సేవా దృక్పతం అలవర్చుకోవాలి - ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు అభినందనీయం - ఆడువాల జ్యోతి
సేవా దృక్పతం అలవర్చుకోవాలి - ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు అభినందనీయం
మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్
జగిత్యాల జులై 21 :
జర్నలిస్టులు సమస్య పరిష్కారానికి ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధి పని చేయడమే కాకుండా, జర్నలిస్టులందరు ఒక సమూహంగా తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ వేదికగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమనీ మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ అన్నారు.
మైనార్టీ కమ్యూనిటీ హాల్లో తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉచిత హెల్త్ క్యాంపు కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ డీఎస్పీ రఘు సీనియర్ వైద్యులు డా,చందర్, డా,షహీద్ బెగ్, డా, ఎంఎ రఫీ పాల్గొన్నారు.
సేవా దృక్పతం అలవర్చుకోవడం ద్వారా ప్రజల్లో సరైగుర్తింపు లభిస్తుందని చైర్పర్సన్ అన్నారు.
నిరుపేదలకు ప్రత్యేక వైద్య సేవలు అం దుబాటులోకి తేవడానికి వైద్య శిబిరం నిర్వహించడం సంతోషదాయకమన్నారు.
ఈకార్యక్రమంలో మైనార్టీ నాయకులు, ఉర్దూ జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు మరియు కార్యవర్గ సభ్యులు మైనార్టీ మహిళలు తదితరులు పాల్గొన్నారు.