార్డులపై
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
కీలక ప్రకటన
హైదరాబాద్ జనవరి 20:
అర్హత గల ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు ఇస్తామని.. ప్రజలు ఎవరూ అపోహలకు గురి కావద్దని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.
జనవరి 26నుంచి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న పథకాలపై మంత్రి జూపల్లి కృష్ణారావు నిజామాబాద్ జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు.
తెలంగాణలో జనవరి 26 నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డుల జారీ మొదలవుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. వ్యవసాయ యోగ్యమైన భూములకు ఎలాంటి షరతులు లేకుండా ఎకరానికి రూ.12 వేలు ఇవ్వబోతున్నట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో భూమిలేని నిరుపేద వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద ఏడాదికి రూ.12 వేలు ఇవ్వనున్నట్లు భట్టి చెప్పారు. ఖమ్మం జిల్లా బనిగండ్లపాడులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఉప ముఖ్యమంత్రి శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు.
గ్రామంలో రూ.1.56 కోట్లతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్మించిన గోదాములను డిప్యూటీ సీఎం ప్రారంభించారు. పలు సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు ఇస్తామని.. ఇంకా ఏ లిస్ట్ తయారు కాలేదని.. ప్రజలు అపోహలు పడవద్దని గ్రామ సభలోనే అర్హులను ఎంపిక చేస్తారని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఆడబిడ్డలను గౌరవించే తెలంగాణలో ఇలాంటి వ్యాఖ్యలేంటి- మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే వాళ్లు రాజకీయాల్లోకి ఎలా వస్తరు?

వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టు యూనియన్ నాయకులకు సన్మానం.

అచ్చుబండ పోచమ్మ తల్లి బోనాల జాతర - ప్రైమ్ ఫైట్స్ ఆధ్వర్యంలో ఘనంగా బోనాల పండుగ
.jpg)
బోనమెత్తిన లష్కర్. - అంగరంగ వైభవంగా ఆషాడ బోనాల వేడుకలు

ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్న పై పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసిన తొలి జెడ్పి చైర్పర్సన్ వసంత

సీనియర్ సినీ నటుడు కోట శ్రీనివాసరావు కు నివాళి

విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూత.
.jpeg)
మాజీ మంత్రి రాజేశం గౌడ్ మనమరాలి జన్మదిన సందర్భంగా వాల్మీకి ఆవాసంలో విద్యార్థులకు విందు భోజనం ఏర్పాటు

బోనాల పండుగ నిర్వహణకు చెక్కుల పంపిణీ

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ నిర్ణయంపై ప్రభుత్వంకు కృతజ్ఞతలు.

హత్య కేసులో నిందితుల అరెస్ట్ - రిమాండ్ కి తరలింపు - సీఐ,రామ్ నరసింహ రెడ్డి

మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి - వేలేరు ఎస్ఐ సురేష్
