కాంగ్రెస్‌ - బిఆర్‌ఎస్‌ తోడుదొంగల పార్టీలు బిజెపి జమ్మికుంట మండలాధ్యక్షుడు సంపత్‌ రావు

On
కాంగ్రెస్‌ - బిఆర్‌ఎస్‌ తోడుదొంగల పార్టీలు  బిజెపి జమ్మికుంట మండలాధ్యక్షుడు సంపత్‌ రావు

కాంగ్రెస్‌ - బిఆర్‌ఎస్‌ తోడుదొంగల పార్టీలు

బిజెపి జమ్మికుంట మండలాధ్యక్షుడు సంపత్‌ రావు

 

జమ్మికుంట ఏప్రిల్‌ 15 (ప్రజామంటలు): దేశభద్రతకు మోడీ అవసరమని,  కాంగ్రెస్‌ పార్టీ వైఫల్యాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సరి చేస్తున్నారని రాష్ట్రంలోని కాంగ్రెస్‌ నాయకులు కొంత మంది అభిప్రాయపడుతుంటే... పూటకొక పార్టీ మారే నాయకులు మాత్రం బిజెపి పార్టీని, కరీంనగర్‌ ఎంపీ  బండి సంజయ్‌ కుమార్‌ మీద తెలిసి తెలియని వారు అవాక్కులు, చేవాక్కులు చేస్తూ, కాంగ్రెస్‌ నాయకుల కొంతమంది నాయకుల మద్దతు కోసం పాకులాడుతున్నారని, అందులో ఒకరు వొడితల  ప్రణవ్‌ బాబు అని  బీజేపీ జమ్మికుంట మండల అధ్యక్షుడు సంపెల్లి సంపత్‌ రావు  విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కరీంనగర్‌ పార్లమెంట్‌ లోని హుజురాబాద్‌ అసెంబ్లీలో మాజీ ఎంపీ ప్రస్తుత హుస్నాబాద్‌ ఎమ్మెల్యే తెలంగాణ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్‌ హుజరాబాద్‌ అసెంబ్లీలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని, తన సొంత పేరు కోసం చిన్న చిన్న సమాజ కార్యక్రమాలు నిర్వహించాడే గాని అతని కంటే ఎక్కువ ప్రస్తుత ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్ఫూర్తితో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాడని మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ మంత్రి బహిరంగ చర్చకు రమ్మని దానికి బిజెపి కరీంనగర్‌ పార్లమెంటు కన్వీనర్‌ లాంటి నాయకులు పాల్గొంటారని మీరు గతంలో చేసిన అభివృద్ధితో, మేము ఈ ఐదు సంవత్సరాలు చేసిన అభివృద్ధి  ఏమిటో  బహిరంగ చర్చి ద్వారా నిరూపిద్దామని సంపెల్లి సంపత్రావు అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల ప్రధాన కార్యదర్శి పుల్లూరు ఈశ్వర్‌ బీజేవైఎం జిల్లా అధికార ప్రతినిధి కైలాసకోటి గణేష్‌, కిసాన్‌ మోర్చా మండల అధ్యక్షుడు  గిర్నాల ఐలయ్య, రవి తదితరులు పాల్గొన్నారు.

 

Tags
Join WhatsApp

More News...

Local News  State News 

రైతు ప్రభుత్వం అంటే రైతులను గోస పెట్టడమా? — దావ వసంత సురేష్ ప్రభుత్వంపై విమర్శ

రైతు ప్రభుత్వం అంటే రైతులను గోస పెట్టడమా? — దావ వసంత సురేష్ ప్రభుత్వంపై విమర్శ సారంగాపూర్, నవంబర్ 02 (ప్రజా మంటలు): జిల్లా పరిషత్ తొలి చైర్‌పర్సన్ శ్రీమతి దావ వసంత సురేష్ గారు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.ఆమె మాట్లాడుతూ, “రైతు ప్రభుత్వం అంటే రైతులను గోస పెట్టడమా? కాలం, ప్రకృతి తో పాటు ప్రభుత్వం కూడా రైతులపై పగబట్టినట్లుంది” అని ఆవేదన వ్యక్తం చేశారు. సారంగాపూర్...
Read More...

క్రీడలు మానసిక ఉల్లాసం, శారీరక దారుఢ్యం పెంచుతాయి — ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

క్రీడలు మానసిక ఉల్లాసం, శారీరక దారుఢ్యం పెంచుతాయి — ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ జగిత్యాల (రూరల్), నవంబర్ 02 (ప్రజా మంటలు):జగిత్యాల పట్టణంలోని వివేకానంద మినీ స్టేడియంలో జరిగిన గిరీష్ సింగ్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ 2025 కార్యక్రమంలో ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ పాల్గొని ట్రోఫీ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “క్రీడలు మానసిక ఉల్లాసం, శారీరక దారుఢ్యాన్ని పెంపొందిస్తాయి. యువత క్రీడల్లో చురుకుగా...
Read More...
Local News 

నిరాశ్రయులు, సంచార జాతులకు దుస్తులు పంపిణి

నిరాశ్రయులు, సంచార జాతులకు దుస్తులు పంపిణి సికింద్రాబాద్  నవంబర్ 02 (ప్రజా మంటలు): హైదరాబాద్ నగరంలో రోడ్ల పక్కన ఫుట్ పాత్ ల మీద జీవనం సాగిస్తున్న నిరాశ్రయులు, సంచారజాతుల కుటుంబాలకు స్కై ఫౌండేషన్ నిర్వాహకులు దుస్తులు పంపిణి కార్యక్రమం నిర్వహించారు. దుస్తులు అందుకున్న నిరాశ్రయులు, సంచార జాతుల వారు స్కై ఫౌండేషన్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమములో ప్రెసిడెంట్ డాక్టర్....
Read More...
Local News 

భౌతికంగా దూరంగా ఉన్నా... వారి జ్ఞాపకాలు శాశ్వతంగా ఉంటాయి :ఎమ్మెల్యే తలసాని .

భౌతికంగా దూరంగా ఉన్నా... వారి జ్ఞాపకాలు శాశ్వతంగా ఉంటాయి :ఎమ్మెల్యే తలసాని . . సికింద్రాబాద్,  నవంబర్ 02 ( ప్రజా మంటలు):  మరణం భౌతికంగా వ్యక్తులను దూరం చేసినప్పటికీ, వారి జ్ఞాపకాలు, వారి పట్ల ఉన్న ప్రేమ మాత్రం శాశ్వతంగా ఉంటుందని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం ఆత్మల దినం (ఆల్ సోల్స్ డే) సందర్భంగా బన్సీలాల్ పేట డివిజన్ లోని...
Read More...
Local News 

కార్తీకమాసం శివుడికి ఎంతో ప్రీతిపాత్రం : ఎమ్మెల్యే తలసాని

కార్తీకమాసం శివుడికి ఎంతో ప్రీతిపాత్రం : ఎమ్మెల్యే తలసాని సికింద్రాబాద్, నవంబర్ 02 (ప్రజా మంటలు):  కార్తీక మాసం మహా శివుడికి ఎంతో ప్రీతిపాత్రమైన మాసం అని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం బన్సీలాల్ పేట డివిజన్ బోయగూడ ఉప్పలమ్మ  దేవాలయం ప్రాంగణంలో శివలింగం, నందీశ్వర పున: ప్రతిష్ట పూజలలో పాల్గొన్నారు. ఆలయ కమిటీ ప్రెసిడెంట్ శ్రీధర్ ఎమ్మెల్యే...
Read More...

నేడే మహిళల ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ — భారత్ vs ఆస్ట్రేలియా మధ్య తుది పోరు

నేడే మహిళల ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ — భారత్ vs ఆస్ట్రేలియా మధ్య తుది పోరు ముంబై, నవంబర్ 2:మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో అత్యంత ఆసక్తికరమైన ఘట్టం ఈరోజు జరగనుంది. భారత్‌ మరియు ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫైనల్ పోరు ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఉదయం 10.00 గంటలకు ప్రారంభం కానుంది. టీమ్‌ ఇండియా ఈ టోర్నీలో అద్భుతమైన ప్రదర్శనతో లీగ్‌ దశలో ఆస్ట్రేలియాపై విజయం సాధించి అగ్రస్థానంలో నిలిచింది....
Read More...
National  State News 

కరూర్లో తొక్కిసలాట కేసు దర్యాప్తు మూడో రోజు కూడా కొనసాగింపు

కరూర్లో తొక్కిసలాట కేసు దర్యాప్తు మూడో రోజు కూడా కొనసాగింపు   — వ్యాపారులను ప్రశ్నిస్తున్న సీబీఐ అధికారులు కరూర్ (తమిళనాడు), నవంబర్ 2: తమిళనాడు రాష్ట్రం కరూర్లో జరిగిన దారుణమైన తొక్కిసలాట ఘటనపై సీబీఐ అధికారులు మూడో రోజు కూడా విచారణ కొనసాగిస్తున్నారు. కరూర్లోని వేలుచామిపురం ప్రాంతంలోని వ్యాపారులు, దుకాణ యజమానులను ఆదివారం ఉదయం నుంచి అధికారులు ప్రశ్నిస్తున్నారు. గత సెప్టెంబర్ 27న థావేకా పార్టీ ప్రచార...
Read More...
State News 

జోగులాంబ గద్వాల్ ఫుడ్ పాయిజన్ ఘటనపై మానవ హక్కుల కమిషన్ సుయోమోటో —

జోగులాంబ గద్వాల్ ఫుడ్ పాయిజన్ ఘటనపై మానవ హక్కుల కమిషన్ సుయోమోటో — హైదరాబాద్, నవంబర్ 02 (ప్రజా మంటలు):జోగులాంబ గద్వాల్ జిల్లా ఎర్రవల్లి మండలం ధర్మవరం గ్రామంలోని ప్రభుత్వ బీసీ వెల్ఫేర్ బాలుర వసతి గృహంలో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సుయోమోటోగా కేసు నమోదు చేసింది. డా. జస్టిస్ షమీం అక్తర్, మానవ హక్కుల కమిషన్ ఛైర్‌పర్సన్,...
Read More...

జగిత్యాల విద్యార్థి హిమేష్ వైద్యానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చొరవ

జగిత్యాల విద్యార్థి హిమేష్ వైద్యానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చొరవ జగిత్యాల (రూరల్) నవంబర్ 2 (ప్రజా మంటలు):జగిత్యాల జిల్లా ధరూర్ క్యాంపు ఎస్సీ హాస్టల్‌కు చెందిన విద్యార్థి హిమేష్ ఇటీవల పిడుగుపాటుతో తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం సికింద్రాబాద్లోని యశోద హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న హిమేష్‌ ను రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్వయంగా పరామర్శించారు. విద్యార్థి ఆరోగ్య పరిస్థితిని వైద్యుల...
Read More...
Local News  State News 

కళాకారులకు,కార్మికులకు అండగా ఉంటాం : కల్వకుంట్ల కవిత

కళాకారులకు,కార్మికులకు అండగా ఉంటాం : కల్వకుంట్ల కవిత జాగృతి రాజకీయ వేదికే — కానీ మా రాజకీయాలు ప్రజల కోసం కరీంనగర్, నవంబర్ 1 (ప్రజా మంటలు): “జాగృతి రాజకీయ వేదికే — కానీ మా రాజకీయాలు ప్రజల కోసం మాత్రమే. సమానత్వం, సామాజిక తెలంగాణ సాధన కోసం నిరంతర పోరాటం కొనసాగిస్తాం,” అని కవిత గారు స్పష్టం చేశారు. జాగృతి అధ్యక్షురాలు...
Read More...
National  Sports  International  

రేపే మహిళల వన్డే ప్రపంచ కప్ క్రికెట్ ఫైనల్

రేపే మహిళల వన్డే ప్రపంచ కప్ క్రికెట్ ఫైనల్ ముంబయి, నవంబర్ 1 (ప్రజా మంటలు): ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్ రేపు (ఆదివారం) డివై పాటిల్ స్టేడియంలో జరగనుంది. భారత్ మరియు దక్షిణాఫ్రికా జట్లు తలపడుతున్న ఈ పోరులో ఏ జట్టు గెలిచినా మొదటిసారిగా ప్రపంచ ఛాంపియన్‌గా అవతరిస్తుంది. ఫైనల్ ముందు శనివారం సాయంత్రం భారత జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మీడియాతో...
Read More...
Crime  State News 

ప్రమాదవశాత్తు ట్యాంకర్ తగిలి ఎఎస్సై మృతి

ప్రమాదవశాత్తు ట్యాంకర్ తగిలి ఎఎస్సై మృతి హైదరాబాద్, నవంబర్ 1 (ప్రజా మంటలు): మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఏఎస్సై దేవిసింగ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. వికారాబాద్ జిల్లా పెద్దముల్కు నివాసి అయిన దేవిసింగ్ కొంతకాలంగా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఏఎస్సైగా విధులు నిర్వహిస్తున్నారు. శనివారం రాత్రి జరిగిన ఈ దుర్ఘటనలో దేవిసింగ్ వాటర్ ట్యాంకర్...
Read More...