దర్మపురి పోలీస్ స్టేషన్ ను అకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
దర్మపురి పోలీస్ స్టేషన్ ను అకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల జులై 12 (ప్రజా మంటలు)
పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు తక్షణమే న్యాయం జరిగేలా కృషి చేయాలని,పోలీస్ స్టేషన్ పరిసరాలను నిత్యం పరిశుభ్రంగా ఉంచుకోవాలనీ అధికారులను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం ధర్మపురి పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రాపర్ గా పెట్రోలింగ్ నిర్వహిస్తూ, దొంగతనాలు జరగకుండా చూసుకోవాలని ఆదేశించారు. డయల్ 100 కాల్ రాగానే వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సమస్య పరిష్కరించాలని, బ్లూకోల్ట్స్, పెట్రోల్ కార్ నిరంతరం 24x7 గస్తీ నిర్వహించాలని , సిబ్బంది తమకు కేటాయించిన గ్రామాల పూర్తి సమాచారం సిబ్బంది అందరి దగ్గర ఉండాలని, తరచూ గ్రామాలను సందర్శించి సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాల పై, నూతన చట్ట ల పై అవగాహన కల్పించాలని అన్నారు. ప్రజలకు ఎప్పుడు అందుబాటులో వుంటూ ప్రజల సమస్యలను తీర్చాలని, ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందించాలని సూచించారు.
ఎస్పీ వెంట సీఐ రామ్ నరసింహారెడ్డి రెడ్డి,ఎస్.ఐ ఉదయ్ కుమార్ , మరియు సిబ్బంది పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
బాలపెల్లి గ్రామానికి చెందిన పెద్దిరెడ్డి రవీందర్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి దరఖాస్తు దాఖలు

OTT లో విడుదలైన "కిష్కిందపురి"

బ్యాంకింగ్ ఒడిదుడుకుల నడుమ US స్టాక్‌లు కోలుకొంటున్నాయి

కవిత అక్కకు బీసీలు ఇప్పుడు గుర్తొచ్చారా? - బీజేపీ రాష్ట్ర నాయకురాలు ఎం. రాజేశ్వరి.

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయి పై దాడిచేసిన నిందితుడిని శిక్షించాలి

బీసీ బంద్ శాంతియుతంగా జరుపుకోండి - డీజీపీ శివథర్ రెడ్డి సూచన

ఛత్తీస్‌ఘడ్‌లో 210 మంది నక్సల్స్ లొంగిపోవడం — రాజ్యాంగ ప్రతిని పట్టుకొని “హింసకు గుడ్‌బై” చెప్పారు

పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయడమే లక్ష్యం

శ్రీ అభయాంజనేయ స్వామి ధ్వజస్తంభ ప్రతిష్ట - పాల్గొన్న -మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్

జస్టిస్ ఫర్ బీసీస్" బంద్ — నిజంగా న్యాయమా, లేక కొత్త రాజకీయ యజ్ఞమా?
.jpg)
బీసీ బంద్ ను విజయవంతం చేద్దాం.-టీ భీసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు హరి అశోక్ కుమార్.

బీసీల బందుకు తెలంగాణ జాగృతి సంపూర్ణ మద్దతు
