జెడ్పి కార్యాలయంలో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు

On
జెడ్పి కార్యాలయంలో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).

జగిత్యాల జూన్ 2 (ప్రజా మంటలు) : 

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జగిత్యాల జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ 

ఈ సందర్భంగా జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ మాట్లాడుతూ...  

అరవై ఏళ్ల గోసకు,సబ్బండ వర్గాలు కొట్లాడి,పోట్లాడి మా రాష్ట్రం మాకంటూ...అమరుల త్యాగాలకు ఫలితం రోజు నేడు.

ఉక్కు సంకల్పం,బక్కపలచని కెసిఆర్ పోరాట ఫలితం నేటి తెలంగాణ రాష్ట్రం...

తెలంగాణ ఆచరిస్తుంది..దేశం అనుసరిస్తుంధనేలా...తెచ్చుకున్న తెలంగాణను అభివృద్ధి,సంక్షేమంలో అనతి కాలంలోనే అగ్రస్థానానికి చేర్చిన ఘనత బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కె దక్కుతుందని అన్నారు...

బిఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి ,స్ఫూర్తి అదే సంకల్పం ఇకముందు ఉండాలని తెలంగాణ దేశానికి రోల్ మోడల్ గా కొనసాగాలని ఆకాంక్షిస్తూ ప్రతి ఒక్కరికీ తెలంగాణ దశాబ్ది ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు...

ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ హరిచరణ్ రావు,జెడ్పీటీసీలు ప్రశాంతి,పద్మ మహేష్,మనోహర్ రెడ్డి,భూమయ్య,జెడ్పీ కో ఆప్షన్ సభ్యులు సుభాన్,జెడ్పీ సీఈవో రఘువరణ్, ఈ ఈ పంచాయతీ రాజ్ రెహ్మాన్, డి ఈ మిలింద్ జిల్లా పరిషత్ మరియు పంచాయతీ రాజ్ సిబ్బంది ఉన్నారు.

Tags