45 శాఖలతో అభివృద్ధి పథంలో గాయత్రి బ్యాంక్ - అధ్యక్షులు ముత్యాల లక్ష్మణ్ రెడ్డి
45 శాఖలతో అభివృద్ధి పథంలో గాయత్రి బ్యాంక్
అధ్యక్షులు ముత్యాల లక్ష్మణ్ రెడ్డి
జగిత్యాల జులై 21 (ప్రజా మంటలు) :
రూ. 2843 కోట్ల వ్యాపారంతో 45 శాఖలతో అభివృద్ధి పథంలో గాయత్రి బ్యాంకు ఉందని బ్యాంకు అధ్యక్షులు ముత్యాల లక్ష్మణ్ రెడ్డి అన్నారు. తది: 21-07-2024 న జరిగిన ది గాయత్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు యొక్క సర్వ సభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ బ్యాంకు స్థాపించిన 24 సంవత్సరాల కాలంలో, 7 లక్షల 25 వేల మంది వినియోగదారులను కలిగి 2843.44 కోట్ల వ్యాపారాన్ని కలిగి మల్టీ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంకుగా అవతరించిందని, ఇట్టి అభివృద్ధికి కారణమైన బ్యాంకు ఖాతాదారులకు, సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. మన బ్యాంకునకు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఆధార్ అనుసంధాన పేమెంట్ సేవలను ఏ ఈ పి ఎస్) ప్రారంభించామని అలాగే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ సేవలు కూడా ప్రారంభించామని తెలియజేశారు. మరియు 344 బ్యాంకింగ్ కరెప్పాండెంట్స్ని నియమించి వినియోగదారుల చెంతకు బ్యాంకు సేవలను తీసుకొని వచ్చామని తెలియజేశారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ రూ. 22 కోట్ల 44 లక్షల నికర లాభాన్ని నమోదు చేసుకొని స్టాటుటరీ ఆడిటర్లచే ఏ క్లాస్ బ్యాంక్గా వర్గీకరించబడ్డామని తెలియజేశారు. ఈ ఆర్ధిక సంవత్సరాంతానికి 3500 కోట్ల వ్యాపార లక్షాన్ని, 1 లక్ష నూతన ఖాతాదారులను సేకరించే సంకల్పంతో పనిచేస్తున్నామన్నారు.
భారతీయ రిజర్వు బ్యాంకు వారి అనుమతితో ఆరు బ్రాంచీలు గల యాదగిరి లక్ష్మి నరసింహస్వామి కో-ఆపరేటివ్ అర్బను మన బ్యాంకు యందు తేదీ: 10.06.2024 నుండి విలీనం చేసుకోవడం జరిగింది.
అంతే కాకుండా నూతనంగా ఇప్పటి వరకు 16 బ్రాంచీలు ప్రారంబించుకోవడం జరిగింది ఇందులో 8 బ్రాంచీలు హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాలతో మిగతా 8 బ్రాంచీలను తెలంగాణ యందలి పలు పట్టణాలలో ప్రారంబించుకోవడం జరిగింది. అలాగే తెలంగాణ, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాలలోని ముఖ్య పట్టణాలలో మరో 21 బ్రాంచీలను ప్రారంబించుటకు ఏర్పాట్లు చేస్తున్నాము. తద్వారా మొత్తం 66 బ్రాంచీల నెట్వర్కకి గాయత్రి బ్యాంకు చేరుకో బోతుందని తెలియజేశారు.అలాగే మరిని నూతన బ్యాంకింగ్ సేవలు అనగా డైరెక్టర్ ఆర్ టి జి ఎస్ , ఇంటర్ నెట్ బ్రాంకింగ్ వంటి సేవలను అందుబాటులోకి తేనున్నామని తెలియజేశారు.
అనంతరం బ్యాంకు ముఖ్య కార్యనిర్వహణాధికారి వనమాల శ్రీనివాస్ 31-03-2024 నాటికి ఆడిటెడ్ జమ-ఖర్చు, ఆస్థి-అప్పుల, లాభనష్టముల నివేదికలను సమర్పించారు. గడిచిన 24 సంవత్సరాల కాలంలో తమదైన శైలిలో వినియోగదారులకు అనుకూలమైన వేళలలో పారదర్శకమైన సత్వర సేవలందిస్తూ 31-03-2024 తేదీ నాటికి బ్యాంకు డిపాజిట్లలో 11.67% వృద్ధి సాధించి 1475 కోట్ల 95 లక్షల డిపాజిట్లను కలిగి ఉందని అలాగే ఋణాలలో 10.91% వృద్దితో 1050 కోట్ల 81 లక్షల ఋణ నిలువ, 433 కోట్ల 53 లక్షల పెట్టుబడులను కలిగి, 22 కోట్ల 44 లక్షల నికర లాభాన్ని ఆర్జించి 116 కోట్ల 28 లక్షల నెట్వర్త్ కలిగి ఉన్నామని తెలియజేశారు.
బ్యాంకు ఖాతాదారుల సేవే లక్ష్యంగా , ఏ ఈ పి ఎస్ ,యుపిఐ, మొబైల్ బ్యాంకింగ్ టోల్ ఫ్రీ బ్యాంకింగ్ ఐ ఎం పి ఎస్ వంటిసేవలను అందిస్తున్నామని తెలియజేశారు. ఇప్పటివరకు 344 బ్యాంకింగ్ కరెప్పాండెంట్ (బి.సి)లను నియమించామని,త్వరలో మరిన్ని గ్రామాలకు బి.సి సేవలను విస్తరింపజేస్తామని తెలియజేశారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 90 ఆన్సైట్ ఏటిఎంల ద్వారా రూ 1342.74 కోట్ల ఏటిఎం లావాదేవీలను, 462.39 లక్షల సంఖ్యలో యు.పి.ఐ లావాదేవీలను నమోదు చేశామని తెలియజేశారు.
తమ వంతు సామాజిక బాధ్యతగా బ్యాంకు యందు సేవింగ్ ఖాతాపై 1 లక్ష రూపాయల ప్రమాద భీమా సౌకర్యాన్ని అందించడం జరుగుతుందని ఇట్టి స్కీమ్ ద్వారా ఇప్పటి వరకు ప్రమాదవశాత్తు మరణించిన 566 మంది ఖాతాదారుల కుటుంబాలకు 1 లక్ష రూపాయల చొప్పున అందించి వారి కుటుంబాలకు ఆసరాగా నిలవడం జరిగిందని అన్నారు. ఈ సమావేశంలో ప్రమాదవశాత్తు మరణించిన గాయత్రి నిర్భయ సేవింగ్ ఖాతాదారులైన బోమ్మకంటి గణపతి, ఆమందు గంగార్, పోటువత్తిని శంకరయ్య యొక్క కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయల చొప్పున ప్రమాదబీమా చెక్కులను అందించారు.
బ్యాంకు ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు సభ్యులు బ్యాంకు అభివృద్ధి పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇట్టి కార్యక్రమంలో బ్యాంకు ఉపాద్యక్షులు మన్నె సౌజన్య డైరెక్టరైన ఎ. రాజిరెడ్డి, ఎ. సత్యం, వై. అశోక్, కె. శ్రీనాథ్, బి. విజయ్, వాసాల మాధవి, ఎస్. రవి కుమార్, ఆర్. సతీష్ గార్లు మరియు ఇతర సభ్యలు, ఖాతాదారులు, సహకార అధికారులు, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
బీజేపీకి షాక్: మాజీ మంత్రి ఆర్.కే సింగ్ రాజీనామా – పార్టీ వెంటనే సస్పెండ్
న్యూ ఢిల్లీ నవంబర్ 16 (ప్రజా మంటలు ప్రత్యేక ప్రతినిధి):
మాజీ మంత్రి ఆర్.కే సింగ్ బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన పార్టీ కార్యకలాపాలలోనూ, నిర్ణయాలలోనూ తాను విభేదిస్తున్నానని పేర్కొంటూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి అధికారికంగా సమర్పించారు.
రాజీనామా ప్రకటించిన కొద్ది గంటల్లోనే బీజేపీ... బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారానికి NDA భారీ ఏర్పాట్లు — నవంబర్ 19 లేదా 20న కార్యక్రమం
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో NDA 202 సీట్లు గెలుచుకున్న తర్వాత, నితీష్ కుమార్ మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వేడుకను నవంబర్ 19 లేదా 20న ఘనంగా నిర్వహించేందుకు NDA సన్నాహాలు చేస్తోంది. ప్రధానమంత్రి మోదీ హాజరుకానున్నారు. జనగామ జిల్లాలో దారుణ రోడ్డు ప్రమాదం — ఆర్టీసీ బస్సు లారీని ఢీకొట్టి ఇద్దరు మృతి, ఐదుగురికి గాయాలు
ll హఫీజ్‌పేట్‌లో రుమాల్ హోటల్లో సిలిండర్ పేలి అగ్నిప్రమాదం
హైదరాబాద్ హఫీజ్‌పేట్‌లోని రుమాల్ హోటల్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో అగ్నిప్రమాదం. కిచెన్‌లో మంటలు చెలరేగినా యాజమాన్యం అప్రమత్తతతో ప్రాణనష్టం తప్పింది. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకున్నారు. జగిత్యాల–కరీంనగర్ రహదారి పై రైతుల ఆందోళన
పూడూరు నవంబర్ 16 (ప్రజా మంటలు):
జగిత్యాల–కరీంనగర్ ప్రధాన రహదారి పై శనివారం ఉదయం ఉద్రిక్తత నెలకొంది. కొడిమ్యాల మండలంలోని పూడూర్ గ్రామం వద్ద స్థానిక రైతులు రాస్తారోకో నేపథ్యంలో వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి.
ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతుల ఆగ్రహం
పూడూర్ గ్రామ వ్యవసాయ మార్కెట్లో వరి ధాన్యం కొనుగోలు లేకపోవడం, ప్రభుత్వ... కరీంనగర్లో అమానవీయ ఘటన:
కరీంనగర్ నవంబర్ 16 (ప్రజా మంటలు):
కరీంనగర్ నగరంలోని వావిలాలపల్లి ప్రాంతంలో శుక్రవారం ఉదయం అమానవీయ సంఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలు, పిల్లల అంగవైకల్యం కారణంగా తండ్రి మల్లేశం తన ఇద్దరు పిల్లలకు ఉరివేసి చంపేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
కూతురిని హత్య చేసిన మల్లేశంమల్లేశం ముందుగా తన... ఐబొమ్మ.. ఇక ‘నో బొమ్మే' నా? వెండితెరకు శని: రవి అరెస్ట్ – అసలు ఏం జరుగుతుంది?
హైదరాబాద్, నవంబర్ 15 (ప్రజా మంటలు)
తెలంగాణలో అత్యంత చర్చనీయాంశంగా మారిన పిరేటెడ్ సినిమా సైట్ ‘ఐబొమ్మ’ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఈ సైట్‌ను నడిపిస్తున్న వ్యక్తిగా భావిస్తున్న **ఇమ్మడి రవి (ఐ రవి)**ను శనివారం ఉదయం కూకట్పల్లి ప్రాంతంలో సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవలే ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన రవిని... రాజీ ద్వారానే సత్వర న్యాయం సీనియర్ సివిల్ జడ్జి డి.నాగేశ్వర్.
మెట్టుపల్లి నవంబర్ 15 (ప్రజామంటలు దగ్గుల అశోక్)
పరస్పరం రాజీ పడటం ద్వారానే సత్వర న్యాయం జరుగుతుందని సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర్ రావు అన్నారు. శనివారం మండల లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, దీర్ఘ కాలికాంగ కేసుల్ని కొట్లాడకుండా, రాజీ చేసుకోవడం... ఎం ఎన్ కే విట్టల్ సెంట్రల్ కోర్టులో ఘనంగా శివపార్వతి కళ్యాణం
సికింద్రాబాద్, నవంబర్ 15 (ప్రజా మంటలు):
న్యూ బోయిగూడలోని సెంట్రల్ కోర్టు అపార్టుమెంటు వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంటు డాక్టర్ జి. హనుమాన్లు, జి. వనిత జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైన అభిషేకం కార్యక్రమంలో వందలాదిమంది తమ స్వహస్తాలతో క్షీరాభిషేకం చేశారు. అనంతరం అపార్టుమెంటు దంపతులు కన్యాదాతలుగా వ్యవహరించి శివపార్వతి కళ్యాణం కన్నులపండువగా నిర్వహించారు.
కార్తీక ఏకాదశి పర్వదినాన... రోటరీ ఇంటర్నేషనల్ యంగ్ అచీవర్ అవార్డు–2025కి ఆకర్షణ
సికింద్రాబాద్, నవంబర్ 15 (ప్రజా మంటలు):
హైదరాబాద్‌కు చెందిన 14 ఏళ్ల ఆకర్షణ అద్భుత ప్రతిభకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. రోటరీ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు ఆర్‌టిఎన్. ఫ్రాన్సిస్కో అరెజ్జో చేతుల మీదుగా ఆమె Rotary International Young Achiever Award 2025ను హ్యూమానిటేరియన్ సర్వీస్ విభాగంలో అందుకున్నారు. ఈ అవార్డ్‌ను పొందిన వారిలో ఆమెనే... వశిష్ట కళాశాలలో బీర్సా ముండా 150వ జయంతి
సికింద్రాబాద్, నవంబర్ 15 ( ప్రజా మంటలు):
ఎబీవీపీ సికింద్రాబాద్ జిల్లా, ఎస్ఆర్ నగర్ శాఖ ఆధ్వర్యంలో వశిష్ట కళాశాలలో భగవాన్ బీర్సా ముండా 150వ జయంతి నిర్వహించారు. కార్యక్రమంలో మాట్లాడిన ఎబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు బీర్సా ముండా గాంధీ, నేతాజీ, అల్లూరి, భగత్ సింగ్‌లతో సమానమైన ఆదివాసి స్వాతంత్ర్య వీరుడని చెప్పారు.... గ్లోబ్ ట్రాటర్ (SSMB29) – మహేష్ బాబు, రాజమౌళి సినిమా టీజర్ విడుదల
హైదరాబాద్, నవంబర్ 15 (ప్రజా మంటలు):
ఎస్.ఎస్. రాజమౌళి – మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ పాన్–వరల్డ్ యాక్షన్ అడ్వెంచర్ సినిమా ‘గ్లోబ్ ట్రాటర్’ (వర్కింగ్ టైటిల్ SSMB29), అధికారికంగా ‘వారణాసి’ అనే టైటిల్‌తో గ్రాండ్ ఈవెంట్లో టీజర్‌ను ఆవిష్కరించారు. హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో శనివారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ ఫస్ట్... 