హత్య కేసులో నిందితుల అరెస్ట్ - రిమాండ్ కి తరలింపు - సీఐ,రామ్ నరసింహ రెడ్డి
గొల్లపల్లి (ధర్మపురి) జూలై 12 (ప్రజా మంటలు):
ధర్మపురి మండలం ధోనూర్ చెందిన గొల్లెన రవి, గొల్లెన నాగరాజుల కుటుంబాలు గత కొన్ని సంవత్సరాలు నుండి పక్క పక్కన నివసిస్తున్నాయి. రెండు కుటుంబాల మధ్య ఇంటి స్థలం గెట్టు విషయంలో గొడవలు జరుగుతున్నప్పటికీ ఈమధ్య మృతుడు గోల్లెన రవి, కొత్త ఇంటి ఇంటి నిర్మాణం చేపట్టి పిల్లర్లు కూడా వేశాడు.
గొల్లెన నాగరాజు, గొల్లెన రవి చేపడుతున్న ఇల్లు నిర్మాణం తప్పుగా కడుతున్నారని ఖని బండను వదిలిపెట్టి కట్టాలని రెండు మూడుసార్లు హెచ్చరించాడు. అయితే గొల్లెన రవి చెప్పిన వినకుండా ఇంకా ఇంటి నిర్మాణం కొనసాగిస్తున్నాడని మనసులో పెట్టుకొని, ఈ నెల 7న,రాత్రి 8:30 ప్రాంతంలో గొల్లిన రవి, అతని భార్య లక్ష్మి మరియు అతని కొడుకు విష్ణు లు ఇంటి నిర్మాణం కోసం మాట్లాడుకుంటున్న సమయంలో ఇంటి పక్కనే ఉన్న గొల్లెన నాగరాజు, అతని తల్లి అమ్మక్క, తండ్రి బక్కయ్య మాటలు విని ఎలాగైనా గోల్లెన రవిని చంపితే కానీ ఇట్టి సమస్యకి పరిష్కారం దొరకదు అని గొల్లెన రవిని చంపాలని తన ఇంట్లో నుంచి కత్తి తీస్కొని కోపంతో గొల్లెన రవి ఇంటికి వెళ్లి మద్యలో కల్పించుకొని ఇంటి సరిహద్దు గొడవ ఉండగా మీరు ఎట్లా ఇంటి సరిహద్దు పక్క నుంచి పిల్లర్ గుంతలు తవ్వారు అని వారితో గొడవపద్దాడు.
తనతో తెచ్చుకున్న కత్తితో గొల్లెన రవిని కడుపులో పొడిచినాడు మరియు గొల్లెన నాగరాజు కొడుకు విష్ణుని కత్తితో దాడి చేయగా, అతడి చేయి కి కోసుకు పోయింది. చికిత్స కోసం గొల్లెన రవి ని జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు.
దర్యాప్తులో భాగంగా శనివారం నిందితులు గొల్లెన నాగరాజు, గొల్లెన అమ్మక్క, గొల్లెన బక్కయ్యల ను అదుపులోకి తీసుకొని వారి నుంచి హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనపరచుకొని నిందితులను మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచి రిమాండ్ కు తరలించినట్టు ధర్మపురి ఎస్సై ఉదయ్ కుమార్,ఎస్సై—2 రవికుమార్, పోలీస్ సిబ్బంది పులి రవి, రామస్వామి, రమేష్, రమేష్ నాయక్, రణధీర్, ఆరిఫ్, వెంకటయ్య పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
మాజీ మంత్రి రాజేశం గౌడ్ మనమరాలి జన్మదిన సందర్భంగా వాల్మీకి ఆవాసంలో విద్యార్థులకు విందు భోజనం ఏర్పాటు

బోనాల పండుగ నిర్వహణకు చెక్కుల పంపిణీ

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ నిర్ణయంపై ప్రభుత్వంకు కృతజ్ఞతలు.

హత్య కేసులో నిందితుల అరెస్ట్ - రిమాండ్ కి తరలింపు - సీఐ,రామ్ నరసింహ రెడ్డి

మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి - వేలేరు ఎస్ఐ సురేష్

గౌరెల్లి ప్రాజెక్టు కెనాల్ భూ నిర్వాసితులతో సదస్సు

గాజుల పోచమ్మ ఆలయంలో ఘనంగా గోరింటాకు ఉత్సవాలు

ఓల్డ్ మల్కాజ్‌గిరిలో, సర్దార్ పటేల్ నగర్ లలో సీసీ రోడ్డు ప్యాచ్ పనులు ప్రారంభం: కార్పొరేటర్ శ్రవణ్

జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జనాభా దినోత్సవ వారోత్సవాలు ప్రారంభం

జిల్లా ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని అభినందించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
.jpg)
నెంబర్ ప్లేట్స్ లేని వాహనాలపై ప్రత్యేక డ్రైవ్: 316 వాహనాలు సీజ్: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు లారీలు సీజ్
.jpeg)