హైకోర్టులో కేవియట్ వేసి బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ ఇవ్వాలి - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
ఫూలే, అంబేద్కర్ విగ్రహాలకు నివాళులు - జాగృతి బైక్ ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసుల ప్రయత్నం
రిజర్వేషన్ల పెంపు బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపి ఆర్డినెన్స్ ఇవ్వాలి
- ఆర్డినెన్స్ పాస్ చేసేలా బీజేపీ రాష్ట్ర నేతలు చొరవ తీసుకోవాలి
- తాత్కాలికంగా రైల్ రోకో వాయిదా- ఆర్డినెన్స్ జారీలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే ఉద్యమం ఉధృతం చేస్తాం
- తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
హైదరాబాద్ జూలై 11:
బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న చిత్తశుద్ధి రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటే హైకోర్టులో కేవియట్ దాఖలు చేసి ఆర్డినెన్స్ జారీ చేయించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. తెలంగాణ జాగృతి, యునైటెడ్ ఫూలే ఫ్రంట్ నాయకులతో కలిసి శుక్రవారం హైదరాబాద్ లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్ తో తెలంగాణ జాగృతి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమించిందన్నారు. యూపీఎఫ్ తో కలిసి అన్ని కుల సంఘాలను కలుపుకొని రౌండ్ టేబుల్ సమావేశాలు, ఐక్య ఉద్యమాలు చేసి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచామన్నారు. కాంగ్రెస్ పార్టీ వంద రోజుల్లోనే కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేస్తామని హామీ ఇచ్చి తుంగలో తొక్కిందని.. తమ ఉద్యమాలకు దిగివచ్చి రాష్ట్ర శాసనసభ, శాసన మండలిలో రెండు బిల్లులు ప్రవేశ పెట్టిందన్నారు.
అసెంబ్లీ, కౌన్సిల్ పాస్ చేసిన బిల్లుల ఆమోదం కోసం కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఈనెల 17న రైల్ రోకోకు పిలుపునిచ్చామని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేందుకు ఢిల్లీకి వెళ్లి ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్, బీజేపీల వైఖరిని ఎండగట్టామన్నారు. తమ ఒత్తిడికి తలొగ్గే రాష్ట్ర కేబినెట్ బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పిస్తూ చట్ట సవరణ చేసిందన్నారు. ఇది నూటికి నూరుపాళ్లు తెలంగాణ జాగృతి సాధించిన విజయమన్నారు. సవరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపి ఆర్డినెన్స్ జారీ తన మర్యాదను నిలబెట్టుకోవాలన్నారు. వెంటనే ఆమోదం తెలిపేలా రాష్ట్ర బీజేపీ నాయకులు గవర్నర్ పై ఒత్తిడి పెంచాలన్నారు.
కాంగ్రెస్ పార్టీకి బీసీ రిజర్వేషన్ల అమలుపై చిత్తశుద్ధి ఉంటే 18 నెలలు ఎందుకు ఆగారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ తెస్తామన్న ప్రభుత్వ ప్రకటనతో తాము పిలుపునిచ్చిన రైల్ రోకోను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని ప్రకటించారు. గవర్నర్ సవరణ బిల్లుకు ఆమోదం తెలిపి ఆర్డినెన్స్ జారీ చేయకపోతే మళ్లీ ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కేబినెట్ సమావేశంలో స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే ప్రతిపాదన మాత్రమే చేశారని, విద్య, ఉద్యోగాల్లోనూ రిజర్వేషన్లు కల్పించే వరకు ఉద్యమాలు కొనసాగిస్తామన్నారు. రిజర్వేషన్ల పెంపు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపేలా బీజేపీ నేతలు కృషి చేయాలన్నారు. లేనిపక్షంలో కాంగ్రెస్ తో పాటు బీజేపీ నేతలు ప్రజల ముందు దోషులుగా నిలబడాల్సి వస్తుందని హెచ్చరించారు.
బీసీ రిజర్వేషన్ల బిల్లుకు ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కేంద్ర మంత్రి బండి సంజయ్ తీసుకోవాలన్నారు. షెడ్యూల్ 9లో బీసీ రిజర్వేషన్లను చేర్పించి రాజ్యాంగ పరమైన భద్రత కల్పించాలన్నారు. అప్పుడే ఎస్సీ, ఎస్టీల మాదిరిగా బీసీలకు రిజర్వేషన్లు అమలవుతాయన్నారు. బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏమి చేస్తుందా అని వారం రోజుల పాటు ఒక కంట కనిపెడుతామన్నారు. గవర్నర్ ఆర్డినెన్స్ కు ఆమోదం తెలుపుతారని ఆశిస్తున్నానని.. లేనిపక్షంలో మళ్లీ ఉద్యమాలు కొనసాగిస్తామన్నారు. అనేక రాష్ట్రాల్లో గవర్నర్ వ్యవస్థ న్యూట్రల్ గా వ్యవహరించడం లేని విషయం అందరికీ తెలిసిందేనన్నారు. బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ జారీ చేస్తే దానిని ఎవరైనా వ్యతిరేకిస్తే వారి ఇండ్ల ముందు చావు డప్పు కొడుతామని యూపీఎఫ్ కన్వీనర్ బొల్లా శివశంకర్ హెచ్చరించారు. సమావేశంలో తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి, నాయకులు రూప్ సింగ్, వరలక్ష్మీ, లలితా యాదవ్, సంపత్ గౌడ్, కొట్టాల యాదగిరి, నరేందర్ యాదవ్, నరేశ్ తదితరులు పాల్గొన్నారు.
*జాగృతి నాయకులను అడ్డుకునే ప్రయత్నం చేసిన పోలీసులు*
మింట్ కాంపౌండ్ లోని మహాత్మా జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే, ట్యాంక్ బండ్ పై గల డాక్టర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసేందుకు వెళ్తోన్న తెలంగాణ జాగృతి నాయకులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ర్యాలీ అనుమతి లేదని.. ట్యాంక్ బండ్ పైకి వెళ్లొద్దని ఆంక్షలు విధించారు. దీంతో పోలీసులతో జాగృతి నాయకులు వాగద్వానికి దిగారు. రిజర్వేషన్ల పెంపు బీసీల దశాబ్దాల ఆకాంక్ష అని.. రాష్ట్ర కేబినెట్ గతంలో చేసిన చట్టాన్ని సవరిస్తూ తీర్మానం చేసిన నేపథ్యంలో మహనీయులకు నివాళులర్పించే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎమ్మెల్సీ కవిత నివాసం నుంచి ట్యాంక్ బండ్ కు ర్యాలీగా బయల్దేరి వెళ్లారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
గాజుల పోచమ్మ ఆలయంలో ఘనంగా గోరింటాకు ఉత్సవాలు

ఓల్డ్ మల్కాజ్‌గిరిలో, సర్దార్ పటేల్ నగర్ లలో సీసీ రోడ్డు ప్యాచ్ పనులు ప్రారంభం: కార్పొరేటర్ శ్రవణ్

జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జనాభా దినోత్సవ వారోత్సవాలు ప్రారంభం

జిల్లా ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని అభినందించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
.jpg)
నెంబర్ ప్లేట్స్ లేని వాహనాలపై ప్రత్యేక డ్రైవ్: 316 వాహనాలు సీజ్: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు లారీలు సీజ్
.jpeg)
ప్రభుత్వ విద్యను బలోపేతం చేద్దాము.. తపస్

స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుపై ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.- తెలంగాణ జన సమితి

హైకోర్టులో కేవియట్ వేసి బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ ఇవ్వాలి - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

మల్లన్నపేట పాఠశాలలో ఆషాఢ మాస గోరింటాకు పండగ

నిరంతర ప్రజాసేవకుడు బండి సంజయ్ కుమార్ పుట్టినరోజు ఘనంగా నిర్వహణ

గౌరెల్లి ప్రాజెక్టు కెనాల్ భూ నిర్వాసితులతో సదస్సు*
