ధర్మపురి దేవస్థానంలో రథోత్సవానికి భారీ ఏర్పాట్లు

On
ధర్మపురి దేవస్థానంలో రథోత్సవానికి భారీ ఏర్పాట్లు

ధర్మపురి దేవస్థానంలో రథోత్సవానికి భారీ ఏర్పాట్లు

(రామ కిష్టయ్య సంగన భట్ల.)
...................................
   
 సుప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన ధర్మపురి దేవస్థానంలో నిర్వహిస్తున్న లక్ష్మీనరసింహ, శ్రీవేంకటేశ్వర స్వాముల బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టమైన రథోత్సవం శుక్ర వారం నిర్వహించ నున్నందున అధిక మవుతున్న భక్తుల రద్దీ దృష్ట్యా దేవస్థానం, మున్సిపల్,  ఇతర సంబంధిత అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. కల్యాణ మహోత్సవ, తెప్పోత్సవ, డోలోత్సవాది కార్యక్రమాలు, ఉత్తర, దక్షిణ దిగ్యాత్రలు విజయవంతంగా పూర్తి చేసుకుని, వేద సదస్యం, భోగమంటపం, సంగీత సభలను ముగించుకున్న శ్రీనృసింహుడు, సకలాభరణ శోభితయై వెలుగొందుచున్న లక్ష్మీదేవితో కూడి, తమ ఏకాంత మందిరాన నిద్రించుచున్న సమయాన, గుర్తు తెలియని వ్యక్తులెవరో దొంగ చాటున ప్రవేశించి మహాలక్ష్మి నగలన్నీ దోచుకుని వెళతారు. తెల్లవారి నిద్రలేచి జరిగిన విషయాన్ని లక్ష్మీదేవి ద్వారా గ్రహించిన నారసింహుడు, కైలాస గిరీశుడైన అభయం కరుడు శంకరుడు, కలియుగ దైవమైన వేంకటేశ్వ రుడు తోడురాగా, రథారూఢులై బయలుదేరి దొంగలను కనుగొని, వారిని బంధించి దిగ్విజయంగా తిరిగి రావడం పురి క్షేత్ర రథోత్సవ ప్రత్యేకత. అనాదిగా ఆచరిస్తున్న సంప్రదాయాచరణలో భాగంగా దేవస్థాన ప్రాంగణాన గల, దివంగత ధర్మపురి దానకర్ణులు దివంగతులైన కోరిడె సదాశివు రాంబాయమ్మ దంపతులు ప్రత్యేకించి తయారు చేయించి దేవస్థానానికి బహూకరించిన లక్ష్మీనర సింహ, శ్రీరామలింగేశ్వర, రాష్ట్ర మాజీ మంత్రి కర్నె వెంకట కేశవుల హయంలో దేవస్థానం తయారు చేయించిన వేంకటేశ్వర స్వాముల రథాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అధిక సంఖ్యలో భక్తులు, యాత్రికులు రథోత్సవంలో భాగస్వాములు కానున్నందున సౌకర్యాలు, వసతులు కల్పనపై దృష్టి పెట్టి వివిధ శాఖల పక్షాన ఏర్పా ట్లను చేశారు. జగిత్యాలతోపాటు ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, ఆర్మూర్, కోరుట్ల, మెట్పల్లి, కామారెడ్డి, భైంసా, వరంగల్, కరీంనగర్ డిపోల నుండి ప్రత్యేక జాతర బస్సులను నడుపుతున్నారు.

మొక్కులు తీర్చుకున్న భక్తులు...
దైవ దర్శనాలకు వేచి ఉన్న భక్తజనం

 ధర్మపరి క్షేత్రంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలలో అంతర్భాగంగా గురు వారం నిర్వహించిన శ్రీవేంకటేశ్వర ఉత్తర, దక్షిణ దిగ్యాత్రల సందర్భంగా వంశపారంపర్య ఆచార ఆచరణ నేపథ్యంలో రాష్ట్రం నలు మూలల నుండే కాక, మహారాష్ట్ర తదితర సుదూర ప్రాంతాల నుండి ఏతెంచిన భక్తజన దేవస్థానంలో మొక్కులు తీర్చుకున్నారు. పిల్లా పాపలతో గోదావరి నదికి మూదా ముళ్ళీ వెత్తిన పెట్టుకు వచ్చిన భక్తులు, మంగళ స్నానాలను ఆచరించి, గోదావరి మాతను ఆర్పించి, దానధర్మా దులను ఆచరించి, వివిధ ఆలయాలలో దైవ దర్శనాలు చేసుకున్నారు. ప్రధానంగా కలియుగ దైవమైన శ్రీవేంకటేశ్వర మందిరంలో చిరకాల వాంఛలు ఈడేర్చాలని ప్రార్ధిస్తూ మొక్కులు తీర్చుకున్నారు. ముడుపులు చెల్లించుకున్నారు.

సంప్రదాయ రీతిలో వేద సదస్యం 

దేవస్థానంలోని శేషప్ప కళావేదికపై రాత్రి సాంప్రదాయ రీతిలో వేద సదస్యం నిర్వహించారు. యోగానంద, ఉగ్ర నరసింహ, వేంకటేశ్వర బ్రహ్మోత్సవాలలో భాగంగా కల్యాణం, విహారం, ఉత్తర, దక్షిణ దిగ్యాత్ర  అనంతరం శేషప్ప కళా వేదికపై 
ఏటా వేద పండితులచే వేద సదస్సును నిర్వహించడం ఆనవాయితీ. రుక్, యజుర్, సామ, ఆధర్వణ వేదాలచే దైవారాధన చేయడానికి నిర్ణయించిన క్రమంలో  క్షేత్ర వేద పండితులు, అర్చకులే కాక, లబ్ధప్రతిష్ఠులైన స్థానిక వేదవిదులు అపురూపంగా, అరుదుగా ఒకే వేదికపై ఆసన్నులై, వేద సదస్సు నిర్వహించారు. అధ్యాత్మిక ప్రసంగాలు చేశారు.

Tags