ఉపాధ్యాయుల అక్రమ స్పాస్ బదిలీలపై చర్యలు తీసుకోవాలి తపస్ డిమాండ్
ఉపాధ్యాయుల అక్రమ స్పాస్ బదిలీలపై చర్యలు తీసుకోవాలి తపస్ డిమాండ్
జగిత్యాల జులై 07 (ప్రజా మంటలు)
ఇటీవల జరిగిన ఉపాధ్యాయ బదిలీల్లో వివిధ క్యాడర్లలో ప్రత్యేక కేటగిరీ కింద పలువురు ఉపాధ్యాయులు తప్పుడు విధానాలతో జిల్లా కేంద్రానికి సమీపాన బదిలీ ఉత్తర్వులు పొందినారని నిబంధనలకు విరుద్ధంగా వీరి బదిలీలు జరిగాయని స్పోస్ మరియు ప్రత్యేక కేటగిరి బదిలీలన్నిటిని పరిశీలించి సదరు ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా శాఖ కోరింది ఈ మేరకు జిల్లా విద్యాధికారి బి జగన్మోహన్ రెడ్డికి వినతి పత్రం సమర్పించింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పాఠశాల విద్యాశాఖ సూచించిన నియమ నిబంధన ప్రకారం స్పోస్ కేటగిరి కింద బదిలీ ఉత్తర్వులు పొందాలంటే భార్య కాని భర్త గాని పనిచేసే చోటు నుండి మొదలుపెట్టి పాఠశాలలకు ఆప్షన్స్ ఇవ్వాలని ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ కొందరు ఉపాధ్యాయులు ఆన్లైన్లో బదిలీలు కదా అని ఎవరు చూస్తారులే అని తమ ఇష్టం వచ్చినట్టు ఆప్షన్స్ పెట్టుకొని నిబంధనలకు విరుద్ధంగా పట్టణ ప్రాంతాలలో బదిలీ ఉత్తర్వులు పొందారని వారు వివరించారు. బుగ్గారం మండలంలో పనిచేస్తున్న ఒక ఎస్జీటీ ఉపాధ్యాయిని తన యొక్క భర్త అదే మండలంలో పనిచేస్తున్నప్పటికి అక్కడ ఖాళీలు ఉన్నప్పటికీ ,వాటిని ఆప్షన్స్ పెట్టుకోకుండా జిల్లా కేంద్రానికి సమీపంలోని పాఠశాలలను ఎంచుకొని అక్రమంగా బదిలీ ఉత్తర్వులు పొందినారని వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.. ఇలా మరికొందరు ఇలాంటి ఉత్తర్వులు పొందినట్లు తెలుస్తోంది. అలాగే ఉపాధ్యాయుల అన్ని క్యాడర్లలో జరిపిన ప్రత్యేక కేటగిరిలో పొందిన బదిలీ ఉత్తర్వులన్నిటిని పరిశీలించాలని అవకతవకలకు పాల్పడ్డ ఉపాధ్యాయులను శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తపస్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బోనగిరి దేవయ్య బోయినిపెల్లి ప్రసాదరావు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడుఅయిల్నేని నరేందర్ రావు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓడ్నాల రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు...
More News...
<%- node_title %>
<%- node_title %>
మైనర్లు వాహనాలు నడిపితే చర్యలు తప్పవు *పట్టణ సీఐ కరుణాకర్

బి ఆర్ ఎస్ అధినేత కేసీఆర్ పంపిన చెక్కును బీఆర్ఎస్ కార్యకర్తకు అందించిన కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ మాజీ ఎమ్మెల్యే సుంకె రవి శంకర్

ప్రజాస్వామ్యంలో జర్నలిస్టులు మూలస్తంబాలు - సీనియర్ సిటీజేన్స్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్.

నవ్య బాలికల కళాశాలలో ఘనంగా స్వాగతోత్సవ వేడుకలు

టీయూడబ్ల్యూజే (ఐజేయు) జగిత్యాల జిల్ల ప్రెస్ నూతన కమిటీని సన్మానించిన బిజెపి రాష్ట్ర సీనియర్ నాయకులు ముదిగంటి రవీందర్ రెడ్డి.

భూ కబ్జాదారుల చేతుల్లో ప్రభుత్వ భూమి

ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలందించాలి: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

హిందువులు, బౌద్ధులు, సిక్కులు కాకుండా ఇతర వ్యక్తుల ఎస్సీ సర్టిఫికెట్లు రద్దు చేస్తాం:మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్
.jpeg)
సికింద్రాబాద్ ఎలక్ర్టికల్స్ ట్రేడర్స్ ప్రెసిడెంట్ గా సురేశ్ సురానా

గాంధీ మెడికల్ కాలేజీలో బోనాల ఉత్సవాలు
