రవీంద్ర ప్లే స్కూల్లో ఘనంగా ఆషాడ మాస బోనాల మహోత్సవాలు
జగిత్యాల జూలై 11 ( ప్రజా మంటలు)
పట్టణంలోని సిద్ధార్థ విద్యాసంస్థల ఆధ్వర్యంలో స్థానిక రవీంద్ర ప్లే స్కూల్లో ఘనంగా ఆషాడ మాస బోనాలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా ఈ కార్యక్రమాన్ని ట్రస్స్మా జిల్లా అధ్యక్షులు బి శ్రీధర్ రావు మరియు పాఠశాల చైర్మన్ మంజుల రమాదేవి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు
ఈ కార్యక్రమంలో విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు పాఠశాల నుండి స్థానిక గాజుల పోచమ్మ ఆలయం వరకు పెద్ద సంఖ్యలో ర్యాలీగా వెళ్లి అమ్మవారికి బోనాలు సమర్పించారు.
దీనిలో భాగంగా విద్యార్థులు చేసిన నృత్యాలు పోతరాజు వేషాలు మరియు అమ్మవారి వేషధారణతో ఉన్న చిన్నారులు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలను పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలను ఎల్లవేళలా చేస్తుంటామని పాఠశాల నిర్వాహకులు సుమన్ రావు తెలియజేశారు
ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ మంజుల రమాదేవి మరియు పాఠశాల డైరెక్టర్స్ ట్రస్మా జిల్లా అధ్యక్షులు బి శ్రీధర్ రావు - రజిత, జె. హరిచరణ్ రావు - మౌనిక, బి. హరిచరణ్ రావు, బి. అజిత, జె. రాజు, కె. కిషన్, రవళిలతో పాటు గాజుల పోచమ్మ ఆలయ చైర్మన్ గాజుల రాజేందర్ ఉపాధ్యాయులు పోషకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఎల్కతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్‌గా బొక్కల స్రవంతి

గణేశ్ మండపాల నిర్వాహకులు పోలీస్ వారి సూచనలు పాటించాలి: జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్

జగిత్యాల ప్రెస్ క్లబ్ లో కొనసాగుతున్న నవరాత్రి వేడుకలు

రెడ్ బుల్స్ యూత్ గణేష్ మండపం వద్ద ఘనంగా సహస్ర మోదక హవనం

హరిహరాలయంలో బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా కొనసాగుతున్న వినాయక నవరాత్రి ఉత్సవాలు

కాంగ్రెస్ నేత రవికుమార్ మృతి - పరామర్శించిన బీజేపీ నేత మర్రి

మర్రి శశిధర్ రెడ్డి తో వీఐటీ వర్శిటీ చాన్సలర్ భేటి

కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి పేరు చరిత్రలో శాశ్వతంగా ఉండే నిర్ణయం: రేవంత్ రెడ్డి

పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా కుంకుమ పూజ

అనాజ్ పూర్ లో పేదల భూమిని ప్రభుత్వం లాక్కోవడం అన్యాయం

తండ్రి మరణం.. తల్లి అదృశ్యం... గాంధీలో దైన్యస్థితిలో మూడేండ్ల చిన్నారి

వర్ష కొండ గంగపుత్ర సంఘం లో గణనాథుని సన్నిధిలో అన్న ప్రసాదం
