భారీ వర్షాల దృష్ట్యా జిల్లా కు ఆరెంజ్ అలర్ట్, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి గోదావరి నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి - జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
భారీ వర్షాల దృష్ట్యా జిల్లా కు ఆరెంజ్ అలర్ట్, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
గోదావరి నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, చెరువులు, వాగుల వద్దకు వెళ్ళద్దు
- జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
ప్రస్తుతం కూరుస్తున వర్షాలు దృష్ట్యా వాతావరణ శాఖ వారు జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించినందున జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. టెలికాన్ఫెరెన్స్ ద్వారా జిల్లాలో ఉన్న పోలీస్ అధికారులను సిబ్బందిని జిల్లా ఎస్పీ అప్రమత్తం చేశారు. వర్ష సూచన ఉన్న దృష్ట్యా వాగులు పొంగిపొర్లి చెరువులు కుంటలు నిండుకుండ లాగా ఉన్నాయి.
కావున ప్రమాదకరంగా ఉన్న చెరువులు, కుంటలు వద్దకు పిల్లలు,యువత ఎవరూ చెరువుల వైపు వెళ్ళొద్దు అని అన్నారు. చెరువుల వద్ద, వాగుల వద్ద ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాల్సిందిగా సూచించారు.
వర్షానికి ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మట్టి ఇండ్లు కూలిపోయే అవకాశం ఉంటుందని అందులో నివసించే వారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ తక్షణ సహాయం కోసం కు డయల్ 100 సమాచారం ఇవ్వాలని కోరారు. పోలీసు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న చెరువులు,కుంటల నీటి ప్రవాహం గురించి అన్ని జాగ్రత్తలు తీసుకుని ప్రత్యక్షంగా వెళ్లి పర్యవేక్షించాలని సూచించారు. వర్షాల దృష్ట్యా కరెంటు స్తంభాల దగ్గర కు ఎవరు వెళ్లకూడదని అన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అశోక్

మేడిపల్లి గ్రామ శివారులో ఏడుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్.

శ్రీ వీర బ్రహ్మేంద్ర ఆలయ వార్షికోత్సవము- కల్యాణ వేడుకలు

మైనార్టీ నేతలతో కార్పొరేటర్ సమావేశం

సదర్మట్ ప్రాజెక్టు భూ సేకరణ.

బడ్జెట్ లో బడుగు బలహీన వర్గాలకు మొండి చేయి. బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు,పూర్వ జెడ్పీ చైర్ పర్సన్

వైభవంగా ధర్మపురీశుల రథోత్సవ వేడుకలు

అంబరాన్ని అంటిన రవీంద్ర ప్లే స్కూల్ దర్పణ్ - 2K25 సంబరాలు

హరిహర క్షేత్రంలో అంబరాన్ని స్పృశించిన భక్తి పారవశ్యం

ఎస్బి బిల్లు ప్రవేశ పెట్టిన సందర్భముగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయము లో సి ఏం చిత్ర పటానికి పాలాభిషేకం

విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలి -. జిల్లా విద్యాధికారి రాము.

టెన్త్ విద్యార్థులకు పది పరీక్షలపై అవెర్నెస్ కార్యక్రమం
