బోనమెత్తిన లష్కర్. - అంగరంగ వైభవంగా ఆషాడ బోనాల వేడుకలు

On
బోనమెత్తిన లష్కర్. - అంగరంగ వైభవంగా ఆషాడ బోనాల వేడుకలు

- అమ్మవార్లకు పట్టు వస్ర్తాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి
- భక్తులతో కిక్కిరిసిన ఉజ్జయిని మహాకాళి ఆలయ పరిసరాలు - పోలీసుల భారీ బందోబస్తు

సికింద్రాబాద్, జూలై 13 (ప్రజామంటలు):

లష్కర్ లో బోనాల పండుగ ఆదివారం అంగరంగ వైభవంగా సాగింది. ఉదయం నుంచి రాత్రి వరకు వేలాది మంది భక్త జన కోటి ఉజ్జయిని శ్రీమహాకాళి ఆలయానికి పోటెత్తారు. భక్తి ప్రవత్తులతో తమ ఇలవేల్పు ఉజ్జయిని మహాకాళి అమ్మవార్లకు బోనాలు సమర్పించి, తమ మొక్కులను తీర్చుకున్నారు. రాష్ర్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉదయం 11.40 గంటలకు అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు.  ఈసందర్బంగా ఉజ్జయిని అమ్మవార్లకు ప్రభుత్వం తరపున పట్టు వస్ర్తాలను సమర్పించారు.  


ప్రతి ఏటా ఆషాడ మాసంలో మొదటి ఆదివారం జరిగే శ్రీఉజ్జయిని మహాకాళి అమ్మవారి బోనాల జాతర ఆదివారం ఘనంగా జరిగింది. ఉదయం వేకువ జామున నాలుగు గంటలకు అమ్మవారికి అర్చకులు చేసిన తొలి పూజలతో బోనాల జాతర ప్రారంభమైంది. ఉదయం 4 గంటలకు జిల్లా ఇంచార్జీ మంత్రి పొన్నం  ప్రభాకర్ దంపతులు ఆలయాన్ని సందర్శించి, ఆలయ సంప్రదాయనుసారంగా అమ్మవార్లకు బోనాలు సమర్పించి, పూజలు చేశారు.IMG-20250713-WA0009 

ఉదయం నుంచి వివిద ప్రాంతాల నుంచి ఆలయానికి తరలివచ్చిన వేలాది మంది భక్తులు తలపై బోనం ఎత్తుకొని, క్యూలైన్ ద్వారా ఆలయంలోనికి వెళ్ళి, అమ్మవార్లను దర్శించుకొని పూజలు చేశారు. అలాగే సిటీలోని పలు ప్రాంతాల్లోని ఆలయాల నుంచి శివసత్తులు, జోగినిలు తమ బృందంతో భాజభజంత్రీలు, పోతరాజులు, ఒగ్గుడోలు విన్యాసాలతో ఆలయానికి వచ్చి, బోనాలు సమర్పించారు. చాలా మంది భక్తులకు అమ్మవారు పూనడంతో వారు పూనకంతో ఊగిపోయారు. తోటి భక్తులు అమ్మవారి బొట్టు వీరికి పెట్టి, శాంతింప చేసి, త్వరగా అమ్మవారి దర్శనానికి లోనికి తీసుకువెళ్ళారు. ఆయా ఆలయాల నుంచి తొట్టెలను కూడ తీసుకు వచ్చి, అమ్మవార్లకు సమర్పించారు.  
క్యూలైన్ లో చెమటలు కక్కిన మహిళలు:
ఆదివారం వాతావరణం ఎండగా ఉండటంతో ఉక్కబోతతో భక్తులు ఇబ్బంది పడ్డారు. ఆలయానికి వచ్చే క్యూలైన్ లల్లో బోనం ఎత్తుకొని నిల్చున్న మహిళలు చెమట పట్టి అసౌకర్యానికి గురయ్యారు.దర్శనానికి దాదాపు గంట నుంచి గంటన్నర వరకు  సమయం పట్టడంతో మహిళలు ఊసురుమన్నారు.

కాగా ఒక్క బోనం వెంట పోలీసులు ఐదుగురిని మాత్రమే అనుమతించగా, మిగితా వారు ఇతర క్యూలైన్లలో రావాల్సి వచ్చింది. కాగా ఆలయానికి వచ్చిన కొందరు వీఐపీలు అత్యుత్సాహం ప్రదర్శించగా పోలీసులు  వారితో వాగ్వివాదానికి దిగారు.  మీడియా పాయింట్ వద్ద విలేఖరులు కూర్చోనేందుకు కనీసం కుర్చీలు కూడ లేకపోవడంతో గంటల తరబడి వీరు నిలబడాల్సి వచ్చింది. కొందరు పోలీసులు పాసులున్నప్పటికీ కొందరు  మీడియా వారిని లోనికి అనుమతించకపోవడంతో వారు కొంత అసౌకర్యానికి గురయ్యారు.కాగా ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఈ సారి వాటర్ ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్ పెద్ద సంఖ్యలో అందుబాటులో ఉంచడటంతో భక్తులకు తాగు నీటి ఇబ్బందులు కలగలేదు. అడిషనల్ సీపీ విక్రమ్ సింగ్ మాన్ స్వయంగా ఆలయం వద్ద ఉండి పరిస్థితిని సమీక్షించారు. ఎలాంటి తొక్కిసలాట, ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు అధికారులకు ఎప్పటికప్పుడు సూచనలిస్తూ కనిపించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ...బోనాల వేడుకల సందర్బంగా ఆలయ పరిసరాల్లో బందోబస్తు కోసం మొత్తం 2500 మంది పోలీసులను బందోబస్తుకు వినియోగించినట్లు తెలిపారు.

ఆలయ ఆవరణలోని 150 సీసీ కెమెరాలను మహాకాళి పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేసి, రౌండ్ ఏ క్లాక్ పర్యవేక్షించినట్లు తెలిపారు.  అలాగే లంచ్ తర్వాత ర్యాపిడ్ యాక్షన్  ఫోర్స్ సిబ్బంది కూడ బందోబస్తులో పాల్గొన్నారు. భక్తులకు సౌకర్యవంతంగా ఉండేందుకు పలు మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేశారు. 
సాయంత్రం ఫలహార బండ్ల ఊరేగింపు ప్రాంరభమైంది. సిటీలోని పలు ప్రాంతాల్లోని ఆయా ఆలయాల నుంచి సంప్రదాయ బద్దంగా పోట్టెళ్ళతో అమ్మవారి వాహనాన్ని భాజ , భజీంత్రాలతో, పోతరాజుల విన్యాసాలతో ఊరేగింపుగా ఉజ్జయిని ఆలయానికి తీసుకువచ్చారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో...
తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం బన్సీలాల్ పేట్ లోని చారిత్రాక మెట్ల బావి వద్ద నుండి 200 మంది వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఒగ్గు డోలు కళాకారులు, పోతరాజులతో ఆటపాటలతో ఉమ్మడి బోనాలతో భారీ ఊరేగింపు సాగింది. ర్యాలీగా వెళ్ళి శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలను  సమర్పించారు. ఈసందర్బంగా ఒగ్గుడోలు కళాకారులు, పోతరాజులు చేసిన విన్యాసాలు, ప్రదర్శనలు అందరిని ఆకట్టుకున్నాయి. తెలంగాణ సాంస్కృతిక సారథి గద్దర్ వెన్నెల ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీని సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. 


రేపే రంగం (భవిష్యవాణి)


ప్రతి ఏటా మాదిరిగానే ఈ సారి కూడ సోమవారం ఉదయం 9.30 గంటలకు అమ్మవారి ఆలయంలో  రంగం కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్బంగా పచ్చికుండపై నిల్చోని స్వర్ణలత భవిష్య వాణి వినిపిస్తారు.  ఆ తర్వాత అంబారీ ఊరేగింపు ఉంటుంది. జూపార్క్ నుంచి తెప్పించిన ఏనుగుపై అమ్మవారి విగ్రహాన్ని ఉంచి, ప్రధాన ఆలయం నుంచి  ఆలయ సంప్రదాయనుసారంగా ఊరేగింపు ఉంటుంది. సాయంత్రం ఫలహార బండ్ల ఊరేగింపు కన్నులపండువగా కొనసాగనుంది. IMG-20250713-WA0011

Tags

More News...

State News 

ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజహరుద్దీన్ ?

ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజహరుద్దీన్ ? హైదరాబాద్ ఆగస్ట్ 30 (ప్రజా మంటలు): ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, అజారుద్దీన్ పేర్లను ఖరారు చేసింది.గవర్నర్ కోటా ఎమ్మెల్సీల విషయంలో తెలంగాణ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ప్రొ. కోదండరాం, జర్నలిస్ట్ అమీర్ అలీఖాన్ ల నియామకాన్ని ఇటీవల సుప్రీంకోర్టు రద్దు చేసింది.తుది తీర్పు సెప్టెంబర్ 17 న...
Read More...
State News 

కాలేజీలు విద్యార్థుల సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం రాజ్యాంగ హక్కులకు భంగం - తెలంగాణ హెచ్ఆర్సీ 

కాలేజీలు విద్యార్థుల సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం రాజ్యాంగ హక్కులకు భంగం - తెలంగాణ హెచ్ఆర్సీ  హైదరాబాద్‌ ఆగస్ట్ 30 (ప్రజా మంటలు): తెలంగాణ మానవ హక్కుల సంఘం (TGHRC), చైర్మన్ డా. జస్టిస్ షమీమ్ అక్తర్ ఆధ్వర్యంలో, వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్, నల్గొండ విద్యాసంస్థలోని తొమ్మిది మంది బి.ఫార్మసీ విద్యార్థులు దాఖలు చేసిన ఫిర్యాదుపై (HRC No. 4897 of 2025) విచారణ చేపట్టింది. విద్యార్థులు సమర్పించిన ఫిర్యాదులో,...
Read More...
Local News 

సదుపాయాల కోసం మెరుగైన ప్రణాళికలను తయారు చేయాలి  మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్

సదుపాయాల కోసం మెరుగైన ప్రణాళికలను తయారు చేయాలి  మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్   జగిత్యాల ఆగస్టు 29 ( ప్రజా మంటలు)   జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో ప్రెస్ మీట్ నిర్వహించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మరియు గిరిజన సంక్షేమ శాఖ సెక్రెటరీ శ్రీమతి అలగు వర్షిని ప్రెస్ మీట్ లో  పాల్గొన్నారు.   జగిత్యాల జిల్లాలోని గిరిజన గ్రామ పంచాయతీల అభివృద్ధికై మౌళిక సదుపాయాల కల్పనకు ప్రెస్ మీట్నిర్వహించిన...
Read More...
Local News 

సిఎం సహాయ నిధి నిరుపేదల పాలిట వరం...ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్

సిఎం సహాయ నిధి నిరుపేదల పాలిట వరం...ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్    జగిత్యాల ఆగస్ట్ 29 (ప్రజా మంటలు)పట్టణ పొన్నాల గార్డెన్స్ లో జగిత్యాల అర్బన్ మండలం,జగిత్యాల పట్టణానికి చెందిన 64 మంది  లబ్ధిదారులకు సిఎం సహాయ నిధి ద్వారా మంజూరైన 16 లక్షల 82 వేల 200 రూపాయల విలువగల చెక్కులను ,89 మందికి కళ్యాణ లక్ష్మీ షాది ముభారక్ పథకం ద్వారా మంజూరైన 89...
Read More...
National  Current Affairs   State News 

ప్రభుత్వ భూమిలో నిర్మించిన ప్రైవేటు ఆసుపత్రులు పేదలకు సబ్సిడీ ఇవ్వాలి - సుప్రీంకోర్టులో పిటిషన్

ప్రభుత్వ భూమిలో నిర్మించిన ప్రైవేటు ఆసుపత్రులు పేదలకు సబ్సిడీ ఇవ్వాలి - సుప్రీంకోర్టులో పిటిషన్ న్యూ ఢిల్లీ ఆగస్ట్ 29: అనేక రాష్ట్రాల్లో, ఉచిత లేదా సబ్సిడీ చికిత్స బాధ్యతలకు బదులుగా భూమి లేదా ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ (FSI) రాయితీలు మంజూరు చేసిన ప్రైవేట్ ఆసుపత్రులు నిరంతరం వాటిని పాటించడంలో విఫలమయ్యాయని పిటిషన్ హైలైట్ చేసింది. ఢిల్లీలో, అనేక ఆసుపత్రులు తమ పడకలలో మూడింట ఒక వంతును ఉచిత చికిత్స...
Read More...

నిర్లక్ష్యంగా వాహనం నడిపి వ్యక్తి మృతికి కారణమైన ఘటనలో నిందితునికి పది నెలల జైలు శిక్ష

నిర్లక్ష్యంగా వాహనం నడిపి వ్యక్తి మృతికి కారణమైన ఘటనలో నిందితునికి పది నెలల జైలు శిక్ష జగిత్యాల ఆగస్టు 29 ( ప్రజా మంటలు)  నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన రాజుల సాయన్న అనే ఆటో డ్రైవర్ తేది 25-02-2020న మెట్‌పల్లి మండలం మేడిపల్లి గ్రామానికి కిరాయికి వెళ్లి తన ఆటోను రోడ్డు పక్కన పార్క్ చేశాడు. అదే సమయంలో నిజామాబాద్ జిల్లా ముప్కల్ గ్రామానికి చెందిన RTC...
Read More...
Current Affairs   State News 

హే గాంధీ..నిలిచిన నీటి సరఫరా..రోగుల పరేషాన్.

హే గాంధీ..నిలిచిన నీటి సరఫరా..రోగుల పరేషాన్. 24 గంటల పాటు గాంధీలో  నో వాటర్    నిలిచిపోయిన ఆపరేషన్లు..కంపుకొట్టిన వాష్ రూమ్స్    రోగులు, సహాయకులు,నర్సింగ్ సిబ్బంది నరకయాతన సికింద్రాబాద్, ఆగస్ట్ 29 (ప్రజామంటలు) : గాంధీఆస్పత్రి మెయిన్ బిల్డింగ్ లోని ఇన్పేషంట్ల వార్డులు, ఆపరేషన్ థియేటర్లకు  మంచినీటి సరఫరా చేసే పంపింగ్‌ మోటార్లు మొరాయించడంతో దాదాపు 24 గంటల పాటు నీటి సరఫరా నిలిచిపోయి...
Read More...

భార్యను హత్య చేసిన ఘటనలో భర్తకు జీవిత ఖైదు, 2500 రూపాయల జరిమాన. * కీలక తీర్పును వెలువరించిన Principal District & Sessions Judge శ్రీమతి రత్న పద్మావతి  

భార్యను హత్య చేసిన ఘటనలో భర్తకు జీవిత ఖైదు, 2500 రూపాయల జరిమాన.  * కీలక తీర్పును వెలువరించిన Principal District & Sessions Judge శ్రీమతి రత్న పద్మావతి   జగిత్యాల ఆగస్ట్ 29 ( ప్రజా మంటలు)  నేరం చేసిన వారు ఎవరూ శిక్ష నుండి తప్పించుకొలేరు:జిల్లా ఎస్పి  అశోక్ కుమార్     రాయికల్ పట్టణానికి చెందిన అరిపల్లి సత్తయ్య, సుధారాణి భార్యా భర్తలు వీరికి ఇద్దరు కుమారులు. సత్తయ్య ఇంటి వద్ద ఉంటూ  ఏ పని చేయకుండా నిత్యం భార్యను వేధిస్తూ ఉండేవాడు.  ఇదే ఈ...
Read More...
Local News 

మంథని గణేష్ మండపంలో హోమంలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు

మంథని గణేష్ మండపంలో హోమంలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు మంథని ఆగస్ట్ 29 (ప్రజా మంటలు): మంథని లోని రావుల చెరువు కట్ట గణేశ్ మండపంలో గణపతి హోమములో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.   అనంతరం రాష్ట్ర మంత్రివర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుత, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రాష్ట్ర...
Read More...
Local News 

ఆగ్రహించిన వరద గోదావరి - అప్రమత్తమైన తీర జనావళి

ఆగ్రహించిన వరద గోదావరి - అప్రమత్తమైన తీర జనావళి (రామ కిష్టయ్య సంగన భట్ల) ధర్మపురి ఆగస్టు 29:  భారీ వర్షాల కారణంగా,  గోదావరి నది గణనీయంగా పెరిగింది. రెండు రోజులుగా  భారీ వర్షాలు కురుస్తుండడం చేత, నది ఎగువ ప్రాంతాల నుండి నదిలో క్రమేపి వరద నీరు చేరుతున్న కారణంగా గోదావరి నీటిమట్టంలో గంటగంటకూ, మార్పు చోటు చేసుకుంటున్నది. నిర్మల్ జిల్లాలోని కడెం696...
Read More...
International   State News 

బహరేన్ జైలు నుంచి ఐదుగురిని విడిపించండి  సీఎం ప్రవాసీ ప్రజావాణి ని ఆశ్రయించిన బంధువులు

బహరేన్ జైలు నుంచి ఐదుగురిని విడిపించండి  సీఎం ప్రవాసీ ప్రజావాణి ని ఆశ్రయించిన బంధువులు (రామ కిష్టయ్య సంగన భట్ల...9440595494) బహరేన్ లో రెండేళ్ళ జైలుశిక్ష విధించబడిన ఐదుగురు తెలంగాణ కార్మికుల కుటుంబ సభ్యులలో నలుగురి తల్లులు, ఒకరి చెల్లెలు సహాయం కోసం మంగళవారం హైదరాబాద్ లోని 'సీఎం ప్రవాసీ ప్రజావాణి' ని ఆశ్రయించారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి సూచన మేరకు వారు ముఖ్యమంత్రి ఏ....
Read More...
Local News 

ఉస్మానియా వర్శిటీలో దారుణ పరిస్థితులు - ఎన్హెచ్ఆర్సీ లో అడ్వకేట్ రామారావు పిటిషన్

ఉస్మానియా వర్శిటీలో దారుణ పరిస్థితులు - ఎన్హెచ్ఆర్సీ లో అడ్వకేట్ రామారావు పిటిషన్ సికింద్రాబాద్, ఆగస్ట్ 29 (ప్రజామంటలు) : ఉస్మానియా విశ్వవిద్యాలయం లో నెలకొనివున్న దారుణ పరిస్థితులపై ప్రముఖ మానవ హక్కుల అడ్వకేట్ రామారావు ఇమ్మానేని జాతీయ మానవ హక్కుల కమిషన్ లో పిటిషన్ వేశారు. - సాక్షాత్తు ఈఐ హాస్టల్ లో న్యాయశాస్త్రం అభ్యసించే విద్యార్థులకు ప్రాధమిక హక్కులు కొరవడ్డాయన్నారు. - 120 మందికి ఒకే బాత్రూం...
Read More...