ఎల్.ఐ.సి. ని కాపాడేందుకే ఎఓఐ కృషి ఏజెంట్లకు 50 లక్షల భీమా కల్పించాలి రాష్ట్ర ఇంచార్జీ అధ్యక్షులు తాళ్లూరి శ్రీనివాస రావు
ఎల్.ఐ.సి. ని కాపాడేందుకే ఎఓఐ కృషి
ఏజెంట్లకు 50 లక్షల భీమా కల్పించాలి
రాష్ట్ర ఇంచార్జీ అధ్యక్షులు తాళ్లూరి శ్రీనివాస రావు
జగిత్యాల జులై 10 : భారతీయ జీవిత భీమా సంస్థ ను కాపాడుకునేందుకు ఎల్.ఐ.సి. ఎజెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా కృషి చేస్తుందని రాష్ట్ర ఇంచార్జీ అధ్యక్షులు తాళ్లూరి శ్రీనివాస్ రావు అన్నారు. జగిత్యాల బ్రాంచ్ ఎల్.ఐ.సి. ఎజెంట్ల ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా సర్వ సభ్య సమావేశం బుధ వారం జగిత్యాల శాఖ అధ్యక్షులు ఆమందు రాజ్ కుమార్ అధ్యక్షతన స్థానిక హోటల్ పి.ఎం.ఆర్ గ్రాండ్ లో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ఇంచార్జీ అధ్యక్షులు తాళ్లూరి శ్రీనివాస్ రావు మాట్లాడుతూ ఎల్.ఐ.సి. లో పని చేసే ప్రతి ఎజెంట్ కు కనీసం రూ.50 లక్షల భీమా కల్పించాలని పోరాటం చేయడం జరుగుతుందన్నారు. గతంలో కూడా ఎఓఐ పోరాటం చేయడం వల్లనే ఏజెంట్ల కు 15 లక్షల వరకు భీమా సౌకర్యాన్ని సంస్థ కల్పించడం జరిగిందన్నారు. భీమా సుగం రద్దు కొరకు కూడా గతంలో ఏఓఐ ఆధ్వర్యంలో ఐఆర్ డిఎ కార్యాలయం ఎదుట ధర్నా చేయడం వల్లనే భీమా సుగం ను ఐ. ఆర్ డి.ఎ. రద్దు చేయడం జరిగిందని వివరించారు. రాష్ట్ర కోశాధికారి కొత్తపల్లి రామ్ నర్సయ్య మాట్లాడుతూ సంఘం సభ్యత్వం నమోదు, సభ్యత్వ ప్రాముఖ్యత, ఎవోఐ సభ్యత్వం వల్ల కలిగే ప్రయోజనాల గురించి వివరించారు. కరీంనగర్ డివిజన్ కన్వీనర్ పాలమాకుల రాజా బాబురెడ్డి మాట్లాడుతూ ట్రేడ్ యూనియన్ కు అనుబంధంగా జాతీయ లేబర్ ఆక్ట్ ప్రకారం మన సంఘం పని చేస్తుందన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలలో ఎల్. ఐ.సి. ఎజెంట్ల ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఒకే గొడుగు కింద ఉంటూ.. ఒకే పాన్ కార్డు తో దేశ వ్యాప్తంగా బ్యాంక్ ఖాతాలు, లావాదేవీలు కలిగి ఉండడం జరుగుతుందన్నారు. సభాధ్యక్షులు ఆమందు రాజ్ కుమార్, ప్రధాన కార్యదర్శి రేగొండ లక్ష్మీకాంతం లు
మాట్లాడుతూ గత ఆరు నెలల కాలంలో జగిత్యాల లో ఎఓఐ చేసిన కార్యక్రమాలు, సాధించిన విజయాలు, సేవల గురించి వివరించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మొగిలిచర్ల భద్రయ్య, డివిజన్ నాయకులు గాదాసు శ్రీనివాస్, జగిత్యాల బ్రాంచ్ కోశాధికారి మహంకాళి ప్రభాకర్, ఉపాధ్యక్షులు చుక్క గంగారెడ్డి, మంచిర్యాల బ్రాంచ్ నాయకులు గంగాధరి తిరుపతి, కె.మహేష్ మాట్లాడారు. స్థానిక కార్యవర్గం, సంఘ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి - వేలేరు ఎస్ఐ సురేష్

గౌరెల్లి ప్రాజెక్టు కెనాల్ భూ నిర్వాసితులతో సదస్సు

గాజుల పోచమ్మ ఆలయంలో ఘనంగా గోరింటాకు ఉత్సవాలు

ఓల్డ్ మల్కాజ్గిరిలో, సర్దార్ పటేల్ నగర్ లలో సీసీ రోడ్డు ప్యాచ్ పనులు ప్రారంభం: కార్పొరేటర్ శ్రవణ్

జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జనాభా దినోత్సవ వారోత్సవాలు ప్రారంభం

జిల్లా ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని అభినందించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
.jpg)
నెంబర్ ప్లేట్స్ లేని వాహనాలపై ప్రత్యేక డ్రైవ్: 316 వాహనాలు సీజ్: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు లారీలు సీజ్
.jpeg)
ప్రభుత్వ విద్యను బలోపేతం చేద్దాము.. తపస్

స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుపై ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.- తెలంగాణ జన సమితి

హైకోర్టులో కేవియట్ వేసి బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ ఇవ్వాలి - ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

మల్లన్నపేట పాఠశాలలో ఆషాఢ మాస గోరింటాకు పండగ
