పెన్షనర్ల సమస్యలను పరిష్కరించండి -సీఎం ను కోరిన పెన్షనర్లు_
పెన్షనర్ల సమస్యలను పరిష్కరించండి -సీఎం ను కోరిన పెన్షనర్లు_
జగిత్యాల, జులై 11 (ప్రజా మంటలు) సుదీర్ఘకాలంగా ప్రభుత్వ ఉద్యోగం చేసి పదవి విరమణ చేసిన పెన్షనర్ల సమస్యల పెండింగులో ఉన్నాయని సత్వరమే పరిష్కరించేలా అదేశాలివ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పంపిన మెమోరాండంలో పెన్షనర్లు కోరారు. గురువారం తెలంగాణ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర శాఖ పిలుపులో భాగంగా జగిత్యాల రిటైర్డ్ ఉద్యోగులు కలెక్టర్ ద్వారా ముఖ్యమంత్రి కి మెమోరాండం అందజేశారు. ఈ కార్యక్రమం జిల్లా అధ్యక్షులు ఎల్లా గంగరాజం అధ్యక్షతన జరుగగా ఇందులో అన్ని మండలాల యూనిట్ ప్రతినిధులతోపాటు పట్టణ పెన్షనర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఎల్లా గంగరాజం మాట్లాడుతూ ఉద్యోగుల హెల్త్ స్కీము ద్వారా మూల వేతనం నుంచి ఒక శాతం మినహహించి నగదు రహిత సేవలు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. కమిటేషన్ పద్దతిలో 15 సంవత్సరాల నుంచి 12 ఏండ్లకు తగ్గించాలని కోరారు. పెన్షనర్లకు బకాయి ఉన్న పెండింగ్ డి.ఏ లను వెంటనే విడుదల చేయాలని కోరారు. 398 వేతనంతో ఉద్యోగంలో చేరిన ఉద్యోగులకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి కృషిచేయాలని ఎల్లా గంగరాజం కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కరభూజ రవీందర్, కోశాధికారి మెట్ట మల్లి ఖార్జున్, అసోసియేషన్ అధ్యక్షులు వనమాల సత్యనారాయణ, గుండేటి గంగాధర్, ఎస్.గంగారాం, కమలాకర్ రెడ్డి, ప్రభాకర్ రావు, విటలయ్య, యూనిట్ 2 వైద్య బాల మురళీకృష్ణ, కంటే అంజయ్య, గుండేటి రవీందర్, చిన్న రాజయ్య, వేల్పుల ప్రతాప్, కమలాకర్ రావు తోపాటు కోరుట్ల, మెట్ పెల్లి, రాయికల్, ధర్మపురి, కోడిమ్యాల, మల్యాలల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
అహ్మాదీయ ముస్లిం కమ్యూనిటీ మహిళా విభాగం ఆధ్వర్యంలో బ్లడ్ డోనేషన్

జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలి.

బోనాల జాతరలో భక్తులకు సేవ చేయడం అదృష్టం

రాసుల కొద్దీ తెప్పించుకుంటున్నారు...కాని తనకు గోరంత కూడ దక్కడం లేదు- రంగంలో భవిష్య వాణి వినిపించిన స్వర్ణలత

వేలేరు మాజీ జడ్పిటిసి చాడ సరిత అంత్యక్రియల్లో పాల్గొన్న ప్రముఖులు

ఇప్పుడే బుగ్గారం పంచాయతీ ఎన్నికలు వద్దు

తీన్మార్ మల్లన్నపై కఠిన చర్యలు తీసుకోవాలి- మహిళా కమిషన్ కు తెలంగాణ జాగృతి నాయకుల ఫిర్యాదు

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి-పీ ఆర్ టీ యు జిల్లా ప్రధాన కార్యదర్శి అమర్ నాథ్ రెడ్డి

ఫుట్ పాత్ అనాధలను ప్రభుత్వం ఆదుకోవాలి

గంగపుత్ర సంఘానికి రూ.4 లక్షల ఎంపీ నిధుల కేటాయింపు

ప్రముఖ నటి బి.సరోజాదేవి కన్నుమూత
.jpg)
ఆడబిడ్డలను గౌరవించే తెలంగాణలో ఇలాంటి వ్యాఖ్యలేంటి- మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే వాళ్లు రాజకీయాల్లోకి ఎలా వస్తరు?
