రైతు రుణమాఫీ ప్రభుత్వ విధివిధానాలు బ్యాంకర్లు తప్పక పాటించాలి - జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్
రైతు రుణమాఫీ ప్రభుత్వ విధివిధానాలు బ్యాంకర్లు తప్పక పాటించాలి
- జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్
జగిత్యాల జులై 18 (ప్రజా మంటలు) :
జిల్లా స్థాయి బ్యాంకింగ్ అధికారుల మరియు అగ్రికల్చర్ సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్.
గురువారం కలెక్టరేట్ లోని మీటింగ్ హాల్ లో ప్రభుత్వ, ప్రవేట్ బ్యాంకింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇటీవలే ప్రభుత్వం క్రాప్ లోన్ రుణమాఫీకి సంబంధించి రుణం తీసుకున్న వారికి రుణమాఫీ వర్తింపచేయాలని, ప్రతి కుటుంబానికి ఒక్కరు మాత్రమే అర్హులని ప్రభుత్వం జి.ఓ జారీ చేసిందని, విధి విధానాలు తప్పక పాటించాలని నిర్లక్ష్యం వహించరాదని బ్యాంక్ అధికారులను ఆదేశించారు. 367 జి.ఓ క్రాప్ లోన్ కట్ఆఫ్ డేట్ లోపు ఉన్న ప్రతి రైతులకు రుణ మాఫీ కచ్చితంగా అమలు చేయాలని కోరారు. రైతులలో ప్రధానంగా కొందరు ఈ- కె వై సి కానీ వారు ఉన్నారని, వారికి కూడా ఇబ్బంది కలగకుండా ఈ- కె వై సి చేయించాలని కోరారు. మహిళా శక్తి క్యాంటీ న్లు కూడా మహిళా సంఘాల ద్వారా ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. మన జిల్లాలో 300 మంది లబ్ధిదారులు రుణాలు రిజెక్ట్ కావడం జరిగిందని తెలిపారు. ప్రతి కుటుంబానికి రెండు లక్షల రుణమాఫీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందని క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సిన అవసరం ఉందని ఆదేశించారు. అలాగే రైతు మిత్ర, కౌలు రైతు అర్హులు కాదాని అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమములో జడ్పీ డిప్యూటీ సీఈఓ రఘువరన్, ఎల్.డి.యం. రాం కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి వాణి, డి ఆర్ డి ఓ సంపత్ రావు, బ్యాంక్ అధికారులు,వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
బీరయ్య గుడి 12 లక్షల ప్రొసీడింగ్స్ కురుమ సంఘ సభ్యులకు ఎమ్మెల్యే చే అందజేత

పేద బాలుడి వైద్య ఖర్చులకు 1.13 లక్షలు సాయం.

కళ్యాణ లక్ష్మి సీఎం రిలీఫ్ ఫండ్ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

మండల విద్యాధికారి భూస జమునా దేవి పదవి విరమణ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా విద్యాధికారి రాము,

సమయస్ఫూర్తితో వ్యక్తి ప్రాణాలను కాపాడిన ధర్మపురి సిఐ, రామ్ నరసింహారెడ్డి

ఉద్యమకారులను ప్రభుత్వం గుర్తించాలి ఇండ్ల స్థలాలు, పెన్షన్ లు ఇవ్వాలి
.jpg)
వెల్గటూర్ మండలంలో రాష్ట్ర మంత్రి అడ్లూరి సతీమణి పర్యటన

35వ వార్డులో సీసీ రోడ్డు డ్రైనేజీ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్
.jpg)
ప్రజావాణి దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్.

గ్రీవెన్స్ డే – బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రమాణ స్వీకారం లో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్
