ఇందిరమ్మ రాజ్యం అంటే జర్నలిస్ట్ పై దాడి చేయడమా..? -జర్నలిస్ట్ లపై ప్రభుత్వం దాడులు హే్యమైన చర్య
ఇందిరమ్మ రాజ్యం అంటే జర్నలిస్ట్ పై దాడి చేయడమా..?
-జర్నలిస్ట్ లపై ప్రభుత్వం దాడులు హే్యమైన చర్య
-జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్
జగిత్యాల, జులై 11( ప్రజా మంటలు ) ఇందిరమ్మ రాజ్యం అంటే ప్రజాస్వామ్యం కు నాలుగో స్థంభం అయిన జర్నలిజం పై ఉక్కు పాదం మోపుతూ, జర్నలిస్ట్ లపై దాడులు చెయ్యడమా అని జిల్లా పరిషత్ తొలి చైర్ పర్సన్ దావ వసంత సురేష్ ప్రశ్నించారు. ఈ సందర్బంగా వసంత మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యంలో జర్నలిస్ట్ లకు రక్షణ కరువైందన్నారు. విధి నిర్వహణలో భాగంగా జర్నలిస్ట్ లు కవరేజికి వెళ్తే, కవరేజ్ కి వెళ్లిన జర్నలిస్ట్ పై దాడులు చేయడం పై దురదృష్టకరం అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీడియా పై దాడులు మొదలవడం ప్రజాస్వామ్యం కే మాయని మచ్చ అని అన్నారు. గతంలో న్యూస్ లైన్ రిపోర్టార్ జర్నలిస్ట్ శంకర్ పై దాడులు చేశారని, ఇటీవల బాల్కంపేట ఎల్లమ్మ తల్లీ బోనాల కవరేజి కి వెళ్లిన 10 టివి ఛానల్ మహిళా జర్నలిస్ట్ పై పోలీసులు దురుసుగా ప్రవర్తించరాని గుర్తు చేశారు. ప్రజా పాలన అంటూనే ప్రజల పక్షంగా, ప్రజలు ప్రభుత్వం కు మధ్య వారిదిగా ఉండే మీడియా ప్రతినిధులపై దాడులు చేయడం ఏంటని వసంత ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చాక ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉద్యమ కాలం నాటి పరిస్థితి కనిపిస్తుందని గుర్తు చేశారు. పరీక్ష రాసే అభ్యర్థులు తమ ఇబ్బందులు ప్రభుత్వం కు విన్నవించే ప్రయత్నం చేస్తే పట్టించుకోని ప్రభుత్వం ఒంటెద్దు పోకడలతో పరీక్షల నిర్వహణ చేస్తుందని, దీంతో అగ్రహించిన విద్యార్థులు, అభ్యర్థులు నిరసనలు దిగితే వారి వెనక రాజకీయశక్తులు ఉన్నాయని, కోచింగ్ సెంటర్ ల మాఫియా ఉందని సీఎం స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డి మాట్లాడ్డం విచారకరం అన్నారు. సీఎం ప్రకటనపై నిరుద్యోగులు ఆందోళన చేస్తే వాస్తవాలు పరిగణలోకి తీసుకోవాల్సిన ప్రభుత్వం ఏకపక్షంగా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడే విధంగా చర్యలు చేపట్టడం దురదృష్టకరం అన్నారు. నిరుద్యోగుల ఆకాంక్షలను తొక్కివేసిన ప్రభుత్వం, వారి ఆకాంక్షలను ప్రపంచానికి చూపించేందుకు వెళ్లిన జర్నలిస్ట్ లపై దాడులు జరపడం, వారిపై దురుసుగా ప్రవర్తించడం నియంత పాలనకు నిదర్శనం అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పరీక్షల విషయంలో పునరాలోచన చెయ్యాలని, జర్నలిస్ట్ లపై దాడులు నిలువరించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మీడియపై జర్నలిస్ట్ పై దాడులకు దిగితే బీఆరెస్ పార్టీ ఊరుకోబోధని, జర్నలిస్ట్ లకు అండగా నిలిచి, ప్రభుత్వ విధానాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగడతామని హెచ్చరించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
పత్తి కొనుగోలులో తేమ ప్రమాణాలు సడలించాలి: కేంద్ర మంత్రికి కల్వకుంట్ల కవిత లేఖ
- మోంథా తుఫాన్ ప్రభావంతో పత్తిలో తేమ శాతం 25% వరకు పెరుగుదల- సీసీఐ కొనుగోళ్లు జరగక రైతులు ఇబ్బందులు- 25% వరకు తేమ ఉన్న పత్తికి మద్దతు ధర ఇవ్వాలని కవిత డిమాండ్- కేంద్ర టెక్స్టైల్ మంత్రి గిరిరాజ్ సింగ్ కు లేఖ రాసిన కవిత- తెలంగాణ పత్తి... తరుణం బ్రిడ్జి వెంటనే పూర్తి చేయాలి: కల్వకుంట్ల కవిత
జాగృతి జనంబాట పర్యటనలో తరుణం బ్రిడ్జి పరిశీలన
ముఖ్యాంశాలు:
- బేల, జైనాథ్ మండలాల మధ్య తరుణం బ్రిడ్జి పరిశీలించిన కవిత- రూ. 4 కోట్లతో చిన్న బ్రిడ్జి నిర్మాణం – రోడ్డు కనెక్టివిటీ సమస్య- పాత బ్రిడ్జి కూల్చడంతో టూవీలర్లు కూడా వెళ్లలేని పరిస్థితి- మహారాష్ట్రతో కనెక్టివిటీ కోల్పోయే... ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృతి – తండ్రి బస్టాప్ వద్ద దింపిన గంటలోనే దుర్ఘటన
(పెద్ద కూతురు పెళ్లి సందర్భంలో తీసిన ఫోటో)
తండ్రి దింపిన గంటలోనే ముగ్గురు కుమార్తెల మృతి
రంగారెడ్డి, నవంబర్ 03 (ప్రజా మంటలు):రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద ఈరోజు ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం దేశాన్ని షాక్కు గురి చేసింది. బీజాపూర్–హైదరాబాద్ జాతీయ రహదారిపై దూసుకెళ్లిన టిప్పర్ లారీ,... మెక్సికో హర్మోసిల్లోలో వాల్డోస్ సూపర్మార్కెట్లో ఘోర పేలుడు – 23 మంది దుర్మరణం
హర్మోసిల్లో (మెక్సికో), నవంబర్ 2:మెక్సికోలోని సోనోరా రాష్ట్ర రాజధాని హర్మోసిల్లోలో వాల్డోస్ డిస్కౌంట్ సూపర్మార్కెట్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నవంబర్ 1న జరిగిన ఈ ఘటనలో 23 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో చిన్నపిల్లలు కూడా ఉన్నారు.
ఈ దుర్ఘటన ‘డే ఆఫ్ ది డెడ్’ (Day of the... మద్యం తాగి వాహనం పట్టుబడిన వ్యక్తులకు పది రోజులు జైలు శిక్ష
(అంకం భూమయ్య)
గొల్లపల్లి నవంబర్ 03 (ప్రజా మంటలు):
గొల్లపల్లి కేంద్రంలోని ఎస్ఐ, కృష్ణా సాగర్ రెడ్డి వాహనాలు తనిఖీలు చేపట్టగా ఇద్దరు వ్యక్తులు మద్యం సేవించిన వారిని జగిత్యాల కోర్ట్ లో ప్రవేశపెట్టగా స్పెషల్ జ్యూడిషల్ II క్లాస్ మెజిస్ట్రేట్, 10 రోజుల జైలు శిక్ష విధించినారు. ఈ సందర్భంగా గొల్లపల్లి ఎస్ఐ, కృష్ణా... జగిత్యాల మాతా శిశు ఆసుపత్రి పరిశీలన
జగిత్యాల (రూరల్) నవంబర్ 03 (ప్రజా మంటలు):
జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారు జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆసుపత్రి మరియు ఆక్సిజన్ ప్లాంట్ను సందర్శించారు. ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న పడకలు, ఆక్సిజన్ సరఫరా, మందుల నిల్వలు, స్టాఫ్ హాజరు రిజిస్టర్ తదితర అంశాలను పరిశీలించి, వైద్య అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.... మీర్జగూడ బస్సు ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కవిత
హైదరాబాద్ నవంబర్ 03 (ప్రజా మంటలు):
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఖానాపూర్ స్టేజీ వద్ద ఆర్టీసీ బస్సు టిప్పర్ ఢీకొని జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై తెలంగాణ జాగృతి అధినేత్రి కవిత, ట్విట్టర్ ద్వారా తన తీవ్ర ద్రిగ్బాంతి వ్యక్తం చేసారు.
ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆర్ధికంగా ఆదుకోవడంతో పాటు గాయపడిన... జయపూర్లో ఘోర రోడ్డు ప్రమాదం – డంపర్ 17 వాహనాలను డీ కొట్టడంతో, 11 మంది మృతి, 10 మందికి పైగా గాయాలు
జయపూర్ (రాజస్తాన్), నవంబర్ 03
జయపూర్లో భయంకర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న భారీ డంపర్ నియంత్రణ కోల్పోయి వరుసగా 17 వాహనాలను ఢీకొట్టింది. ఈ ఘటనలో 11 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, 10 మందికి పైగా గాయపడ్డారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని SMS ట్రామా సెంటర్కు... చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం – 17 మంది మృతి, పలువురికి తీవ్ర గాయాలు
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద బస్సు, లారీ ఢీ. ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
హైదరాబాద్, నవంబర్ 03:రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో ఈరోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మీర్జాగూడ సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సును కాంకర్ లారీ... ప్రపంచ మహిళా క్రికెట్ కప్ విజేత భారత్ — చరిత్ర సృష్టించిన హర్మన్ప్రీత్ సేన
మహిళల వన్డే ప్రపంచకప్ 2025 ఫైనల్లో భారత్ ఘనవిజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ చేసిన భారత్ బౌలర్ల అద్భుత ప్రదర్శనతో దక్షిణాఫ్రికాను ఓడించింది.
భారత్ విజయం: 47 పరుగుల తేడాతోమ్యాచ్ బెస్ట్ ప్లేయర్: స్మృతి మంధానాసిరీస్ బెస్ట్ ప్లేయర్: హర్మన్ప్రీత్ కౌర్
నవి ముంబై నవంబర్ 02:
మహిళల... నవీన్ యాదవ్కు మద్దతుగా పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డా. కోట నీలిమ ప్రచారం
సికింద్రాబాద్ , నవంబర్ 02 (ప్రజా మంటలు):
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అభ్యర్థి వి. నవీన్ యాదవ్కు మద్దతుగా సోమాజిగూడ డివిజన్ లోని ఎల్లారెడ్డి గూడలో పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కోట నీలిమ ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా ముందుగా దుర్గాదేవి ఆలయంలో నవీన్ యాదవ్ గెలవాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు.... కెన్యాలో కార్తీక మాస వనభోజనాలు..పూజలు
సికింద్రాబాద్, నవంబర్ 02 (ప్రజామంటలు) :
కెన్యా దేశంలోని మోంబాసా లో స్థిరపడ్డ తెలుగు రాష్ర్టాల ప్రజలు ఆదివారం కార్తీక మాస పూజలు, వనభోజనాలు కార్యక్రమాలను సంప్రదాయబద్దంగా నిర్వహించారు. మోంబాసా లోని విశాలమైన హిందూ యూనియన్ పార్కు ప్రాంతంలో మహిళలు రావి చెట్టు కింద ఉసిరి కొమ్మలు,ఉసిరి కాయలు, తులసి ఆకులు పెట్టి శివుడికి పూజలు... 