ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్న పై పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసిన తొలి జెడ్పి చైర్పర్సన్ వసంత
జగిత్యాల జులై 13 (ప్రజా మంటలు)
తీన్మార్ మల్లన్న ఒక ప్రజాస్వామ్య పదవిలో ఉన్నావు నోరు జాగ్రత్తగా పెట్టుకో
కవితక్క కి ముక్కు నెలకు రాసి క్షమాపణ చెప్పాలి
కల్వకుంట్ల కవితక్క పై అనుచిత వాక్యాలు చేసిన తీన్మార్ మల్లన్న పై చర్యలు తీసుకోవాలని జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్ లో జగిత్యాల నియోజకవర్గం మహిళ నాయకులతో కలిసి ఫిర్యాదు చేసిన జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్
ఈ సందర్భంగా మాట్లాడుతూ.
తెలంగాణలో ఆడబిడ్డని బతుకమ్మల గౌరమ్మల గౌరవిస్తాం, ఆడపిల్లని ఆదిపరాశక్తిగా పూజిస్తూ తల్లిగా చెల్లిగా పూజిస్తూ ఎంతో గౌరవిస్తాం పూజించే సాంప్రదాయం ఉన్న తెలంగాణలో ఆడ బిడ్డ పై నోటికి వచ్చినట్టు అనుచిత వాక్యాలు చేయడం సిగ్గు చేటు అని అన్నారు.
ఒక బీసీ బిడ్డ వి అయి ఉండి బీసీ ల కోసం పోరాడుతున్న కవితక్క పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బీసీ సమాజం నిన్ను క్షమించదు.
బీసీ ల కోసం ఎవరు పోరాడిన స్వాగతించే విధంగా ఉండాలి కానీ ఈ లాంటి వ్యాకాలు చేసి సమాజానికి ఎలాంటి సందేశం ఇవ్వాలి అనుకుంటున్నావు.
బీసీ బిడ్డ బీసీల కోసమే మాట్లాడాలని ఎక్కడ రాసి పెట్టింది రాజ్యాంగంలో లేదు కవితక్క బీసీల పట్ల నిలబడి బీసీల కోసం నిలబడి నిరంతరం కొట్లాడుతూ బహుజన నాయకురాలు కవితక్క
తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క ఆడబిడ్డ తీన్మార్ మల్లన్న నీకేమైనా చీము నెత్తురు రక్తం ఏమైనా ఉంటే బహిరంగ క్షమాపణ చెప్పు ఇంకొక ఆడబిడ్డ జోలికి పోకుండా నీకు తగిన బుద్ధి తెలంగాణ ఆడబిడ్డలు చెప్తారు అని హెచ్చరించారు.
ప్రజాస్వామ్యంలో ఇలాంటి వ్యాఖ్యలకు తావు లేకుండా వెంటనే ప్రభుత్వం, మహిళా కమిషన్ స్పందించి కఠిన చర్యలు తీసుకుని సంస్కృతిని కాపాడాలని అన్నారు. చింత పండు నవీన్ నువ్వు వెంటనే కవితక్క కి క్షమాపణ చెప్పాలన్నారు లేకుంటే మహిళలందరూ కలిసి నీకు చింతపండు చేస్తారని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు మరంపెల్లి రాణి సాయి ఉదయ శ్రీ బి ఆర్ ఎస్ మహిళా నాయకులు అనురాధ,ఎడ్లలక్ష్మి, రజియా నజీమా భాగ్య లక్ష్మీ సునీత మరియు కవితక్క కు అండగా వివిధ గ్రామాల,వర్డ్ మహిళా తల్లులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఆడబిడ్డలను గౌరవించే తెలంగాణలో ఇలాంటి వ్యాఖ్యలేంటి- మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే వాళ్లు రాజకీయాల్లోకి ఎలా వస్తరు?

వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టు యూనియన్ నాయకులకు సన్మానం.

అచ్చుబండ పోచమ్మ తల్లి బోనాల జాతర - ప్రైమ్ ఫైట్స్ ఆధ్వర్యంలో ఘనంగా బోనాల పండుగ
.jpg)
బోనమెత్తిన లష్కర్. - అంగరంగ వైభవంగా ఆషాడ బోనాల వేడుకలు

ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్న పై పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసిన తొలి జెడ్పి చైర్పర్సన్ వసంత

సీనియర్ సినీ నటుడు కోట శ్రీనివాసరావు కు నివాళి

విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూత.
.jpeg)
మాజీ మంత్రి రాజేశం గౌడ్ మనమరాలి జన్మదిన సందర్భంగా వాల్మీకి ఆవాసంలో విద్యార్థులకు విందు భోజనం ఏర్పాటు

బోనాల పండుగ నిర్వహణకు చెక్కుల పంపిణీ

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ నిర్ణయంపై ప్రభుత్వంకు కృతజ్ఞతలు.

హత్య కేసులో నిందితుల అరెస్ట్ - రిమాండ్ కి తరలింపు - సీఐ,రామ్ నరసింహ రెడ్డి

మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి - వేలేరు ఎస్ఐ సురేష్
